తెలుగు బుల్లితెర యాంకర్లలో ఎక్కువగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు శ్రీముఖి. ఆమె తన అందంతో.. అభినయంతో.. తన కామెడీ పంచులతో ప్రోగ్రాంను ఎంతో ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. ముద్దుగా ఆమెను రాములమ్మ అని పిలుచుకుంటారు. శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంటే అభిమానులకు వచ్చే జోష్ వేరు.
రచ్చ రచ్చ చేస్తూ కామెడీ పంచ్ లు, లౌడ్ వాయిస్ తో షోని విజయవంతంగా నడిపిస్తుంది. తన అందంతో సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అవుతోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వ్యక్తి గత విషయాలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. దీంతో ఆమె తన అభిమానుకు దగ్గరవుతూ ఉంటుంది. తాజాగా ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీముఖికి ఇదివరకే పెళ్లి అయిందంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా బయటకు రావడానికి గల కారణం ఏంటంటే.. తాజాగా శ్రీముఖి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ వీడియో పోటీ చేసింది. ఆ వీడియోతో ఆమె తన అభిమానులకు షాక్ ఇచ్చింది. పెళ్లి ఎప్పుడు అవుతుంది ? కాబోయో వరుడు ఎవరు అనే విషయాలు తెలుసుకునేందుకు ఇంస్టాగ్రామ్ లో ఆమె ఓ గేమ్ ఆడింది. ఈ గేమ్ ద్వారా శ్రీముఖికి ఊహించని షాక్ ఎదురైంది.
నవమన్మథుడా అతిసుందరుడా నను వలచిన ఆ ప్రియుడు అంటూ పాట పాడుకుంటూ శ్రీముఖి ఈ గేమ్ ఆడింది. ఈ గేమ్ లో శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్లు చూపించింది. అది చూసి షాక్ అయిన శ్రీముఖి తొక్కలే అంటూ ఫన్నీగా అంది. దీంతో శ్రీముఖి ఫ్యాన్స్ అక్కా నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా అంటూ ఆమెని సరదాగా ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…