అఖిల్ సార్దక్.. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. ఇదిలా ఉండగా 12 వ వారంలో యాంకర్ రవి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
అతడు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడి ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. ఫేక్ ఎలిమినేషన్ చేశారంటూ.. బిగ్ బాస్ పై చిర్రెత్తిపోతున్నారు. పింకీ, సిరి కంటే తక్కువగా యాంకర్ రవికి ఓట్లు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిలో కూడా ప్రాంతీయ బేధం చూపించారని తెలంగాణ జాగృతి సభ్యులు ఆరోపించారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లు బాగానే ఉన్నారు కానీ.. బయట ఫ్యాన్స్ మాత్రం ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు.
తాజాగా ఓ యూట్యూబర్ షణ్ముఖ్‌పై దారుణ వ్యాఖ్యలు చేశాడు. ‘షణ్నును ఎక్కడో చూసినట్లుంది… పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది మీరే కదా గుర్తుపట్టాను, మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్ నీలాగే ఉంటడు షణ్ను..’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాలో ట్యాగ్ చేసి ఇలా అన్నాడు.
గేమ్ ను గేమ్ లాగే చూడండి.. దయచేపి తప్పుగా మాట్లాడకండి అంటూ అన్నాడు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ను గెలిపించుకోవడం కోసం అవతలి వాళ్లను కించపరచడం అనేది తప్పు అంటూ అతడు చెప్పుకొచ్చాడు. దీనిపై దీప్తి సునయనా స్పందించారు. షణ్ముఖ్ జశ్వంత్ కొరకు స్టాండ్ తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా హౌస్ లో కంటే..ఫ్యాన్స్ మధ్యే హీట్ విపరీతంగా పెరిగిపోతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…