Movie News

Srinu Vaitla: వారు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.. వైరల్ అవుతున్న శ్రీను వైట్ల పోస్ట్?

Srinu Vaitla: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ శీను వైట్ల ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆనందం,సొంతం రెడీ దూకుడు వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న శీను వైట్ల ఆగడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అతనికి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా ఈయనకు అవకాశాలు తగ్గిపోయాయి.

ఇలా అవకాశాలు లేక గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి శ్రీను వైట్ల అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమయంలోనే ఆయన భార్య రూప తనకు ఊహించని షాక్ ఇచ్చింది.గత కొన్ని సంవత్సరాల నుంచి రూప శ్రీనువైట్ల దగ్గర లేదని ఆమె విడిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రూప తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

ఇకపోతే తాజాగా శ్రీను వైట్ల సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.శ్రీను వైట్ల తన ముగ్గురు కూతుర్లతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

కూతుర్లతో ఉన్న ఫోటోని షేర్ చేసిన శ్రీను వైట్ల…

ఈ సందర్భంగా శ్రీనువైట్ల ఈ ఫోటోని షేర్ చేస్తూ జీవితం చాలా అందంగా ఉంటుంది అయితే మనం ప్రేమించిన వాళ్లతో ఉంటే మరింత అందంగా ఉంటుంది.ఈ ముగ్గురు లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేను అంటూ శ్రీనువైట్ల తన కూతుర్లతో దిగిన ఫోటోని షేర్ చేశారు. అయితే ఇక్కడ తన భార్య లేకపోవడంతో నిజంగానే శ్రీనువైట్ల రూపా మధ్య గొడవలు ఉన్నాయని తను వేరుగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago