Srisailam : శ్రీశైలంలో శిఖరేశ్వరం వద్ద ఎలుగుబంటి హల్ చల్ ! ఫారెస్ట్ అధికారులపై భక్తులు ఆగ్రహం!

0
187

Srisailam : శ్రీశైలంలో శిఖరం వద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది గత మూడు రోజుల నుండి శిఖరం దగ్గరికి వచ్చి వెళ్తుంది, శిఖరేశ్వరుడికి భక్తులు సమర్పించిన నూగులు, కొబ్బరి తినేందుకు తరచుగా వచ్చి తింటూ వెళ్తుంది అయితే ఆదివారం రాత్రి శిఖరం వద్దకు వచ్చిన ఎలుగుబంటి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎలుగుబంటిని చూసి భయపడుతున్నారు.

మూడు రోజులుగా ఎలుగుబంటి తరచుగా వస్తుంటే ఫారెస్ట్ అధికారులు పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఫారెస్ట్ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు చొరవతో ఎలుగుబంటి శిఖరం వద్దకు రాకుండా ప్రయత్నిస్తే బాగుంటుందని స్థానికులు అనుకుంటున్నారు శిఖరం వద్ద డ్యూటీ చేసేటువంటి సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు పట్టించు కోకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు…