Rashmika: వామ్మో.. భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీవల్లి.. ఏకంగా ఒక్కో సినిమాకు అన్ని కోట్లా?
Rashmika: ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక వివిధ భాషలలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె దక్షిణాది రాష్ట్రాలలో కాకుండా ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమా అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతుంది. తాజాగా రష్మిక అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే ఈమె తెలుగులో శర్వానంద్ సరసన మరొక సినిమాలో నటించగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పారితోషికం విషయంలో కూడా స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.
పుష్ప సినిమా విజయవంతమైన తర్వాత రష్మిక తన మార్కెట్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా కోసం రష్మిక రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయవంతం కావడంతో రెండవ పార్ట్ పుష్ప: ది రూల్ సినిమా ఫిబ్రవరి నెలలో షూటింగ్ ప్రారంభం చేసుకోనుంది.
వచ్చే నెలలో పుష్ప పార్ట్ 2 చిత్రీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో రస్మిక తన రెమ్యూనరేషన్ ఏకంగా కోటి రూపాయలకి పెంచినట్లు తెలుస్తోంది. పార్ట్ వన్ కి రెండు కోట్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ పార్ట్ 2 కి ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేస్తుందని సమాచారం.అయితే ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకున్న నిర్మాతలు సైతం ఈమె అడిగిన పారితోషకం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…