Sriya Reddy: పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రాధా రామ మన్నార్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు నటి శ్రీయా రెడ్డి . ఈ సినిమా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా ఎంత విజయవంతం కావడంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీయ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ ప్రశాంత్ పొగరు సినిమా చూసిన తర్వాత ఈ పాత్రకు నేనైతే సరిపోతానని చెప్పి ఆయన కథతో నా దగ్గరికి వచ్చారు. ఆయన కథ మొత్తం అద్భుతంగా అనిపించింది కానీ సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో నేను నటించను అని చెప్పాను కానీ ఆయన ఒక చిన్న పిల్లలను ఒప్పించినట్టు నన్ను ఈ సినిమాకు ఒప్పించారని తెలిపారు.
స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాతే సినిమా గురించి ఆలోచించండి అంటూ ప్రశాంత్ చెప్పారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత నాకు ఈ సినిమా తెగ నచ్చి సినిమాకి ఒప్పుకున్నాను అని ఈమె తెలిపారు ఈ సినిమాకు చేసే సమయంలో ప్రశాంత్ ఈ పాత్ర ద్వారా మీకు మంచి పేరు వస్తుంది అంటూ నాకు ప్రామిస్ చేశారు ఆయన చెప్పిన విధంగానే ఈ పాత్రలో నటించినందుకు నాకు మంచి పేరు వచ్చిందని ఈమె తెలిపారు.
ప్రభాస్ స్వీట్ పర్సన్..
ఇకపోతే ఈ సినిమాకు ముందుగా అనుకున్నటువంటి స్క్రిప్ట్ లో నా పాత్ర లేదని అనంతరం లేడీ విలన్ క్యారెక్టర్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతోనే తిరిగి నా పాత్రను తీసుకువచ్చారని ఈమె తెలియజేశారు. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ చాలా స్వీట్ పర్సన్ అని కామెంట్ చేశారు. మొదటి భాగం కొంతమందికి అర్థం కాకపోయినా రెండవ భాగం చూస్తే కనుక ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని రెండవ భాగం మరో లెవెల్ లో ఉండబోతుందని మొదటి భాగం ద్వారా మేము కథను మాత్రమే పరిచయం చేసాము అంటూ శ్రేయ రెడ్డి సలార్ సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…