Suchitra Chandrabos :పాటలో వచ్చే సంగీతానికి పాదం కదిపితే..ఆ పాటకు వచ్చేవన్నే అంతా ఇంతా కాదు. ఒకరు పదం రాస్తే.. ఇంకొకరు పాదం కదుపుతారు. ఆ ఇద్దరు ఎవరో కాదు సినీ పరిశ్రమతో పెనవేసుకున్న జంట సుచిత్ర, చంద్రబోస్. వీరి ప్రేమ వివాహం గురించి ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే.ఎందుకో ఏమో గాని పెళ్లయిన తర్వాత సుచిత్రకు మొత్తానికి మొత్తంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇంట్లో కూర్చోవడం అంటే ఆమెకు ఒక విధంగా బోర్ కొట్టేది. అటువైపుగా చూస్తే అన్నపూర్ణ స్టూడియో.. అందులో అనేక సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూ బిజీగా ఉన్న రోజులు గుర్తుకు వచ్చేవి. ఇంట్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటే.. తాను కొరియో గ్రాఫర్ గా చేసిన పాటలే వచ్చేవి.. వాటిని చూస్తూ రోజంతా గడపడం ఆవిడకి నచ్చలేదు.
ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోను ఒక్కసారి రింగ్ అయ్యేది. తీరా వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తే చంద్రబోస్ ఉన్నారా? అంటూ ఏదో సినిమా కబురు వచ్చేది. మళ్లీ నిరాశే.. అలా ఒక దశలో చాలా మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళేది. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్వయంగా ఒక ఇంటర్వ్యూలో సుచిత్ర వెల్లడించారు. అలా కొన్ని నెలలు నాకు తెలియకుండానే గడిచిపోయాయి. చుట్టూ నిరాశ, నిస్పృహలు అలుముకున్న సమయంలో.. ఒక్కసారిగా ఫోన్ రింగ్ మనీ మోగింది. తీరా చూస్తే అది ఎవరో కాదు. తమిళ దర్శకుడు వసంత్ దగ్గర నుంచి వచ్చింది. ఒకప్పుడు మేమిద్దరం ఒకే తమిళ సినిమాకి పనిచేశాం. ఆ పరిచయంతో హీరో సూర్య జ్యోతికలతో తీయబోయే చిత్రానికి నన్ను కొరియోగ్రాఫర్ గా చేయాలని కోరారు. వెంటనే ఆ సినిమాని నేను ఒప్పుకున్నాను. నేను అప్పటికే ఆరు నెలల గర్భవతిని అనే విషయాన్ని దాచి పెట్టాను.
ఇక సినిమా పాటల అవుట్ డోర్ షూటింగ్ అంటే… కొండలు, గుట్టలు, చెట్ల మధ్య షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అలాంటి చోటునే దర్శకుడు వసంత్ ఎంచుకున్నారు. కొండలు ఎక్కడం.. మరో షార్ట్ కి అవే కొండలు దిగడం లాంటివి జరిగేవి. అయితే ఆ సినిమాలో వచ్చే పాటలో హీరో సూర్య కూర్చుంటే, హీరోయిన్ జ్యోతిక అతని చుట్టూ తిరుగుతూ.. డాన్స్ చేయాల్సి ఉంటుంది. బాతు లాగా గెంతుతూ హీరోయిన్ హీరో చుట్టూ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అన్న ఉద్దేశంతో దర్శకుడికి డక్ స్టెప్పు గురించి చెప్పాను. ఈ డక్ మూమెంట్ బాగుంది. హీరోయిన్ తో మీరే ప్రాక్టీస్ చేయించండి అసిస్టెంట్స్ వద్దు అన్నారు. అలా జ్యోతికకు వచ్చేవరకు ప్రాక్టీస్ మధ్యాహ్నం వరకు చేయించాను.
అప్పటికే చాలా అలసిపోయాను. వసంత్ షూటింగ్ బ్రేక్ ఇస్తావా ? ఆకలవుతుందన్నాను. అందుకు డైరెక్టర్ సరే అని మేమంతా లంచ్ కి వెళ్ళాం. మధ్యలో నేను నడుస్తూ ఉండడం చూసిన వసంత్.. సుచిత్ర మీ పొట్ట తగ్గించుకోవడానికి ఒక ఎక్సర్సైజ్ చెప్తాను చేయమన్నాడు. అందుకు నవ్వి ఊరుకున్నాను. అందరూ కలిసి లంచ్ చేశాం. ఆ తర్వాత రిలాక్స్ అవుతున్న డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో.. ఆయన షాక్ అయి షేక్ అయ్యారు. నాతో అలాంటి కష్టమైన డక్ మూమెంట్ చేయించానని ఆయన లోలోపల చాలా బాధపడ్డారు. నేను ప్రెగ్నెంట్ నని ముందే ఎందుకు చెప్పలేదని అడిగారు. నాకు తెలియక మీతో కష్టమైనా మూమెంట్స్ చేయించినందుకు సారీ అని చెప్పారు. ఆనాటి మెమోరబుల్ ఇన్సిడెంట్స్ ని ఈ ఇంటర్వ్యూలో సుచిత్ర చంద్రబోస్ గుర్తు చేసుకున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…