Sudharshna chakram mistrey : మహా విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం అనగానే శత్రు సంహారం కోసం లోకాన్ని పరిపాలించడానికి ఆ మహా విష్ణువు ఉపయోగించిన ఆయుధంగా అందరికీ తెలుసు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రంతో ఒక్కసారిగా కురుక్షేత్రం లోని శత్రువులందరినీ తుద్ధముట్టించే అవకాశం ఉన్నా శ్రీకృష్ణుడు ఆ పని చేయలేదు. మహా శక్తివంతమైన ఆ సుదర్శన చక్రం పురాణాల ప్రకారం ఎవరు తయారు చేసారు, అసలు ఎలా ఉంటుంది, శ్రీ కృష్ణుడు తర్వాత ఆ ఆయుధం ఎక్కడ ఉంది, మానవులకు కనిపించిందా అనే అంశాలు తెలుసుకుందాం.

మహా విష్ణువు కి శివుని వరం సుదర్శన చక్రం…
శివపురాణం ప్రకారం రాక్షసుల దాడులు ఎక్కువైనపుడు దేవతలందరూ మహా విష్ణువును కాపాడమని శరణు అడిగుతారు. అప్పుడు మహా విష్ణువు శివుని వద్దకు వెళ్లి 1000 తామర పువ్వులతో ఆయనను స్తుతించి అర్చన చేయగా శివుడు మహా విష్ణువు భక్తిని పరీక్షిస్తూ ఒక తామర పువ్వును దాచిపెడతాడు. వేయ తామర పువ్వులు కనిపించకపోదంతో మహా విష్ణువు ఒక పువ్వు లేదని తెలిసీ ఆయన కన్నుని అర్పిస్తాడు. ఆయన ప్రార్థసకు మెచ్చి శివుడు ఆయన తయారు చేసిన సుదర్శన చక్రాన్ని మహా విష్ణువు కు ఇస్తారు. సుదర్శన చక్రం శత్రువుల మీద నేరుగా ప్రయోగించడానికి వీలు కాదు. మహా విష్ణువు మనోబలంతో సంకల్పిస్తేనే సుదర్శన చక్రం పనిచేస్తుంది. శత్రువలన ఒక్కసారిగా బూడిద చేసే సుదర్శన చక్రంను మహా విష్ణువు పార్వతి దేవి వద్ద ఉంచారు. ఆయన శ్రీకృష్ణుడు అవతారం ఎత్తినపుడు పార్వతి దేవి ఆయనకు సుదర్శన చక్రాన్ని మళ్ళీ ఇచ్చారు. శిశుపాలుని చంపడానికి సుదర్శన చక్రసం ఉపయోగించిన శ్రీకృష్ణుడు కురుక్షేత్రం సమయంలో సమయాన్ని ఆపడానికి మాత్రమే సుదర్శన చక్రం వాడారు. మహా భారతంలో చాలా శక్తివంతమైన చక్రం ప్రయోగింపబడింది అని సుదర్శన చక్రం గురించి ప్రస్తావించారు. శ్రీ కృష్ణుడికి బాగా కోపం వచ్చినపుడు మాత్రమే సుదర్శన చక్రం ప్రయోగించేవారు.

ఇతర పురాణాల ప్రకారం సుదర్శన చక్రాన్ని విశ్వకర్మ గారు సూర్యుడి బూడిద నుండి తయారు చేసారు. 10 వేల సూర్యుల శక్తి తో ఒక్కసారిగా కాల్చి బూడిద చేయగల ప్రకాశవంతమైన శక్తి కలిగిన ఈ ఆయుధం శివుని నుండి మహా విష్ణువు కు లోకాన్ని పరిపాలించడానికి ఇచ్చారు. అయితే శ్రీకృష్ణుడు ఈ ఆయుధంతో అంధక రాజ్యాన్ని మొత్తం నాశనము చేసారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. శ్రీకృష్ణుడి మనోవేగంతో ప్రయోగించే ఈ సుదర్షన చక్రం ఎలా ప్రయోగించవచ్చో కేవలం దేవతలకు మాత్రమే తెలుసు. రాక్షసులకు ఈ ఆయుధ రహస్యం తెలిస్తే లోకానికి మంచిది కాదని రహస్యంగా ఉంచారు. శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలేసాక సుదర్శన చక్రం ఎక్కడుంది అనే అనుమానం అందరికీ ఉంటుంది. అత్యంత వేగంగా శత్రువులను కాల్చేయగల సుదర్శన చక్రం సంకల్ప శక్తి తో ప్రయోగింపబడే ఆయుధం అందరికీ కనిపించదు అలాగే మహా విష్ణువు కలియుగం అంతమయ్యే సమయంలో కలి చక్రవర్తిగా వచ్చినపుడు మళ్ళీ సుదర్శన చక్రం ఉపయోగిస్తారు.































