Movie News

Sudheer -Anasuya: ఏంటి అనసూయ.. సుధీర్ పరిస్థితి ఇలా అయ్యింది.. పూర్తిగా బుల్లితెరకు కనుమరుగయ్యారుగా?

Sudheer -Anasuya:బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో అనసూయ సుడిగాలి సుదీర్ వంటి వాళ్లు కూడా ఒకరు.

ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనసూయ వెండితెర అవకాశాలను అందుకొని పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సుధీర్ సైతం వెండితెర అవకాశాలను అందుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమై స్టార్ మా కార్యక్రమంలో సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఇకపోతే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సుడిగాలి సుదీర్ అనసూయ ఏ కార్యక్రమాలలోనూ సందడి చేయడం లేదు. ఇలా వీరిద్దరూ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారనే చెప్పాలి.ఇక స్టార్ మా ఏదైనా ప్రత్యేక ఈవెంట్లు చేసినప్పుడు మినహా వీరిని ఆహ్వానించడం లేదు. ఇక ఒకసారి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయింది.

Sudheer -Anasuya: జబర్దస్త్ వదిలేసి తప్పు చేశారా…

ఈ క్రమంలోనే వీరిద్దరూ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో కొందరు నెటిజెన్స్ ఈ విషయంపై స్పందిస్తూ జబర్దస్త్ వీడి తప్పు చేశారు. అందుకే ఏ ఒక్క షో కూడా వీరి చేతుల్లో లేకుండా పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తిరిగి వీరు ఏదైనా బుల్లితెర కార్యక్రమ అవకాశాలను అందుకుంటారా లేకపోతే హైపర్ ఆది గెటప్ శీను తరహాలోనే తిరిగి జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago