Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మెజీషియన్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈయనకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం రావడం అనంతరం ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి సుదీర్ కు గాలోడు సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందించింది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందుకుంటుంది.
ఇలా గాలోడు సినిమా సక్సెస్ కావడంతో ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఒక సినిమాని రెండున్నర గంటల పాటు తెరపై చూసి ప్రేక్షకులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సినిమా బాగుంటే హిట్టు లేదా ఫట్ అనే రివ్యూ ఇస్తాము.కానీ ఆ సినిమా కోసం తెర వెనక వాళ్ళు ఎంత కష్టపడ్డారో కొన్ని సందర్భాలలో వాళ్లు తెలియజేస్తే తప్ప మనకు తెలియదు.
ఈ విధంగా గాలోడు సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నటువంటి సుధీర్ ఈ సక్సెస్ వెనక ఎంతో కష్టం ఉందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమాలో నీ కళ్ళే దీవాలి అనే పాట కోసం కోసం లద్దాఖ్ వెళ్లామని సుధీర్ తెలిపారు. ఈ ప్రాంతంలో భూమి కన్నా 18 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పాంగ్యాంగ్ లేక్ దగ్గర షూటింగ్ చేసాము అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉండడంతో వెంట సిలిండర్స్ కూడా పట్టుకెళ్లామని తెలిపారు.
బ్రీతింగ్ సమస్యతో బాధపడ్డారు..
ఇక ఇక్కడ చాలామంది బ్రీతింగ్ సమస్యతో కూడా బాధపడ్డారు. సుమారు మైనస్ 30 డిగ్రీల మంచులో ఈ పాట చిత్రీకరణ చేసాము అయితే మొదటి రోజు వెళ్లిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మరుసటి రోజు ఉదయం తిరిగి రావాలని అందరూ భావించారు. అంత రిస్క్ చేసి షూటింగ్ చేయకుండా వెనక్కి వస్తే నిర్మాతలు ఎంతో నష్టపోతారని అలాగే అందరం ఈ పాట చిత్రీకరణ పూర్తి చేసామని తెలిపారు. అయితే పాట షూటింగ్ చేసే సమయంలో ప్రతి షాట్ అయిన తర్వాత తాను ముక్కులో రక్తం క్లీన్ చేసుకుని షాట్ కి వెళ్లేవాడిని.అంత చలిలో ఇలా తనకు ముక్కులో రక్తం కారేదని ఈయన ఈ సందర్భంగా తెలియజేయడంతో సినిమా పట్ల ఇతనికి ఉన్న డెడికేషన్ గురించి అభిమానులు ఫీదా అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…