Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. జగడం సినిమా ద్వారా దర్శకుడిగా మారిన సుకుమార్ ఆ తర్వాత ఆర్య రంగస్థలం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక పుష్ప సినిమాతో దర్శకుడుగా సుకుమార్ స్థాయి మరింత పెరిగింది.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులతో సుకుమార్ బిజీగా ఉన్నాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ సినిమా గురించి తాజాగా ఒక వార్త ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ గా మారింది.
పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా గురించి సుకుమార్ ఎక్కడ ప్రస్తావించలేదు. అంతే కాకుండా ఇప్పుడు ఆ ఊసే లేదు.
ఎక్కడ విజయ్ సుకుమార్ సినిమా గురించి టాక్ వినిపించడం లేదు. అయితే తాజాగా సుకుమార్ మరో స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ప్రభాస్. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఇప్పటికే ఆది పురుష్, ప్రాజెక్ట్ కె , సలార్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో సుకుమార్ తో కూడా ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 తరువాత ప్రభాస్ కోసం సుకుమార్ కథ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సుకుమార్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదల కావలసి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…