కరోనా మహమ్మారి దేశ ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ ని ఎలాగోలా తట్టుకున్న ప్రజలు..ఈ సెకండ్ వేవ్ ను మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు. దీని ప్రభావం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరుగుతుంది. రోజు రోజుకు వేల మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రోజుకి దేశంలో రెండు నుండి మూడు లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పటికే దేశంలో ఆక్సీజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేక కొవిడ్ రోగులు ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏకంగా ఆక్సీజన్ ప్లాంటునే ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు సుక్కూ. 40 లక్షల రూపాయలతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఓ ఆక్సీజన్ ప్లాంట్ నిర్మించడానికి సిద్ధమయ్యారు.వాస్తవానికి మొదట ఆక్సీజన్ సిలిండర్లు, కాన్ సన్ ట్రేటర్లు అందించాలని భావించారు సుకుమార్. ఇందుకోసం రూ.25 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే.. సిలిండర్లను మళ్లీ మళ్లీ నింపిస్తూనే ఉండాలి. కానీ.. అదే ఆక్సీజన్ ప్లాంట్ నిర్మిస్తే.. నిర్విరామంగా ఉత్పత్తి చేయొచ్చుకదా అని భావించారు. దీంతో.. పాతి లక్షలకు మరో 15 లక్షలు కలిపి మొత్తం 40 లక్షలతో ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. డీఓసీఎస్-80 ఆక్సీజన్ జనరేటర్ సిస్టమ్ ప్లాంట్ ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతిత్వరగా మూడ్నాలుగు రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నారు.
దీంతో.. సుకుమార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే.. ఒక్క సుకుమార్ ఒక ప్లాంట్ నిర్మించగలిగినప్పుడు.. మిగతా ఇండ్రస్టీ లో ఉన్న ప్రముఖులు మరిన్ని ప్లాంట్ లను ఏర్పాటు చేయొచ్చు కదా అనే పలు వాదనలు జనాల్లో వినిపిస్తున్నాయి.ఇక సుకుమార్ విషయానికొస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయ్యింది.సినిమాలో బన్నీ ని ఓ లారీ డ్రైవర్ గా చూపించబోతున్నాడు సుక్కు..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…