Movie News

Sunitha Ram Veerapaneni : నా రెండో పెళ్లి గురించి మీకు ఎందుకు…? సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరూ ఇలా మాట్లాడరు.. : సింగర్ సునీత

Sunitha Ram Veerapaneni : సింగర్ సునీత ఉపధ్రష్ట ఎన్నో తెలుగు పాటలు పాడి సింగర్ గా అగ్ర స్థానం లో ఉంది. సౌత్ భాషల్లో పాటలు పాడి బాగా ఫేమస్ అయిన సునీత ఇక సినిమాల్లో డబ్బింగ్ చెప్పి కూడా అంతే ఫేమస్ అయింది. ఇక కేవలం ఆమె గాత్రమే కాకుండా రూపం కూడా చూడచక్కగా ఉండటం వల్ల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కానీ సునీత కు సినిమాల్లో నటించే ఆసక్తి లేక అటు వైపు రాలేదు. ఇక చిన్నవయసులో 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో భర్త నుండి సునీత విడిపోయారు. వాళ్ళు వీడిపోయి చాలా కాలం అయినా మరో పెళ్లి చేసుకోని సునీత గతేడాది మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుంది. ఇక వీరు పెళ్లయ్యాక చాలా ఆనందంగా ఉన్నా కొంతమంది మాత్రం ట్రోల్స్ తో విసుగుపుట్టిస్తున్నారు. అలాంటి వారి గురించే సునీత స్పందించారు.

సంస్కారం లేదా… వదిలేయొచ్చు కదా…

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సునీత తన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక రెండో పెళ్లయ్యాక సునీత ను చాలా మంది మంచి డెసిషన్ తీసుకున్నావ్ అంటూ అభినందిస్తే మరి కొంతమంది మాత్రం కేవలం డబ్బు కోసం, సుఖం కోసం పెళ్లి చేసుకుంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన పెళ్లి మీద వచ్చిన ట్రోల్స్ కి స్పందించింది.

చిత్ర గారి తరువాత అన్ని పాటలు పాడాను, ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాను ఇలా ప్రేక్షకులకు ఎంటర్ టైన్ చేస్తున్నా కదా అవన్నీ వదిలేసి ఎందుకు నా వ్యక్తిగత విషయం గురించి ఇంత దారుణంగా కామెంట్స్ చేయాలి. సంస్కారం ఉన్నవాళ్లు ఇలాంటివి మాట్లాడరు అంటూ ఘాటుగా స్పందించింది. ఇక ఆ విషయం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది సునీత, ఇప్పటికీ ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయంటూ బాధపడింది.

Bhargavi

Recent Posts

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

3 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

3 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

3 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

3 weeks ago

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ చట్టానికి ముగింపు? కొత్త చట్టానికి సిద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

3 weeks ago

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్! ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం – కారణాలు చూసి షాక్ అవుతారు

ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…

3 weeks ago