Supritha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సుప్రీత ఇంకా ఇండస్ట్రీలోకి రాకముందే ఈమె హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక సుప్రీత తన తల్లి సురేఖవాణితో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు.
వీరిద్దరూ కలిసి నిత్యం పార్టీలో పబ్బులు అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సుప్రీత ప్రేమలో పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈమె యూట్యూబర్ నికిల్ విజయేంద్ర సింహతో ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే ఇలా వీరిద్దరి ప్రేమ గురించి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.
వాలెంటైన్స్ డే సందర్భంగా జీ తెలుగు నిర్వహిస్తున్నటువంటి ఓ రెండు ప్రేమ మేఘాలు అనే కార్యక్రమంలో భాగంగా నిఖిల్ కి జోడిగా సుప్రీత రావడం గమనార్హం. ఈ క్రమంలోనే వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరి జర్నీతో పాటే వీరి పరిచయానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు.
ఇక సుప్రీత సైతం తాను నిఖిల్ తో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఏకంగా లవ్ సింబల్ జోడించారు. ప్రేమలో ఉన్నారని సుప్రీత నిఖిల్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉందని పెద్ద ఎత్తున అభిమానులు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే సుప్రీత అతనితో ప్రేమలో ఉందా లేక షో కోసమే ఇలా చేశారా అనే విషయం తెలియాలంటే ఆమె స్పందించాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…