Surekha:ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈమె సోమవారం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ అయ్యారు. అయితే ఆ సమయంలో ఉపాసన వెంట తన భర్త రామ్ చరణ్ తో పాటు ఉపాసన తల్లి అలాగే తన అత్తయ్య సురేఖ కూడా ఉన్నారు. ఇలా ఈమె డెలివరీ కోసం అపోలో హాస్పిటల్ కి వెళ్లినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఉపాసనకు డెలివరీ అవుతున్న సమయంలో తన కోడలు అలాగే తనకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండడం కోసం సురేఖ ఆసుపత్రిలో చేసినటువంటి పని ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈమె ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక గదిలో తన కోడలు తనకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలని దేవుడికి నమస్కరించి హనుమాన్ చాలీసా చదివారట.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు ఆంజనేయస్వామిని ఎంతో భక్తితో పూజిస్తారు.ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాన్నీ కూడా చిరంజీవి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు అలాగే తమకు మనవరాలు కూడా మంగళవారమే జన్మించడంతో మాకెంతో ఇష్టమైనటువంటి మంగళవారం రోజున తమకు మనవరాలు పుట్టడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు.
ఈ విధంగా ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి ఉన్నటువంటి సురేఖ తన కోడలు డెలివరీ అవుతున్న సమయంలో తన క్షేమంగా ఉండాలంటూ హనుమాన్ చాలీసా చదవడంతోనే వీరిద్దరూ చరణ్ పిల్లల కోసం ఎంత ఆత్రుతగా ఎదురు చూశారో అర్థమవుతుంది.ఇక పాప పుట్టింది అనే విషయం తెలియగానే రామ్ చరణ్ ముందుగా తన కుమార్తెను తన చేతులలోకి తీసుకోకుండా తన తండ్రి చేతులలోకి పెట్టి తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూశారట.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…