టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం తన మాత్రమే కాకుండా తన కూతురు సుప్రీతతో కలిసి చేసే వీడియోలు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన కూతుర్ని కూడా ఫేమస్ చేసింది. ప్రస్తుతం సుప్రీత కూడా సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.
ఒక్కోసారి సోషల్ మీడియా వేదికగా సుప్రీతకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే వాటిపై గట్టిగా స్పందిస్తూ రివర్స్ కౌంటర్లు ఇస్తుంటారు. గత కొద్ది రోజుల నుంచి సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని రూమర్లు వస్తూనే ఉన్నాయి.అయితే వీటిపై సుప్రీత సురేఖవాణి ఎన్నోసార్లు స్పందించి క్లారిటీ ఇచ్చారు.తనకు ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని సురేఖవాణి తెలుపగా, తనకు హీరోయిన్ కావాలనే ఆసక్తి లేదని సుప్రీత తెలిపారు.
తాజాగా సురేఖవాణి ఇంస్టాగ్రామ్ ద్వారా లైవ్ లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే తన ఫాలోవర్స్ సుప్రీతను పలు ప్రశ్నలు అడిగి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ క్రమంలోనే సుప్రీతను నెటిజన్లు తన పెట్ గురించి అడగగా లైవ్ లోనే తన పెట్ ను చూపించారు. మరికొందరు తన తల్లి సురేఖవాణిని అడగగా ఆమె వకీల్ సాబ్ సినిమా చూస్తూ బిజీగా ఉన్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఉదయం నిద్ర లేవగానే ఫోన్ లో యాప్ వాడతారు? అనే ప్రశ్న అడిగగా.. అందుకు సుప్రీత మొదటగా స్నాప్ చాట్ చూస్తాను ఆ తరువాత వాట్సప్, ఇన్ స్టాగ్రాంలు చూస్తాను. ఫోన్‌లు చేసినా అంతగా రెస్పాండ్ అవ్వను.. వాటిని చూడను అని అసలు సీక్రెట్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…