పొద్దున్నే లేచి అంటూ సీక్రెట్స్ బయటపెట్టిన సురేఖా వాణి కూతురు?

0
156

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం తన మాత్రమే కాకుండా తన కూతురు సుప్రీతతో కలిసి చేసే వీడియోలు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన కూతుర్ని కూడా ఫేమస్ చేసింది. ప్రస్తుతం సుప్రీత కూడా సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

ఒక్కోసారి సోషల్ మీడియా వేదికగా సుప్రీతకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే వాటిపై గట్టిగా స్పందిస్తూ రివర్స్ కౌంటర్లు ఇస్తుంటారు. గత కొద్ది రోజుల నుంచి సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని రూమర్లు వస్తూనే ఉన్నాయి.అయితే వీటిపై సుప్రీత సురేఖవాణి ఎన్నోసార్లు స్పందించి క్లారిటీ ఇచ్చారు.తనకు ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని సురేఖవాణి తెలుపగా, తనకు హీరోయిన్ కావాలనే ఆసక్తి లేదని సుప్రీత తెలిపారు.

తాజాగా సురేఖవాణి ఇంస్టాగ్రామ్ ద్వారా లైవ్ లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే తన ఫాలోవర్స్ సుప్రీతను పలు ప్రశ్నలు అడిగి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ క్రమంలోనే సుప్రీతను నెటిజన్లు తన పెట్ గురించి అడగగా లైవ్ లోనే తన పెట్ ను చూపించారు. మరికొందరు తన తల్లి సురేఖవాణిని అడగగా ఆమె వకీల్ సాబ్ సినిమా చూస్తూ బిజీగా ఉన్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఉదయం నిద్ర లేవగానే ఫోన్ లో యాప్ వాడతారు? అనే ప్రశ్న అడిగగా.. అందుకు సుప్రీత మొదటగా స్నాప్ చాట్ చూస్తాను ఆ తరువాత వాట్సప్, ఇన్ స్టాగ్రాంలు చూస్తాను. ఫోన్‌లు చేసినా అంతగా రెస్పాండ్ అవ్వను.. వాటిని చూడను అని అసలు సీక్రెట్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here