మరి కొద్ది రోజులలో బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి సోషల్ మీడియాలో రోజుకొక వార్తలు పుట్టుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి రోజురోజుకు ప్రేక్షకులలో మరింత ఆసక్తి కలుగుతోంది . సెప్టెంబర్ ఐదు నుంచి బిగ్ బాస్ ప్రసారం కాబోతుందని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. అలాగే ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొనే వాళ్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లలో సినిమా ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సురేఖవాణి పేరు కూడా వినబడుతుంది. ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనుందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే తనపై వస్తున్న వార్తల గురించి స్పందించిన సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
తాను బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశారు. అయితే పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే డిలీట్ చేయడంతో ఈ విషయంపై ప్రేక్షకులు మరిన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే సురేఖవాణి బిగ్ బాస్ ఎంట్రీ పై ఉన్న సందేహాలకు తాజాగా తన కూతురు సుప్రీత చెక్ పెట్టారు.
సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే సుప్రీత తాజాగా లైవ్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీ మమ్మీ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనుందా.. అంటూ ప్రశ్నించగా ఆ ప్రశ్నకు సుప్రీత తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మమ్మీ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వలేదని.. తనకు బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చదని సుప్రీత తెలపడంతో సురేఖ బిగ్ బాస్ లో పాల్గొనలేదని తెలుస్తోంది.
తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…