అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో నడుస్తున్నటువంటి “పుష్ప” సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ బయటకు వచ్చింది. ఆగస్టు 13వ తేదీ ఉదయం “దాక్కో దాక్కో మేక”అనే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటలో అల్లు అర్జున్ తన నటనా విశ్వరూపాన్ని చూపించారు.
ఒకేసారి 5 భాషలలో ఐదు మంది సింగర్స్ చేత పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తెలుగులో శివం అనే సింగర్ ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. అయితే ఈ పాట పై కాంట్రవర్సి హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ… తనదైన శైలిలో కామెంట్ చేశారు.ప్రస్తుతం పూనమ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియా వేదికగా పూనమ్ కౌర్ చేసే కామెంట్లు పలు వివాదాలకు కారణం అవుతాయన్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఈ మెగా హీరోలపై కామెంట్ చేయడం కొత్తేమీ కాదు.అసలు ఈమె కామెంట్ చేస్తే ఎవరిని ఉద్దేశించి చేస్తుందో కూడా అర్థం కాకుండా కామెంట్లు చేయడం ఈమెకే చెల్లుతుంది. ఈ క్రమంలోనే పుష్ప ఫస్ట్ సింగిల్ పై కూడా తనదైన శైలిలో కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే పుష్ప ఫస్ట్ సింగిల్ పై స్పందించిన పూనమ్ బన్నీని ప్రశంసలతో ముంచెత్తారు.బన్నీ లుక్, యాటిట్యూడ్, అతని నటనకు ఫిదా అయినట్టు కనిపిస్తోంది. హార్డ్ వర్క్ అంటే ఇదే అంటూ పుష్ప ఫస్ట్ సింగిల్ పై పూనం ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…