Categories: FeaturedMovie News

Surya Kiran : మోహన్ బాబు గారిది మిలిటరీ క్రమశిక్షణ… మనోజ్ సినిమా కోసం అలా చేస్తాడు..!

Surya Kiran : చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల చిత్రాల్లో చేసిన సూర్య కిరణ్ రజనీకాంత్, కమలహాసన్ వంటి దిగ్గజ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక సూర్య కిరణ్ చెల్లి సుజిత కూడా చా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసారు. పలు సీరియల్స్ లో నటిస్తూ సుజిత తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సూర్య కిరణ్ మాత్రం నటనకు బ్రేక్ ఇచ్చి డైరెక్టర్ గా పెద్దయ్యాక సినిమాల్లోకి వచ్చాడు.

మోహన్ బాబు అలాంటివాడు…

సత్యం సినిమాతో సినిమాల్లోకి వచ్చిన సూర్యకిరణ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత సరైన మార్గ నిర్దేశనం లేకపోవడం వల్ల పెద్ద హీరోలను కలిసి కథ చెప్పి సినిమా చేసుంటే కెరీర్ వేరేలాగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. రాజు భాయ్ సినిమా సమయంలో మోహన్ బాబు తో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటిపై క్లారిటీ ఇచ్చాడు సూర్య కిరణ్. మోహన్ బాబు గారు మంచి వ్యక్తి, నిర్మాత గా బెస్ట్ నిర్మాత. అయితే ఆయన మిలిటరీ క్రమశిక్షణ పాటిస్తారు.

సమయపాలన ఎక్కువ ,ఉదయం ఏడు గంటలకు షాట్ పెట్టాలంటే ఏడుకి పెట్టాల్సిందే లేకపోతే కోపం వస్తుంది. లేదంటే ఆయనంత గొప్ప ప్రొడ్యూసర్ లేడు. ఇక మంచు మనోజ్ చాలా కష్టపడతాడు. సినిమాకోసం ఏం కావాలన్నా నిజాయితీగా కష్టపడుతాడు అంటూ రాజు భాయ్ సమయంలో సంఘటనలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్న సూర్య కిరణ్ త్వరలో బాలకృష్ణ తో, ప్రభుదేవాతో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. వారితో సినిమాలు చేసి మళ్ళీ కెరీర్ లో మంచి పొజిషన్ కి రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago