Surya Kiran : చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల చిత్రాల్లో చేసిన సూర్య కిరణ్ రజనీకాంత్, కమలహాసన్ వంటి దిగ్గజ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక సూర్య కిరణ్ చెల్లి సుజిత కూడా చా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసారు. పలు సీరియల్స్ లో నటిస్తూ సుజిత తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సూర్య కిరణ్ మాత్రం నటనకు బ్రేక్ ఇచ్చి డైరెక్టర్ గా పెద్దయ్యాక సినిమాల్లోకి వచ్చాడు.

మోహన్ బాబు అలాంటివాడు…
సత్యం సినిమాతో సినిమాల్లోకి వచ్చిన సూర్యకిరణ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత సరైన మార్గ నిర్దేశనం లేకపోవడం వల్ల పెద్ద హీరోలను కలిసి కథ చెప్పి సినిమా చేసుంటే కెరీర్ వేరేలాగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. రాజు భాయ్ సినిమా సమయంలో మోహన్ బాబు తో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటిపై క్లారిటీ ఇచ్చాడు సూర్య కిరణ్. మోహన్ బాబు గారు మంచి వ్యక్తి, నిర్మాత గా బెస్ట్ నిర్మాత. అయితే ఆయన మిలిటరీ క్రమశిక్షణ పాటిస్తారు.

సమయపాలన ఎక్కువ ,ఉదయం ఏడు గంటలకు షాట్ పెట్టాలంటే ఏడుకి పెట్టాల్సిందే లేకపోతే కోపం వస్తుంది. లేదంటే ఆయనంత గొప్ప ప్రొడ్యూసర్ లేడు. ఇక మంచు మనోజ్ చాలా కష్టపడతాడు. సినిమాకోసం ఏం కావాలన్నా నిజాయితీగా కష్టపడుతాడు అంటూ రాజు భాయ్ సమయంలో సంఘటనలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్న సూర్య కిరణ్ త్వరలో బాలకృష్ణ తో, ప్రభుదేవాతో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. వారితో సినిమాలు చేసి మళ్ళీ కెరీర్ లో మంచి పొజిషన్ కి రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.



























