Featured

Swapna Dutt: కథ నచ్చినా కూడా ఆ సినిమా నిర్మించలేకపోయాను.. స్వప్న దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

Published

on

Swapna Dutt: హీరోలు సినిమాలలో నటించాలంటే వారికి కథ నచ్చాలి. అయితే కొన్ని సందర్భాలలో కథ నచ్చినా కూడా ఇతర కారణాల వల్ల సినిమా నటించటానికి వీలు లేక బాధపడిన సందర్భాలు ఉంటాయి. అలాగే నిర్మాతలు కూడా కథ నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమాలను నిర్మించలేకపోతున్నారు. చాలామంది నిర్మాతల విషయంలో ఇలాంటి సంఘటన జరిగే ఉంటుంది. అచ్చం ఇలాంటి సంఘటన ప్రముఖ మహిళా నిర్మాత స్వప్న దత్ కి కూడా ఎదురయింది.

ఇండస్ట్రీలో మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన స్వప్న దత్ తన కెరీర్ లో కూడా కథ నచ్చి.. సినిమా నిర్మించలేకపోయానని ఫీల్ అవుతున్న సందర్భం ఒకటుందని ఇటీవల వెల్లడించింది. మహానటి, జాతి రత్నాలు, సీతారామం వంటి సినిమాలతో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో స్వప్న ఒకరు. ఇటీవల ఒక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తను ఎంతో ఇష్టపడి ఒక సినిమా నిర్మించాలనుకున్నప్పటికీ ఒకే ఒక్క కారణం చేత ఆ సినిమాను నిర్మించకుండా ఇప్పటికీ బాధపడుతున్నానని వెల్లడించింది.

ఇంతకీ స్వప్న దత్ నిర్మించలేకపోయిన ఆ సినిమా ‘అర్జున్ రెడ్డి’ . విజయ్ దేవరకొండ హీరోగా.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
అర్జున్ రెడ్డి సినిమాతో అటు హీరోగా విజయ్ కి, ఇటు డైరెక్టర్ సందీప్ కి మంచి గుర్తింపు లభించింది. అయితే అలాంటి సినిమాని తాను నిర్మించలేకపోయినందుకు చాలా బాధ పడ్డానని స్వప్న దత్ తెలిపింది.

Advertisement

Swapna Dutt: ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసింది ఏంటి అనుకుంటారేమో…

ఈ ఇంటర్వ్యు లో స్వప్న మాట్లాడుతూ.. “అర్జున్ రెడ్డి కథ నాకు చాలా నచ్చింది. దాన్ని నిర్మించాలని కూడా ఎంతో ఆశపడ్డాను. కానీ.. ఒకవేళ ఆ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా.. ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందేంటి? అని అంటారని భయపడ్డాను. అలా ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ బాధగా ఉంది.” ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Trending

Exit mobile version