Swathi Muthyam Movie: బెల్లంకొండ గణేష్ వర్ష బొల్లమ్మ జంటగా స్వాతిముత్యం అనే సినిమా ద్వారా నేడు ఎంతో ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా పండుగ సందర్భంగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇలా రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం విడుదల కావడంతో అందరి దృష్టి ఈ సినిమాని ఆకర్షించింది.
లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా నాగార్జున చిరంజీవిలతో పోటీపడి మరి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుందని చెప్పాలి.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు.
ఈ సినిమాలో ఓ బోల్డ్ కంటెంట్ ఉందని అయితే అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సి ఉందని చిత్ర బృందం సస్పెన్స్ పెట్టారు.అయితే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా హీరో సుమంత్ నటించిన ఒక ఫ్లాప్ సినిమా కథను పోలి ఉందని అచ్చం అదే సినిమాను కాపీ చేశారనే భావన అందరిలో కలుగుతుంది.
సుమంత్ నటించిన నరుడా డోనరుడా అనే సినిమా 2016వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సుమంత్ వీర్యకణాలను దానం చేస్తూ ఉంటారు.ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమాని నిలిపివేయాలంటూ విడుదలకు ముందే పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కూడా అలాంటి బోల్డ్ సన్నివేశం ఉందని అయితే ఈ సినిమాకు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఆ బోల్డ్ కంటెంట్ ను మేకర్స్ హైడ్ చేశారని చెప్పాలి. మరి స్వాతిముత్యం సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…