Swathi Sathish : సినిమా ఇండస్ట్రీలో అందం ఉంటేనే అవకాశలు వస్తాయి లేదంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎవరూ పట్టించుకోరు. దీంతో అందం మీద బాగా శ్రద్ధ పెడుతుంటారు సెలబ్రిటీలు. ఇక మరీ ముఖ్యంగా హీరోయిన్లు అందం తరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే వయసు రీత్యా అందం తగ్గడం అందరికీ మామలే కానీ అలా ముఖం మీద వయసు తాలూకు ముడతలు కనిపించకుండా బోటాక్స్ ఇంజక్షన్ చేయించుకుంటూ, కసరత్తులు చేస్తూ వారి పాట్లు వారు పడుతుంటారు.
సర్జరీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి…
ఇక ఈ మధ్యకాలంలో ముఖానికి సర్జరీలు చేయించుకుంటూ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని ఆశ పడుతుంటారు. టాప్ హీరోయిన్లతో మొదలుకుని చాలా మంది చిన్నా చితకా క్యారెక్టర్ ఆర్టిస్టులు, సీరియల్ నటులు ఇక ఈ మధ్య అయితే యూట్యూబ్ ఛానల్ తో ఫేమస్ అయిన వాళ్ళు కూడా సర్జరీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సర్జరీలు అందుబాటులోకి రావడంతో ఇలా చాలా మంది వీటికి మొగ్గుచూపుతున్నారు. ఇక ఆ సర్జరీలు సఫలమైతే ఎటువంటి బాధ లేదు, కానీ వికటిస్తే ఏంటి పరిస్థితి, అన్నదే ప్రశ్న. ఇటీవల నాగార్జున తో కలిసి సూపర్ సినిమాలో నటించిన అయేషా టకీయ సర్జరీ వికటించడం వల్ల ఎంతలా మారిపోయిందో చూసాం. ఇక మరో టాప్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సర్జరీ వల్ల ప్రాణాలే కోల్పోయింది. కానీ చాలా మంది సెలబ్రిటీలు ఇవన్నీ పట్టించుకోకుండా అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు.
ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ‘ఎఫ్ ఐ ఆర్, 6 టు 6’ వంటి సినిమాల్లో నటించిన స్వాతి సతీష్ రూట్ కెనాల్ థెరపీ కోసం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. అయితే రెండు మూడు రోజుల్లో వాపు తగ్గుతుందని డాక్టర్లు చెప్పినా, మూడు వారాలు దాటినా ఇంకా వాపు తగ్గక పోవడంతో పాటు నొప్పి తగ్గలేదు. దీంతో ఆమెకు పలు సినిమా ఆఫర్లు కూడా వెళ్లిపోయాయి. ఇక గుర్తుపట్టలేనంతగా స్వాతి సతీష్ మారిపోయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…