Tag Archives: Akhanda Movie

Allu Aravind: బాలయ్యకు దగ్గరవుతూ చిరుని పక్కన పెడుతున్న అల్లు అరవింద్.. ఒంటరవుతున్న చిరు?

Allu Aravind:తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఎలాంటి మంచి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. చిరంజీవి అల్లు అరవింద్ ఇద్దరు వరుసకు బావ బావమరిది అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి అన్యోన్యత ఉండేది. ఏ చిన్న వేడుక జరిగిన మెగా అల్లు కుటుంబం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఆ వేడుకను జరుపుకునే వారు.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ క్రమక్రమంగా మెగాస్టార్ చిరంజీవిని దూరం పెడుతూ నందమూరి నటసింహం బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని వార్తలు వినపడుతున్నాయి.

ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా అల్లు అరవింద్ వ్యవహార శైలి చూస్తే అందరికీ ఇది నిజమేనని అర్థమవుతుంది. అల్లు అరవింద్ ఆహా సమస్థను స్థాపించి ఇందులో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలయ్యను తీసుకువచ్చారు. ఇలా ఈ కార్యక్రమంతో వీరి బంధం బలపడింది.ఇక గతంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా వెళ్లారు.

Allu Aravind: బాలయ్యకు దగ్గరవుతున్న అల్లు అరవింద్…

ఇకపోతే అల్లు అరవింద్ త్వరలోనే తన బ్యానర్ లో బాలకృష్ణ చేత ఓ సినిమా చేయనున్నారని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.ఇకపోతే అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా అల్లు అరవింద్ చిరంజీవిని దూరం పెడుతూ బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని తెలుస్తోంది.

Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?

Akhanda Movie: గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అన్ని రంగాలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా వైరస్ ప్రభావం చిత్రపరిశ్రమకు కూడా భారీ నష్టాలను తీసుకు వచ్చిందని చెప్పాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు నోచుకోలేక వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా వైరస్ కారణంగా విడుదలకు వెనకాడరు.

Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?

ఇలాంటి సమయంలోనే బాలకృష్ణ ఎంతో ధైర్యం చేసి అఖండ సినిమాను విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో ఒకవైపు కరోనా వైరస్ వెంటాడుతూ ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ బాలకృష్ణ అఖండ సినిమా విడుదల అయ్యి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ధైర్యం నింపింది అని చెప్పాలి.

Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎవరైనా థియేటర్లకు వస్తారా? రారా అన్న అనుమానంతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకొని మిగతా సినిమాలకు ధైర్యం నింపింది. అఖండ విడుదలైన తర్వాత అల్లు అర్జున్ పుష్ప, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, నాగార్జున బంగార్రాజు, రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ మంచి కలెక్షన్లను కూడా రాబట్టాయి.

లక్షల్లో నష్టాలు….

ఇలా వరుసగా విడుదలైన ఈ సినిమాలలో ఏ సినిమా మంచి విజయం సాధించిందనే విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అంటూ డిస్ట్రిబ్యూటర్లు బల్లగుద్ది చెబుతున్నారు.ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ గోదావరి జిల్లాలోని ఒక థియేటర్లో అఖండ సినిమా విడుదలైంది. ఇదే థియేటర్లోనే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్, బంగార్రాజు, పుష్ప, రాధే శ్యామ్, త్రిబుల్ ఆర్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఒక్క అఖండ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లకు లక్షలలో నష్టాన్ని తీసుకువచ్చాయి. దీన్ని బట్టి చూస్తే మిగిలిన సినిమాల కన్నా అఖండ హిట్ కొట్టిందని డిస్ట్రిబ్యూటర్ లో తెలియజేస్తున్నారు.

Akhanda Movie : బాలయ్య మూవీపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరోలు… ఎవరంటే ?

Akhanda Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు మరోవైపు ఓటిటి లో ప్రేక్షకులను అలరిస్తూ బాలయ్య సందడి చేస్తున్నారు. ఇటీవల బాలయ్య నటించిన అఖండ సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

bollywood actors interested to remake bala krishna akhanda movie

ఇక ఇటీవలే సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ” అఖండ “. బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత కలెక్షన్ల సునామీ సృష్టించింది అఖండ. ఈ సినిమాకు ముందు ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన క‌లెక్ష‌న్స్‌ 47 కోట్లు మాత్రమే. అది కూడా ఏపీలో పన్ను మినహాయింపు ఇస్తే వచ్చాయి.

bollywood actors interested to remake bala krishna akhanda movie

అలాంటిది అఖండ మాత్రం ఏకంగా రూ.75 కోట్ల షేర్ వసూలు చేసింది. అందులోనూ కరోనా సమయంలో సినిమా వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసింది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమా గురించి మిగిలిన ఇండస్ట్రీలు మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో అఖండ సినిమా రీమేక్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. ముందు దీన్ని అక్కడ డబ్బింగ్ చేసి విడుదల చేయాలి అని ఆలోచన కూడా ఉండేది.

ఆ ఇద్దరిలో మూవీ రీమేక్ చేసేది ఎవరంటే !

బాలయ్యకి అంత ఇమేజ్ లేకపోవడంతో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా రైట్స్ కోసం బాలీవుడ్‌లో ఇద్దరు హీరోలు బాగా ప్రయత్నిస్తున్నారు. ఒకరు అక్షయ్ కుమార్, మరొకరు అజయ్ దేవ్‌గ‌ణ్‌. వీరిద్దరూ మాస్ యాక్షన్ హీరోలు కావడంతో వారికి అయితే అఖండ సినిమా పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక వీరిలో ఒకరు అఖండ సినిమా రీమేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Akhanda Movie Producer: ‘అఖండ’ నిర్మాత గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Akhanda Movie: ‘అఖండ’ మూవీ భారీ హిట్ కొట్టింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటన విశ్వరూపానికి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. బోయపాటి, బాలక్రిష్ణ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్ కొట్టడంతో అఖండ సినిమాపై  ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో థియేటర్లకు ఆడియన్స్ తరలివెళ్లి పెద్ద హిట్ చేశారు. దీనికి తోడు థమన్ మ్యూజిక్ కూడా అఖండ సినిమాకు ప్లస్ అయింది. 

అయితే తాజాగా ఈసినిమా నిర్మాతపై అందరి చూపు పడింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమాకు. ద్వారకా క్రియేషన్ నిర్మాణ సారథ్యంలో అఖండ హిట్ సాధించింది. భారీ వసూళ్లను రాబట్టింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ల జాబితాలో చేరాడు. సూర్యాపేట జిల్లాలో పుట్టిన మిర్యాల రవీందర్ రెడ్డి ఐరన్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రాణించాడు.

అయితే సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో తొలిసినిమా గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చి ’సాహసం శ్వాసగా సాగిపో‘ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆతరువాత ’ జయ జానకీ నాయక‘ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. మూడో సినిమాగా.. బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రాన్ని నిర్మించి సూపర్ హిట్ కొట్టాడు. 2018లో బోయపాటి ఈ కథను పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలకు వినిపించారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి ముందుకు రావడంతో ద్వారకా క్రియేషన్ పై అఖండను నిర్మించారు. 

కలెక్షన్లపై కూడా ఓ అంచనా ఉందట..

అయితే భారీ బడ్జెట్ పెడుతున్నానని రవీందర్ రెడ్డి ఏం భయపడలేదట.. అఖండ యూనివర్సల్ సబ్జెక్ట్ అని తప్పని సరిగా విజయం సాధిస్తుందని.. కలెక్షన్లు ఎంత వస్తాయనేదానిపై కూడా అంచనా ఉందట. సినిమాను ప్రస్తుతం హిందీలో తీయాలని అనుకుంటున్నారట రవీందర్ రెడ్డి. అఖండను హిందీలో తీస్తే అజయ్ దేవ్ గన్ హీరోగా సరిపోతారని అనుకుంటున్నారు. త్వరలో అల్లు అర్జున్- బోయపాటి ల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి కూడా ఈయన ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.

Akhanda Movie: అఖండ రీమేక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి.. హిందీలో రీమేక్ చేస్తే వారితోనే చేస్తా అంటూ..!

Akhanda Movie: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకుని ప్రేక్షకులను సందడి చేసింది. ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.అయితే నేడు మిరియాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Akhanda Movie: అఖండ రీమేక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి.. హిందీలో రీమేక్ చేస్తే వారితోనే చేస్తా అంటూ..!

ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అఖండ సినిమా విజయవంతం అవుతుందని నాకు ముందే తెలుసు.ఈ సినిమా విజయం గురించి దర్శకుడు హీరోలు ఎప్పుడూ మాట్లాడకపోయినా తాను మాత్రం సినిమా తప్పకుండా విజయం అవుతుందని ఎన్నోసార్లు వెల్లడించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులకు కావలసినంత మాస్ కంటెంట్ ఉంది ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని మొదట్లోనే భావించినట్లు తెలిపారు.

Akhanda Movie: అఖండ రీమేక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి.. హిందీలో రీమేక్ చేస్తే వారితోనే చేస్తా అంటూ..!

ఇక ఈ సినిమా ఈ సీక్వెల్ చిత్రాన్ని తీయాలనే కోరిక తనలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇకపోతే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలు అయితే ఈ కథకు సెట్ అవుతారనేది తన అభిప్రాయమని రవీందర్ రెడ్డి వెల్లడించారు.

పెద్ద హీరోలతోనే కాదు చిన్న హీరోలతో కూడా సినిమా తీస్తా:

తాను కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా మంచి కథ దొరికితే చిన్న హీరోలతో కూడా సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఒక కొత్త హీరోని తమ నిర్మాణంలో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరొక భారీ బడ్జెట్ మూవీ సంప్రదింపులలో ఉందని త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన విడుదల చేస్తామని ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి తెలియజేశారు.

ఏ దర్శకుడు తీసుకోని విధంగా బోయపాటికి రెమ్యూనరేషన్.. ఎంతో తెలుసా?

సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు హిట్ అయితేనే హరోలకు అయినా.. సినీ దర్శకులకు అయినా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హీరోలు కాస్త బెటర్ అనే చెప్పాలి. ఒక్క సినిమా ఫ్లాప్ అయిందంటే.. తర్వాత సినిమాపై అంతగా ఎఫెక్ట్ చూపకపోవచ్చు. కానీ దర్శకుల విషయానికి వస్తే అలా కాదు.

వరుస సినిమాలు హిట్ కొట్టినా.. మరుసటి చిత్రం ప్లాప్ అయిందంటే.. అతడి వెంట నిర్మాతలు కన్నెత్తి కూడా చూడరు. ధైర్యం చేసి అతడితో సినిమా తీయడానికి అస్సలు ముందుకు రారు. అయితే ఈ అనుభవం బోయపాటి శ్రీనుకు ఎదురైంది. వరుస సినిమాలతో ఊపు మీదున్న బోయపాటికి వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ అయింది.

దీంతో అతడితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. అంతక ముందు బోయపాటి సినిమాకు రూ.5కోట్లు తీసుకునేవాడు. కానీ ఒక్క ప్లాఫ్ తో సీన్ రివర్స్ అయిపోయంది. అప్పటి వరకు సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకున్న బోయపాటి.. తాజాగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ స్పష్టిస్తున్న అఖండకు మాత్రం తీసుకోలేదట. ఈ సినిమా రూ.70కోట్లతో రూపొందుతుందని.. ముందుగానే నిర్మాతకు చెప్పాడట.

బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. దాని కారణంగానే శ్రీను ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. సినిమా విడుదల తర్వాత మాత్రం లాభాల్లో షేర్స్ ఇస్తారని సమాచారం. ఇక అఖండ కలెక్షన్ల సునామీలో బోయపాటికి దాదాపు రూ.10 కోట్ల వరకు లాభం రావొచ్చనేది టాక్.

అఖండలో విలన్ గా నటించిన శ్రీకాంత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా ఇటీవలే డిసెంబర్ 2న విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే. విడుదల అయిన రెండు రోజులకే దాదాపుగా 40 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అఖండ హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు రోజులు అవుతున్నా కూడా టికెట్ల కొరత ఏర్పడుతోంది. ఆన్ లైన్ లో సైతం టికెట్లు దొరకడం లేదు. థియేటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఇక ఇందులో విలన్ క్యారెక్టర్ లో హీరో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. అలాగే ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శ్రీకాంత్ ఈ సినిమాతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో విలన్ క్యారెక్టర్ వరదరాజులు పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు శ్రీకాంత్. ఇకపోతే ఈ సినిమాకు గాను శ్రీకాంత్ ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా కోసం శ్రీకాంత్ కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకున్నారని సమాచారం. ఈ సినిమాలో కొన్ని పలు సన్నివేశాల్లో నటించిన శ్రీకాంత్ ఊహించని స్థాయిలో పారితోషకం తీసుకోవడం గమనార్హం. దర్శకుడు బోయపాటి తన సినిమాలలో శ్రీకాంత్ కు మంచి మంచి పాత్రలు ఇస్తూ కెరిర్ కు బాగా హెల్ప్ అవుతున్నారు

శ్రీకాంత్ కూడా విలన్ జగపతి బాబులాగా సినిమాలలో బిజీ అవుతారని ఫ్యాన్స్ భావించినప్పటికీ, శ్రీకాంత్ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురవుతోంది. ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్న శ్రీకాంత్ తర్వాత ఇది ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి మరి. ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ పలు సినిమాల్లో నటించినప్పటికీ, అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి. శ్రీకాంత్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాకు నిర్మాతలు భారీగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.

బాలయ్య కంటే ముందుగా అఘోరగా నటించిన హీరోలు ఎవరో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు.ఒక పాత్రలో మురళీకృష్ణ పాత్రలో నటించగా, శివుడి పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. ఇందులో బాలయ్య అఘోరాగ తన విశ్వరూపం చూపించారు.ఇలా ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు.

ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్ర సినిమాకి మరింత హైలెట్ అయ్యింది. బాలకృష్ణ కన్నా ముందుగానే పలువురు హీరోలు ఘోర పాత్రలలో నటించారు. మరి ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ కన్నా ముందుగా ఘోర పాత్రలో నటించారు. మరి ఈ హీరోలు ఏ సినిమాలో అఘోరగ కనిపించారు అనే విషయానికి వస్తే…

మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అర్జున్, సౌందర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శ్రీ మంజునాథ. ఇందులో చిరంజీవి శివుడి పాత్రలో నటించారు.ఈ సినిమాలో ఒక సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి ఆఘోరాగా కనిపించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రంగా వచ్చినటువంటి నాగవల్లి చిత్రంలో వెంకటేష్ అఘోరా పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా చంద్రముఖి సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక నాగార్జున డమరుకం సినిమాలో ప్రకాష్ రాజు శివుడి పాత్రలో కనిపించగా నాగార్జున ఒక సన్నివేశంలో ఆఘోర పాత్రలో కనిపించారు. ఇలా బాలకృష్ణ కన్నా ముందుగా ఈ హీరోలు అఘోరాలుగా నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయక పోయినప్పటికీ బాలకృష్ణ నటించిన అఖండ సినిమా మాత్రం అఖండమైన విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.

‘అఖండ’లో కనిపించిన ఆ గిత్తల చరిత్ర.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఓటీటీల వినియోగం పెరుగుతున్న కొద్ది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. అలాంటి పరిస్థితుల్లో కొందరి ప్రముఖ హీరోల చిత్రాలు కాస్త ఊరటనిచ్చాయి. కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిగాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ విడుదల కావడంతో థియేటర్ల యాజమాన్యాలు ఊపిరిపీల్చుకున్నాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా.. రవీందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ఏరియా ఏదైనా ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లకు కొత్త వెలుగును తీసుకొచ్చింది. ఇదంతా ఇలా ఉంటే.. సినిమాలో కనిపించిన బసవన్నలు(కోడెలు) చౌటుప్ప ల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందినవట. ఆ కోడేల పేర్లు.. కృష్ణుడు, అర్జునుడు.

గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్‌ స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. అందులో రెండేళ్ల క్రితం రెండు గిత్తలను కొనుగోలు చేసి ఇక్కడనే పెంచుతున్నాడు. అంతే కాదు వాటికి నిత్యం వివిధ రకాల శిక్షణ ఇస్తూ.. పేరు పెట్టి పిలిస్తే వచ్చే విధంగా తర్పీదు ఇచ్చాడు. అతడు ఓ రోజు సొంత పని కోసం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాడు.

అక్కడ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ గిత్తలకు సంబంధించి విషయం వచ్చింది. దీంతో అతడు వాళ్లకు తన గిత్తలకు సంబంధించి వీడియో చూపించాడు. వాళ్లకు ఆ గిత్తల నైపుణ్యం నచ్చడంతో షూటింగ్‌కు ఆహ్వానించారు. సంవత్సరం క్రితం రెండు రోజుల పాటు ఇవి షూటింగ్ లో పాల్గొన్నాయి. సినిమాలో ఇవి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి. సినిమా మొదట్లో.. చివర్లో కనిపిస్తాయి.
ఇలా బాలయ్య సినిమాలో తన కోడెలు నటించడం ఆనందంగా ఉందని శ్రీనివాస్‌ తెలిపాడు.

అఖండ సినిమా విలన్ ఒక ఆర్మీ ఆఫీసర్ అని మీకు తెలుసా?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా “అఖండ”. ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. సినిమా విడుదల అయిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఒకవైపు బాలకృష్ణ నటన మరోవైపు బోయపాటి టేకింగ్.. మరో వైపు తమన్ సంగీతానికి ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మొదటి సారిగా శ్రీకాంతో మెయిన్ విలన్ పాత్రలో శ్రీకాంత్ నటించాడు. నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ శ్రీకాంత్ అంతకముందు చేసినా.. ఇంత భారీ సినిమాల్లో ఇంతవరకు చేయాలేదు. అతడి నటన కూడా అదరినీ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ తో పాటు మరో నటుడు నితిన్ మెహతా కూడా కనిపించారు. అతడు సైన్యంలో 21 ఏళ్ల పాటు సేవలను అందించాడు.

అతడికి ప్రొఫెషనల్ మోడల్ గా, నటుడిగా మారాలని ఎన్నో కలలు కన్నారట. దాని కోసం ఎంతో ప్రయత్నించి.. తనకుఎంతో ఇష్టమైన ఆర్మీ యూనిఫామ్ ను సైతం వదులుకున్నారట. బాలీవుడ్ లో ‘కాబిల్’, ‘భూమి’ వంటి సినిమాల్లో నటించారాయన. సౌత్ లో కూడా రెండు, మూడు సినిమాల్లో నటించారు. కానీ ఏదీ సరైన గుర్తింపును తీసుకురాలేకపోయింది. ‘అఖండ’ మాత్రం అతడికి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఈ సినిమాతో హాట్ టాపిక్ గా మారారు నితిన్ మెహతా. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైన సమయంలో నితిన్ అందరి దృష్టి ఆకర్షించాడు. అచ్చం త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా ఉన్నారంటూ సోషల్ మీడియాలలో మీమ్స్ కూడా వచ్చాయి. నితిన్ మెహతా నటనకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అతడు తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ఇతర భాషల్లో అతడికి అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.