Tag Archives: brahmanandam

Bangarraju Movie: బంగార్రాజు సినిమాలో బ్రహ్మానందం లేక పోవడానికి కారణం ఇదే: నాగార్జున

Bangarraju Movie: కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఇలా మొదటి వారం అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా కోసం నాగార్జున పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Bangarraju Movie: బంగార్రాజు సినిమాలో బ్రహ్మానందం లేక పోవడానికి కారణం ఇదే: నాగార్జున

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో బ్రహ్మానందం లేకపోవడం గురించి పలువురు సందేహాలను వ్యక్తపరిచారు.

Bangarraju Movie: బంగార్రాజు సినిమాలో బ్రహ్మానందం లేక పోవడానికి కారణం ఇదే: నాగార్జున

అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం ఎందుకు లేరు అనే విషయం గురించి నాగార్జున క్లారిటీ ఇచ్చారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా తండ్రి కొడుకులకు సంబంధించిన కథతో వచ్చినది.అలాగే బంగార్రాజు సినిమా తాతా-మనవడు కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయాన్ని నాగార్జున గుర్తు చేశారు.

ఆత్మానందం పాత్రలో బ్రహ్మానందం…

సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో బ్రహ్మానందం ఆత్మానందం పాత్రలో నటించారు. అయితే బంగార్రాజు సినిమాలో తాతా మనవడు స్టోరీ ఉండటంవల్ల బ్రహ్మానందాన్ని తీసుకోలేదు.ఒకవేళ ఆయనని కనుక తీసుకొని ఉంటే ఈ సినిమా 30 సంవత్సరాలకు పైబడిన స్టోరీ కాకుండా.. 85 సంవత్సరాలకు పైబడిన స్టోరీగా చూపించాల్సి వస్తుంది కనుక ఈ సినిమాలో బ్రహ్మానందం గారిని తీసుకోలేదని నాగార్జున తెలిపారు.

సమంత ఐటెం సాంగ్ లో బ్రహ్మానందం వర్షన్ వీడియో వైరల్.. మీరూ చూడండి..

నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకుంటూ.. సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే నాగచైతన్యకు సంబంధించి లవ్ స్టోరీ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉండగా.. సమంత మాత్రం తన గ్లామర్ డోస్ ను పెంచేసి.. ఐటం సాంగ్ లు చేస్తుంది. పెళ్లికి ముందు ఇలాంటి పాత్రలు చేయని సమంత.. ఒక్కసారిగా.. పెళ్లి తర్వాత మాత్రం రంగస్థలం, ఫ్యామిలీ మెన్ 2 లో బోల్డ్ పాత్రలో నటించింది.

రంగస్థలంలో లిప్ లాప్ సీన్ చేయగా.. అది గ్రాఫిక్స్ అని తేలిపోయింది. తర్వాత ఫ్యామిలీ మెన్ 2 లో మాత్రం బోల్డ్ సీన్లలో నటించిందనే చెప్పాలి. అదే ఆమెకు విడాకుల వరకు తీసుకొచ్చిందని కొందరు అంటున్నారు. ఇక పుష్ప ఐటెం సాంగ్ తో అభిమానుల గుండెల్లో రైల్లు పరుగెత్తించింది సమంత. పుష్పలో ఆమె ఐటెం సాంగ్ చేయగా.. అది డిసెంబర్ 10 న విడుదలైంది. ఈ లిరికల్ వీడియో విడుదల చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి.

‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. ‘ సాంగ్ లో లిరిక్స్ కొంచెం డబుల్ మీనింగ్ తో ఉన్నాయనే చెప్పాలి. దీంతో ఈ సాంగ్ పై ప్రేక్షకులు, నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అంతే కాకుండా.. ఆ సాంగ్ కు సోషల్ మీడియాలో బ్రహ్మానందం వర్షన్ వీడియో వైరల్ గా మారింది. మీమ్స్ లో ఎక్కువగా ఉపయోగించే ఫొటో బ్రహ్మానందందే. ప్రస్తుతం వాళ్లు వీడియోలో కూడా ఉపయోగించుకుంటున్నారు.

సమంత ఐటెం సాగ్ ను ఎడిట్ చేసి.. బ్రహ్మానందం నటించిన సినిమాలోని కొన్ని క్లిప్ లను తీసుకొని ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ సాంగ్ పై దేవీశ్రీప్రసాద్ కూడా స్పందించి అద్భుతం అంటూ కామెంట్ చేయండం విశేషం. దీంతో ఈ బ్రహ్మానందం వర్షన్ సాంగ్ తెగ వైరల్ అయిపోయింది.

కమెడియన్ బ్రహ్మానందంను మనసారా నవ్వించే వ్యక్తి ఉన్నారని మీకు తెలుసా?

కమెడియన్ బ్రహ్మానందం ఈయన పేరు వినగానే చాలా మందికి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది.అలా కామెడీకి మారుపేరుగా నిలిచిన నటుడిగా బ్రహ్మానందం ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్నారు.మూడున్నర దశాబ్దాల కాలం నుంచి బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అద్భుతమైన కామెడీ ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులను నవ్విస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

బ్రహ్మానందం తన సినీ కెరీర్లో సుమారు 1200 చిత్రాలకు పైగా నటించి రికార్డు సృష్టించారు. ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్న బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో వయసు పైబడటం వల్ల సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. అయితే ఇతను సినిమాలకు దూరంగా ఉండటం వల్ల తనకు అవకాశాలు తగ్గిపోయాయని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో బ్రహ్మానందం తనకు అవకాశాలు తగ్గలేదని తానే అవకాశాలను తగ్గించుకున్నానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇలా కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన బ్రహ్మానందం తన శరీరానికి విశ్రాంతి కావాలని అందుకే సినిమాలలో నటించడం లేదని తెలిపారు.ఇక కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మానందాన్ని మనస్ఫూర్తిగా నవ్వించే వ్యక్తి ఒకరు ఉన్నారని ఆ వ్యక్తి ఎవరు అనే విషయం గురించి ఈయన ఒక కార్యక్రమంలో తెలిపారు.

బ్రహ్మానందం మనవడు పార్ధు తన కుటుంబంలోకి వచ్చిన తర్వాత తనని బాగా నవ్విస్తున్నాడని తెలిపారు. ఏ విషయం గురించి అయినా తను మాట్లాడినప్పుడు నీకు తెలియదులే తాత అలా కాదు అంటూ మాట్లాడతాడని, అలా కాదు నాన్న అంటూ నేను వివరించే ప్రయత్నం చేసిన రామకృష్ణ అంటూ తల బాదుకుంటూ తనని మనస్ఫూర్తిగా నవ్విస్తాడని ఈ సందర్భంగా బ్రహ్మానందం తన మనవడు గురించి తెలిపారు.

నాకు అవకాశాలు తగ్గలేదు.. నేనే అవకాశాలను తగ్గించుకున్నా: బ్రహ్మానందం

తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాలలో కమెడియన్ బ్రహ్మానందం లేని సినిమా లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే రాను రాను బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించేశారు. అయితే ఆయన ఎందుకు సినిమాలు తగ్గించారు? ఆయనే సినిమాలు తగ్గించారా? లేక ఆయనకు అవకాశాలు రాక ఇండస్ట్రీకు దూరంగా ఉన్నారా?అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాలపై స్పందించారు బ్రహ్మానందం. తాను యాక్టింగ్ కి ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పుకొచ్చారు.

దాదాపుగా నేను గత 35 ఏళ్ల నుంచి 3,4 షిఫ్ట్ లు పని చేస్తూ వచ్చాను. ఈ క్రమంలోనే సరైన తిండి తినక, నిద్ర లేక, తిన్నది అరగక వాంతులు చేసుకుంటూ ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అయితే ప్రస్తుతం నా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అనుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవడానికి కొంత డబ్బును పోగొట్టుకున్న నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ అసలు నిజాన్ని బయట పెట్టేసాడు బ్రహ్మానందం.

అదేవిధంగా తనపై వస్తున్న మీన్స్ పై స్పందిస్తూ.. నాపై మీన్స్ చేసే వాళ్లకు థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే నేను సినిమాల్లో నటించకపోయినా ఇప్పటికీ నన్ను జనాలు మర్చిపోకుండా గుర్తు చేసేలా చేస్తున్నా మీన్స్ క్రియేటర్స్ ని, వాళ్ళ ప్రయత్నాన్ని సైతం మెచ్చుకోవాల్సిందే అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం సినిమాల కోసం కాకుండా తన కోసం తానే బతుకుతున్నారని చెప్పుకొచ్చారు.

వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.. ఎలా అయినా హ్యాపీనే..

బ్రహ్మానందం.. తెలుగులో ప్రతీ ప్రేక్షకుడు అతడి కామెడీ అంటే పడి చచ్చిపోతాడు. అంతలా కామెడీని పండించడంలో దిట్ట. అస్సలు కామెడీ అనేది అతడే స్పష్టించాడేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంటుంది. అంతలా అతడి హావభావాలు ఉంటాయి. అతడు ఆ సినిమాలో ఉన్నాడంటే.. సినిమా హిట్ అనేది మినిమం గ్యారెంటీ. గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

దానికి చిన్న చిన్న కారణాలు ఉన్నాయంటూ అతడు ఇటీవల ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరై తెలిపాడు. దానికి సంబంధించి ప్రోమో ఒకటి విడుదలైంది. ఆ ప్రోమోలో బ్రహ్మానందం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కమెడియన్ అలీ అడిగిన ప్రశ్నలకు అతడు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు.

లెక్చరర్‌గా ఉన్న తాను నటుడిగా ఇన్ని కోట్ల మంది ప్రజలను నవ్వించగలనని నమ్మిన వ్యక్తి కీర్తి శేషులు జంధ్యాలని చెప్తూ బ్రహ్మానందం భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే తాను భగవంతుడు, తల్లిదండ్రుల తర్వాత కృతజ్ఞత చెప్పుకోవాల్సింది జంధ్యాల గారికేనని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కన్నెగంటి బ్రహ్మానందం.. ఎక్కడ పుట్టారు..? ఎక్కడ పెరిగారు..? ఎక్కడ చదివారు..? ఎక్కడ సెటిల్‌ అయ్యారు..’? అని అలీ అడగ్గా..

బ్రహ్మానందం ఇలా సమాధానం చెబుతారు.. ఇవన్నీ ఎందుకురా అంటూ నవ్వుతూ అంటాడు. ఇక బ్రహ్మానందం అంటే హ్యాపీనా..? బ్రహ్మిగాడు అంటే హ్యాపీనా..? అన్న ప్రశ్నకు ఎవరు పిలిచినా పలకడం మన బాధ్యత కదా. మీమ్స్‌ క్రియేట్‌ చేసిన వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.. నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్లే కదా అంటూ సమాధానం చెబుతాడు బ్రహ్మానందం.

ఆ సమయంలో బ్రహ్మానందం, కోవై సరళ పెద్ద గొడవ.. రామానాయుడు పిలిచి ఏమన్నారో తెలుసా? : డైరెక్టర్ రాజా వన్నెం రెడ్డి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథ రచయితగా, డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ రాజ వన్నేం రెడ్డి ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఈయన దర్శకత్వంలో మా ఆయన బంగారం, మీ ఇంటికొస్తే ఏమిస్తావ్ మా ఇంటికొస్తే ఏం తెస్తావ్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా బ్రహ్మానందం నటించారు. అయితే బ్రహ్మానందానికి స్క్రిప్ట్ నచ్చకపోతే మారుస్తారు అనే మాటలు విని పడుతుంటాయి అది ఎంతవరకు నిజం అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన మాట్లాడుతూ బ్రహ్మానందం గారు అలా ఎప్పుడూ చేయరని ఆయనకు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసని, తనవరకు బ్రహ్మానందం గురించి ఎలాంటి సమస్య లేదని వివరించారు.

ఇక క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా షూటింగ్ సమయంలో బ్రహ్మానందం కోవై సరళ బాగా గొడవ పడిన సంఘటన ఒకటి షూటింగ్ చేయాలి.అయితే ఇలా చేయాలి అలా చేయాలి అని చెబుతున్న సమయంలో మీరు ఒకసారి వచ్చి చేసి చూపించండి అని చెప్పారు. ఆ సమయంలో నేను,ఫణి ప్రసాద్ అనే నా స్నేహితుడు ఇద్దరం కలిసి ఆ సన్నివేశాన్ని చేసి చూపించాము.అతను కోవేసరల గెటప్ వేయగా నేను బ్రహ్మానందం గెటప్ లో చేసి చూపించాను.

అయితే మేము ఎలా అయితే చేసామో వారిద్దరు కూడా అలాగే చేసి ఆ సన్నివేశంలో బాగా గట్టిగా కొట్టుకున్నారని తెలిపారు.అయితే సెట్ లో ఇంత పెద్ద గొడవ జరిగి అందరూ గూమి ఉంటే రామానాయుడుగారు ఏం జరిగిందా అంటూ అక్కడికి వచ్చారని అయితే తను వచ్చిన విషయం ఎవరికీ చెప్పకుండా దూరం నుంచి నటనను చూస్తూ ఉన్నారు. చివరికి షాట్ ఓకే అయిన తర్వాత రామానాయుడు గారు మా దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి చాలా అద్భుతంగా చేశారు. కీప్ ఇట్ అప్ అంటూ తనని పొగిడారని, తనతో ఒక సినిమా చేస్తానని ఆరోజు రామానాయుడుగారు చెప్పారని ఈ సందర్భంగా డైరెక్టర్ రాజా వన్నెం రెడ్డి వెల్లడించారు.

వామ్మో ఈ కమెడియన్స్ భార్యలను చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంత అందంగా ఉన్నారో తెలుసా?

సాధారణంగా ఒక సినిమా అద్భుతంగా ఉండాలంటే అందులో కామెడీ కూడా ఎంతో అవసరం. కొన్ని సినిమాలు కామెడీ ద్వారా విజయాన్ని అందుకున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు తమదైన శైలిలో అద్భుతమైన కామెడీని పండిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక కమెడియన్ అనగానే వారి జీవితం కాస్త భిన్నంగా ఉంటుందని చాలా మంది భావిస్తాము. అయితే వెండితెరపై బుల్లితెరపై సందడి చేసే కమెడియన్స్ వారి భార్యలు ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి.

సీనియర్ కమెడియన్ లలో ఒకరైన బ్రహ్మానందం అందరికీ సుపరిచితమే ఈయన లక్ష్మి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు.

ఎన్నో సినిమాలలో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ 1994 లో జుబేదా సుల్తానాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ సుపరిచితమే.

ఎన్నో సినిమాలలో తాగుబోతు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి తాగుబోతు రమేష్ గా పేరు సంపాదించుకున్న ఇతను 2015లో స్వాతి అనే అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశారు. ప్రస్తుతం తాగుబోతు రమేష్ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు.

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఆటో పంచులు గురించి అందరికీ తెలిసిందే రాంప్రసాద్ తన చిన్ననాటి స్నేహితురాలు అరుణను వివాహం చేసుకున్నారు.

జబర్దస్త్ కమెడియన్ల లో ఒకరైన గెటప్ శీను సుదీర్ చెల్లెలు ఫ్రెండ్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఎన్నో సినిమాలలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ 2002లో శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

భారీగా తగ్గిపోయిన బ్రహ్మానందం రెమ్యూనరేషన్.. ఎందుకంటే!

కమెడియన్ బ్రహ్మానందం అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఒకప్పుడు బ్రహ్మానందంలేని సినిమా అంటూ ఉండేది కాదు. కొన్ని సినిమాలు ఈయన కామెడీ ద్వారా విజయవంతమయ్యాయి అంటే అతిశయోక్తి లేదు. అంతగా తన కామెడీతో ప్రేక్షకులను సందడి చేసిన బ్రహ్మానందం వందల సినిమాల్లో నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందారు. బ్రహ్మానందం లేని సినిమాలు ఉన్నాయంటే ఆ సినిమా ప్రేక్షకులకు ఒక వెలితిగానే ఉండేది. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మానందం ఒకప్పుడు గంటకు లక్ష రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునే వారు.

ఈ విధంగా బ్రహ్మానందం ఒక రోజుకు దాదాపు పది గంటలపాటు పని చేసి రోజుకు 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందం ఆ తర్వాత క్రమంగా సినిమా అవకాశాలు తగ్గడమే కాకుండా అతని రెమ్యునరేషన్ కూడా తగ్గిపోయిందని చెప్పవచ్చు.ఈ విధంగా సినిమా అవకాశాలు తగ్గడంతో బ్రహ్మానందం రోజుకు ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన బ్రహ్మానందం తాజాగా జాతిరత్నాలు సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. మరి ఈ సినిమాలో నటించడం కోసం బ్రహ్మానందం ఎంత తీసుకున్నారు అనే విషయానికి వస్తే ఈ సినిమా కోసం బ్రహ్మానందం 5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఐదు రోజుల షూటింగ్ కలిపి.

ఒకప్పుడు రోజుకు ఐదు లక్షలు తీసుకునే బ్రహ్మానందం ప్రస్తుతం రోజుకు ఒక లక్ష మాత్రమే తీసుకోవడం గమనార్హం.అయితే ప్రస్తుతం బ్రహ్మానందంకు వయసు పైబడటమే కాకుండా ఎంతో మంది యంగ్ కమెడియన్స్ రావడం చేత ఇతనికి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఒకవేళ అవకాశం వచ్చినా కూడా బ్రహ్మానందం పూర్తిగా కూర్చుని చేసే పాత్రలే ఆశిస్తూ ఉండడంతో అతనికి అవకాశాలు కూడా తగ్గాయని చెప్పవచ్చు.

బిగ్ బాస్ 5 లోకి ఎంట్రీ ఇస్తున్న బ్రహ్మానందం కొడుకు!

బుల్లితెరపై మరి కొద్ది రోజులలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 5 గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ వీళ్ళే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బ్రహ్మానందం కొడుకు బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది.అయితే నిజంగానే బ్రహ్మానందం గారి అబ్బాయి బిగ్ బాస్ లోకి వస్తున్నారు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.

బ్రహ్మానందం కొడుకు అంటే అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకు పాత్రలో అల్లరి చేసిన కుర్రాడి పేరు దీపక్ సరోజ్. ప్రస్తుతం చదువులను పూర్తిచేసుకున్న యువకుడు సినిమా ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఇతనికి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అతడి సినిమాలు బ్రహ్మానందం కొడుకు పాత్రలు ఎంతో అద్భుతంగా నటించాడు.

దీపక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారు 20 సినిమాల వరకు నటించి ఆ తర్వాత చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.ఈ క్రమంలోనే 2014వ సంవత్సరంలో మిణుగురులు సినిమాలు నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించినందుకు గాను దీపక్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన దీపక్ ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఎంతో ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇతనికి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించవచ్చని బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నారు. మరి బిగ్ బాస్ ద్వారా దీపక్ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా క్వారంటైన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

టాలీవుడ్ టాప్ కమెడియన్ ఒకరోజు పారితోషికం ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

సినిమాలలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్స్ కి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు కామెడీ ద్వారా కూడా ప్రజలను ఆకట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి. అందుకే సినిమాలలో కమెడియన్స్ కదా అంటూ మనం వారిని ఏమాత్రం చులకన చేయకూడదు. ఎందుకంటే కమెడియన్స్ సంవత్సరం పొడవునా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతూనే ఉంటారు. కానీ హీరో హీరోయిన్లు ఏడాదికి ఒక్క సినిమా తీసిన వారు సంపాదించిన దానికి రెట్టింపుగా వీరు కూడా సంపాదిస్తారని చెప్పవచ్చు.

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కమెడియన్స్ ఉన్నారు. అయితే ఈ స్టార్ కమెడియన్ ప్రతిరోజు షూటింగ్ లో పాల్గొంటే రోజుకు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏ కమెడియన్ రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయానికి వస్తే..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెన్నెలకిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒక రోజు సెట్లోకి అడుగు పెడితే 2 నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం రోజుకు 3 లక్షలు తీసుకోగా, అలీ 3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ రోజుకు 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.

కమెడియన్ సప్తగిరి కామెడీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా మొత్తం ఎంతో హాస్యాస్పద భరితంగా ఉంటుందని చెప్పవచ్చు.మరి ఒక రోజు సప్తగిరి సెట్ లో అడుగు పెడితే 2లక్షల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తారట. పోసాని 2.5 ఐదు లక్షలు తీసుకోగా, రాహుల్ రామకృష్ణ 2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ రోజుకు 2 లక్షల పారితోషికం తీసుకోగా, కమెడియన్ ప్రియదర్శి రోజుకు 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతేకమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రతి రోజుకు 2 లక్షల వరకు చార్జి చేస్తుంటారని సమాచారం.