Tag Archives: chandrababu

AP politics: జన్మభూమి కమిటీలతో చంద్రబాబు భారీ దోపిడీ: సజ్జల రామకృష్ణ

AP politics: ఎన్నికల హడావిడి మొదలవడంతో అధికార పక్షంపై ప్రతిపక్షం ప్రతిపక్షంపై అధికారపక్షం మాటల యుద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే అధికార పార్టీ నేత, వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల మహాదోపిడి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి గురించి ఉందని ఈయన తెలియచేశారు ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రలోభ పెట్టి ఎలా దోపిడీ చేశారనే విషయాలు ఇందులో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో భారీ స్థాయిలో దోపిడీ చేశారని సజ్జల పేర్కొన్నారు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు దోపిడీ చేయడం కోసం వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేసారు అనే విషయాలను కూడా ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించి ఉందని తెలిపారు. రాజకీయం అంటే సంక్షేమం కాదని దోపిడీ అనే సరికొత్త నిర్వచనం చంద్రబాబు నాయుడు తెలియచేసారని వెల్లడించారు. ఇక అధికారం కోసం చంద్రబాబు బిజెపి పవన్ కళ్యాణిని వాడుకుంటున్నారని తెలిపారు.

అధికారం కోసం ఆఖరి ప్రయత్నం..
అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని ఈయన ఎద్దేవా చేశారు. ఇక ఇటీవల షర్మిల అధికార ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడే మాటలను ప్రజలు గమనిస్తున్నారని ఈమె ఇలా మాట్లాడుతుంది అంటే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తుందని ఈయన తెలియజేశారు. మన దేశానికి అవినీతిని పరిచయం చేసినదే చంద్రబాబు నాయుడు అని ఆయన రాజకీయ లబ్ధి కోసం సొంత భార్యను కూడా వాడుకున్నారు అంటూ ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Chandrababu: కెసిఆర్ బాటలోనే చంద్రబాబు.. చండీయాగం వెనుక బాబు వ్యూహం ఇదేనా?

Chandrababu: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తరచు హోమాలు యోగాలు, రాజశ్యామల యోగం వంటివి చేస్తూ ఉంటారు ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాను సీఎంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇలాంటి యాగాలు హోమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.

చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి శుక్రవారం ఉండవల్లి నివాసంలో పెద్ద ఎత్తున హోమాలను ప్రారంభించారు. మూడు రోజులపాటు ఈ హోమ కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుస్తది. అయితే ఈ యాగం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

చంద్రబాబు నాయుడుకు సాధారణంగా భక్తి అంటే తక్కువ అని చెప్పాలి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాలలో ఈయన పాల్గొంటూ ఉంటారు. అయితే ఉన్నఫలంగా ఇలాంటి హోమం చేయడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే ఈయన హోమం చేస్తున్నారంటూ పలువురు భావించారు.

రాష్ట్ర సంక్షేమం కోసమే..

ఇకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి ఈ పూజా కార్యక్రమాలను హోమాలను చేస్తున్నారని మరికొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చండీయాగం, సుదర్శన నరసింహ హోమం చేశారు. అంతేకాదు శుక్రవారం నుంచి 3 రోజుల పాటు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమం చేస్తున్నారు. తొలి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు మూడు రోజులపాటు జరుగునున్నాయని తెలుస్తుంది.

Nandigam Suresh: జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే దమ్ము ఎవరికీ లేదు… ఎంపీ నందిగాం సురేష్ సంచలన వ్యాఖ్యలు?

Nandigam Suresh: తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి నేతలలో భయం పట్టుకుంది అంటూ ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ రావడంపై ఏపీలో ఎవరికీ ఎలాంటి ఆందోళన లేదంటూ వైఎస్ఆర్సిపి నేతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర చేశారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగాం సురేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సురేష్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడుకి పక్కవారి బిడ్డలను ఎత్తుకోవడం బాగా అలవాటైందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణలో 8 చోట్ల పోటీ చేయక స్వతంత్ర అభ్యర్థి శిరీషకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.

ఇక లోకేష్ తన రెడ్ బుక్ పట్టుకొని తిరిగే పాదయాత్రకు వస్తున్నారు. ఆయన ఆ బుక్ లో ఎవరి పేరు రాశారో తెలియదు కానీ ఏపీ ప్రజలు మాత్రం పవన్, లోకేష్ చంద్రబాబు పేర్లను రాసుకున్నారని తెలియజేశారు. రాప్తాడు అంటేనే ఒకప్పుడు ఫ్యాక్షన్లకు మారుపేరు. ఇప్పుడు ఎవరి పని వారు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు ఫ్యాక్షన్ కి తావు లేకుండా ప్రకాష్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారంటూ ప్రకాష్ రెడ్డి పై సురేష్ ప్రశంసలు కురిపించారు.

రాప్తాడులో కనిపించని ఫ్యాక్షన్…

ఇక కొంతమంది టిడిపి నేతలు జగన్ గురించి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నికలలో ఓడిస్తామని ఆయనని అధికార పీఠం నుంచి దింపి అండమాన్ పంపిస్తామంటూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం ఆయనని బెదిరించే దమ్ము ధైర్యం ఎవరికీ లేవు అంటూ ఈ సందర్భంగా తనదైన స్టైల్ లో సురేష్ మాస్ వార్నింగ్ ఇస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Manchu Manoj: బాబు గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసమే వచ్చాము…. చంద్రబాబు భేటీ అనంతరం మనోజ్ కామెంట్స్!

Manchu Manoj: మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు ఇలా మౌనిక మనోజ్ చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారన్న విషయం తెలియడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు కారణమైంది. అసలు మనోజ్ చంద్రబాబు నాయుడుని కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు.

ఇలా సోమవారం సాయంత్రం భూమా మౌనికతో పాటు మనోజ్ వీరి కుమారుడు కూడా చంద్రబాబు నాయుడుని కలిసారు. అనంతరం మనోజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో భేటీ కావడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ… పెళ్లి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకున్నాము కానీ కుదర లేకపోయిందని తెలిపారు.

ఈ క్రమంలోనే అంకుల్ హైదరాబాద్ లో ఉన్నారని తెలియగానే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చామని మనోజ్ తెలిపారు. ఇక రేపు మా బాబు పుట్టినరోజు అందుకే అంకుల్ బ్లెస్సింగ్స్ కోసం వచ్చామని ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.


Manchu Manoj: క్యాజువల్ గానే కలిసాము…

మీరు రాజకీయాలలోకి రాబోతున్నారా అంటూ మనోజ్ ను ప్రశ్నించగా ఆ విషయం ఒక మంచి తరుణంలో మౌనిక తెలియచేస్తారని మనోజ్ తెలిపారు దీన్ని బట్టి చూస్తుంటే బహుశా మౌనిక రాజకీయాలలోకి రాబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన అనంతరం కొన్ని క్యాజువల్ విషయాల గురించి తాము మాట్లాడుకున్నామంటూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ramgopal Varma: నందమూరి ఫ్యామిలీలో తారక్ ఒక్కడే అసలైన మగాడు: వర్మ

Ramgopal Varma:నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వర్మ మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొనడానికి రాలేదని తెలిపారు. కేవలం ఒక జోక్ చెప్పడానికి ఇక్కడికి వచ్చానని ఇది చాలా సీరియస్ జోక్. ఈ జోక్ వింటే ఎవరు కూడా నవ్వరని వర్మ తెలియజేశారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అని తెలిపారు.

చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని కొందరు అంటున్నారు అయితే ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తికి అవగాహన లేదా అవగాహన లేని వ్యక్తికి ఎందుకు పూజలు చేస్తున్నారు దండలు వేస్తున్నారని ప్రశ్నించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి వారు సైతం చంద్రబాబు పక్కనే కూర్చుని వాళ్లను పోగిడారు. ఇది ఒక రకంగా రజినీ కాంత్ కూడా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడొస్తున్నట్టే.

Ramgopal Varma: Jr.NTR ఒక విధానానికి కట్టుబడి ఉన్నారు…

ఇక మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్ మాత్రమే. వాళ్లందరితో పాటు వేదికను పంచుకోకుండా, అక్కడికి వెళ్లకుండా ఉన్నారు. అందుకు కారణం వాళ్ల తాత మీద ఉన్న విపరీతమైన గౌరవంతో Jr.NTR ఒక విధానానికి కట్టుబడి ఉన్నాడంటూ ఎన్టీఆర్ గురించి రాంగోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hero Suman: చంద్రబాబు టైం బాగాలేదు… రజని మాట్లాడిన మాటలలో తప్పులేదు: సుమన్

Hero Suman: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఈయన ఎన్టీఆర్ తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి కూడా తెలియజేశారు.ఇలా రజనీకాంత్ చంద్రబాబు గురించి గొప్పగా మాట్లాడటంతో వైఎస్ఆర్సిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు దీంతో రజినీకాంత్ పై విమర్శలు చేయడంతో రజనీ ఫ్యాన్స్ హీరో రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రజనీకాంత్ వైఎస్ఆర్సిపి పార్టీ పేరు కూడా పలకలేదు కేవలం ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాత్రమే మాట్లాడారు అందుకే ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై నటుడు సుమన్ స్పందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో మాట్లాడిన మాటలలో ఏ మాత్రం తప్పు లేదని ఆయన తెలిపారు.

Hero Suman: చేసింది చేయలేదని చెప్పలేం కదా..


చంద్రబాబు నాయుడు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని రాజకీయాలన్న తర్వాత ఎత్తు పల్లాలు సర్వసాధారణం అయితే చంద్రబాబు నాయుడు టైం బాగాలేక ప్రజలు మార్పును కోరుకున్నారని కానీ ఆయన చేసింది చేయలేదని చెప్పడం భావ్యం కాదు అంటూ సుమన్ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bandla Ganesh: విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు కలయికపై బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్…. పిచ్చి కూతలు ఆపు అంటూ భారీ ట్రోల్!

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్నారు అయితే ఈయన కొన్నిసార్లు సమయం సందర్భం లేకుండా చేసేటటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు ఈ వ్యాఖ్యలపై ఇతనిని భారీగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్ కి గురయ్యారు బండ్ల గణేష్.

నందమూరి తారక రత్న మరణించడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు తరలివచ్చే ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే తారకరత్న మరణ వార్తతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా తనకు నివాళులు అర్పించడానికి వచ్చారు.ఇక అలేఖ్య రెడ్డి స్వయానా వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు కావడంతో విజయసాయిరెడ్డి కూడా ఇక్కడ ఉండి అన్ని తానే చూసుకున్నారు.

తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించి అనంతరం విజయసాయిరెడ్డితో కలిసి మాట్లాడారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని అసలు మాట్లాడను… అవసరం వస్తే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతా అది నా నైజం.

Bandla Ganesh: బతికితే సింహంలా బతకాలి…


అత్యంత బాధాకరమైన విచిత్రం ఇది.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అంటూ ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ పై ఎంతోమంది నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బండ్ల గణేష్ నీ పిచ్చి కూతలు ఆపు అంటూ కొందరు కామెంట్లు చేయగా,వారు కలిసిన సమయం సందర్భం ఏది నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? ఆ మాత్రం సంస్కారం లేదా అంటూ పెద్ద ఎత్తున బండ్ల గణేష్ పై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Chandrababu: గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే ఇవే నా చివరి ఎన్నికలు: చంద్రబాబు నాయుడు

Chandrababu:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు పర్యటనలో భాగంగా ఈయన అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున తర పార్టీని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వివరించారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి తాను అడ్డుపడుతున్నానని అధికార పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధికార పార్టీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ఈయన మండిపడ్డారు. ఇకపోతే పత్తికొండలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సమయంలో ఆయనకు వికేంద్రీకరణ సెగ తగిలింది.

కొందరు రోడ్లపై బైఠాయించి గో బ్యాక్ చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల చోరవుతో చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకు పంపించారు. ఇకపోతే బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తుంటే వైసీపీ గుండాలు చెలరేగిపోతున్నారు అలాగే ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.

Chandrababu: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు..

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తాను ఈ వైసీపీ గుండాల పని పడతాను అంటూ ఈయన మాట్లాడారు.ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తానని లేదంటే ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది.

Unstoppable Season 2: 1995 బిగ్ డెసిషన్ స్పందించిన చంద్రబాబు.. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను.. నేను చేసింది తప్పా? బాలకృష్ణ ఏమన్నారో తెలుసా?

Unstoppable Season 2: టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా అన్ స్థాపబుల్ విత్ ఎన్బికే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహా లో ప్రసారమైన ఈ షో బాగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తో సంచలనం సృష్టించింది. బాలయ్య ఈ షోకీ హోస్ట్ గా వ్యవహరిస్తూ తనలో ఉన్న మరొక టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. కాగా ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించారు. ఈ షోలో తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్సాఫ్ హ్యూమర్ తో అలరించారు.

ఇకపోతే ఇటీవలే మొదటి సీజన్ ముగిసిన విషయం తెలిసిందే. ఇక రెండవ సీజన్ మొదలవుతుందా అని బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. బాలయ్య అభిమానుల నిరీక్షణలకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. నేడు మధ్యాహ్నం 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది అన్ స్థాపబుల్ సీజన్ 2. ఈ షోలో మొదటి ఎపిసోడ్ కి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ హాజరయ్యారు. మొదటి ఎపిసోడ్ కె బాలకృష్ణ వియ్యంకుల వారు హాజరు కావడంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు మరింత పెరిగాయి.

అంతేకాకుండా మొదటి ఎపిసోడ్ ప్రారంభం కాకముందే ఎందుకు సంబంధించిన టీజర్, ప్రోమో లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుంచి బాలయ్య అభిమానుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇక ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తనదైన శైలిలో పంచులు కామెడీ చేస్తూ వారిని నవ్వించారు. అంతే కాకుండా గతంలో అనగా 1995లో బిగ్ డెసిషన్ కు సంబంధించిన విషయాన్ని బాలకృష్ణ అడగగా ఆ విషయం పై స్పందించిన చంద్రబాబు..1995 లో జరిగిన బిగ్ డెసిషన్ పై కీలక వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..

Unstoppable Season 2: కాళ్లు పట్టుకొని మరి బ్రతిమలాడాను..

ఆరోజు ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకించారు. దీనిపై పెద్దాయనతో బాలయ్య, హరికృష్ణ, నాతో సహా మొత్తం ఐదుగురము భేటీ అయ్యాము. ఆ తర్వాత ఒక రూమ్ లో నేను, ఎన్టీఆర్ మూడు గంటలసేపు చర్చించుకున్నాం. ఆ సమయంలో నేను కాళ్లు పట్టుకొని మరి అడిగాను. చేద్దామని చెప్పాను. కానీ ఎన్టీఆర్ వినకుండా నన్ను ఒప్పించారు. మేము ఆరోజు చేసింది తప్పా అని చంద్రబాబు నాయుడు బాలకృష్ణను ప్రశ్నించగా వెంటనే స్పందించిన బాలకృష్ణ లేదు మీరు చేసింది కరెక్టే అని తెలిపాడు. అన్ స్థాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్లో భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు బాలకృష్ణ అభిమానులు మొదటి ఎపిసోడ్ కి రేంజ్ లో ప్రేక్షకధారణ లభించింది అంటే ఇక పోను పోను ఏ రేంజ్ లో ఉంటుందా అని అంచనా వేస్తున్నారు

Un Stoppable: అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ లో సందడి చేయనున్న చంద్రబాబు వైరల్ అవుతున్న ఫోటోలు?

Un Stoppable: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారిన బాలకృష్ణ షో కి హాజరైన సెలబ్రెటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ.. వారితో ఎంతో సరదాగా ఎపిసోడ్ మొత్తం పూర్తి చేశారు.

ఈ విధంగా మొదటి సీజన్ కి మంచి
ప్రేక్షకాదరణ లభించి మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ మంచి హిట్ అవటంతో మేకర్స్ సీజన్ 2 కూడా మొదలు పెట్టమన్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన పనులు మొత్తం పూర్తి చేసుకుని తొందరలోనే ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో మొదటి గెస్ట్ ఎవరు అనే విషయంపై ఉత్కంఠత వీడింది.

ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా బాలకృష్ణ వియ్యంకుడు.. ఏపీ మాజీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Un Stoppable: బావను ప్రశ్నించడానికి సిద్ధమైన బాలయ్య..

ఇలా మొదటి ఎపిసోడ్ లోనే బాలకృష్ణ తన అల్లుడు వియ్యంకుడితో కలిసి రచ్చ చేయటానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా ఈ షో చివరిలో బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.