Tag Archives: cyber crime police

Actress Hema: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి హేమ… వారిపై ఫిర్యాదు చేసిన నటి!

Actress Hema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి హేమ ఒకరు.ఈమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో యంగ్ హీరో హీరోయిన్లకు అక్క పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.

ఇకపోతే సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా నటి హేమ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పలువురుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఈమె ఎవరిపై ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

గత కొద్ది రోజుల క్రితం హేమ తన పెళ్లి రోజును జరుపుకున్నారు. ఇలా తన పెళ్లి రోజు వేడుకలలో భాగంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వచ్చారు. అయితే ఈ దంపతులు స్విమ్మింగ్ పూల్ లో కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విభిన్నమైన థంబ్ నెయిల్స్ పెడుతూ తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Actress Hema: యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేసిన నటి…

ఇలా తమ పరువు తీసినటువంటి సదరు యూట్యూబ్ ఛానల్ లపై యాక్షన్ తీసుకోవాలంటూ ఈమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది తమ ఛానల్ కు మంచి ఆదరణ రావాలన్న ఉద్దేశంతో ఇలా విభిన్నమైన థంబ్ నెయిల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇవి వారికి ఎంతో ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు సదురు చానల్ పై చర్యలకు కూడా సిద్ధమవుతూ ఉంటారు.

Anchor Anasuya: పనీపాట లేని వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది… వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్!

Anchor Anasuya: యాంకర్ అనసూయ గత వారంలో ఈమెను పెద్ద ఎత్తున నేటిజన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది తనని ఆంటీ అంటూ ట్వీట్ చేయడంతో తనని ఏజ్ షేమింగ్ కిగురి చేస్తున్నారంటూ ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం మనకు తెలిసింది.

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన తర్వాత అనసూయ ఈ కేసు విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నేటిజన్స్ మరోసారి అనసూయను గెలికారు. ఇంతకీ అనసూయ కేసు పెట్టడంతో పోలీసులు ఏమన్నారు అంటూ నేటిజన్స్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోని ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ నీలా మాకు పని పాట లేదు అనుకున్నావా అని పోలీసులు అనసూయకు చెప్పి పంపించి ఉంటారు అంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ పై స్పందించిన అనసూయలేదండి మీలా పని పాట లేని వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది అని చెప్పి పంపించారు అంటూ కామెంట్ చేశారు.
మీరు ఎంత తొందరగా నోరు జారుతారు అంతే తొందరగా బోల్తా పడతారు కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్ని జరుగుతాయ్.. జరుగుతున్నాయి అంటూ ఈమె కామెంట్ చేశారు.

Anchor Anasuya: ఇంతమందిపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారబ్బా…

ఇక అనసూయను కొన్ని వేలమంది ఆంటీ అంటూ ట్రోల్ చేశారు..ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు మరి ఇంత మందిపై పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై ఎంతో మంది నెటిజెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయని కాదు ఎంతో కీలకమైన నేతలు మంత్రులు ముఖ్యమంత్రులను కూడా ఇలా ట్రోల్ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు మరి అనసూయ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

తీన్మార్‌ మల్లన్నను అదుపులోకి తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు!

నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నను పోలీసులు క్యూ న్యూస్‌ కార్యాలయానికి వెళ్లి అరెస్ట్ చేశారు. గడిచిన కొన్ని రోజులుగా క్యూ న్యూస్‌ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్, తీన్మార్‌ మల్లన్న మధ్య వివాదం నడుస్తున్న విషయం అందరికి తెలిపిందే.

అయితే ప్రవిణ్ కౌంటర్‌గా మల్లన్న ప్రత్యారోపణలు చేశారు. అందులో భాగంగా కొన్ని ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు. అందులో ప్రియాంక అనే యువతి ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో ఆమె మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌‌కు ఫిర్యాదు చేశారు.

నేను మోనార్క్ ని .. నన్ను ఎవరు మోసం చేయలేరు అంటూనే..రూ.8 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి.. చివరికి?

ప్రస్తుత కాలంలో రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల అరాచకాలు ఎక్కువైపోయాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది అమాయకులను మోసం చేసి లక్షలకు లక్షలు డబ్బులు దోచుకుంటున్నారు.అయితే సాధారణ వ్యక్తులు లేదా చదువుకోని వారు ఇలాంటి వారి చేతిలో మోసపోయారు అంటే అర్థం ఉంటుంది కానీ.. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే వ్యక్తికి మాత్రం సైబర్ నేరగాళ్లకు గురించి చాలా అవగాహన ఉంటుంది.ఈ విధంగానే ఇంజనీర్ గా పని చేసేటటువంటి ఓ వ్యక్తి తనను ఎవరూ మోసం చేయలేరు అంటూ ఏకంగా 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది.

అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి ఒక రోజు ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అతని కార్డు వివరాలను అడిగారు. ఈ క్రమంలోనే ఆ ఇంజనీర్ ఈ విషయం గ్రహించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశారు.ఈ విధంగా వచ్చే ఫోన్ కాల్స్ తో ఎంతో అప్రమత్తంగా ఉండే ఇంజనీర్ చివరికి సైబర్ నేరగాళ్ల చేతిలో చిత్తుగా మోసపోయాడు. తనకు తక్కువ జీతం రావడంతో అతను డబ్బు సంపాదించాలన్న ఆశ పెరిగింది. ఈ క్రమంలోనే కొంత డబ్బులు వ్యాపారంలోకి పెట్టి మరింత డబ్బును సంపాదించాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి కేవలం 20 వేల పెట్టుబడితో కొన్ని రోజుల తర్వాత మీరు రూ. 62000 లాభం పొందుతారని చెప్పడంతో ఇంజనీర్ కొంత అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు అతనికి ఒక లింకు పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే అందులో పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ విధంగా వివరాలన్నీ ఉండటంతో ఇంజనీర్ ఇరవై వేలు పెట్టుబడి పెట్టి కొద్దిరోజులకు 62000 లాభం పొందాడు. ఈ విధంగా డబ్బులు రావడంతో అతనికి ఆశ పెరిగింది.

ఈ క్రమంలోనే మరింత డబ్బు సంపాదించాలని భావించిన ఇంజనీర్ ఈ సారి ఏకంగా అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టాడు. ఒకేసారి ఎనిమిది లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు.ఈసారి ఎక్కువ డబ్బులను పొందవచ్చని భావించింన ఇంజనీర్ కి అప్లికేషన్ ఫామ్లో విత్ డ్రా బటన్ కనిపించకపోవడంతో అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచాఫ్ రావడంతో అతను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ ఇళ్లలో వందల సిమ్ కార్డులు… ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

మనలో చాలామందికి ప్రతిరోజూ ఏదో ఒక ఆఫర్ పేరిట ఫోన్లు వస్తుంటాయి. మరి కొంతమందికి ఆన్ లైన్ లో నచ్చిన వస్తువులు సెకండ్ హ్యాండ్ లో తక్కువ ధరకే దర్శనమిస్తూ ఉంటాయి. ఆలస్యం చేస్తే ఆఫర్ అందుబాటులో ఉండదని భావించి మనలో చాలామంది వెంటనే వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించి మోసపోతూ ఉంటారు.ఒకవేళ మోసపోయినాఫిర్యాదు చేయడానికి భయపడుతూ ఉంటారు.

తాజాగా లా వేల సంఖ్యలో ప్రజలను మోసం చేసిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓఎల్‌ఎక్స్‌ అమ్మకాల పేరుతో గత కొన్ని నెలల నుంచి భరత్‌పూర్‌ గ్యాంగ్‌ చేస్తున్న మోసాలు అన్నీఇన్నీ కావు. ఓఎల్‌ఎక్స్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్ పేర్లతో మోసాలు చేసిన నిందితుల ఇళ్లలో 800 సిమ్ కార్డులు లభ్యమయ్యాయి. అంత పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను చూసి సైబర్ క్రైం పోలీసులు అవాక్కయ్యారు.

మోసగాళ్లు తమ చేతిలో ఎవరైనా మోసపోతే వాళ్ల నుంచి ఇబ్బందులు రాకుండా వెంటనే సిమ్ కార్డును మార్చి మరొక కొత్త మోసానికి తెర లేపుతున్నారు. ప్రజలు దేశంలో రోజురోజుకు మోసాలు చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గుడ్డిగా నమ్మి మోసపోతే తర్వాత బాధ పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. యువత, విద్యార్థులు ఎక్కువగా ఆన్ లైన్ మోసాల బారిన పడుతున్నారు.

కొందరు మోసగాళ్ల వల్ల సెకండ్ హ్యాండ్ వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ తరహా మోసాలు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.