Actress Hema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి హేమ ఒకరు.ఈమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో యంగ్ హీరో హీరోయిన్లకు అక్క పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.
ఇకపోతే సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా నటి హేమ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పలువురుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఈమె ఎవరిపై ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
గత కొద్ది రోజుల క్రితం హేమ తన పెళ్లి రోజును జరుపుకున్నారు. ఇలా తన పెళ్లి రోజు వేడుకలలో భాగంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వచ్చారు. అయితే ఈ దంపతులు స్విమ్మింగ్ పూల్ లో కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విభిన్నమైన థంబ్ నెయిల్స్ పెడుతూ తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా తమ పరువు తీసినటువంటి సదరు యూట్యూబ్ ఛానల్ లపై యాక్షన్ తీసుకోవాలంటూ ఈమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది తమ ఛానల్ కు మంచి ఆదరణ రావాలన్న ఉద్దేశంతో ఇలా విభిన్నమైన థంబ్ నెయిల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇవి వారికి ఎంతో ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు సదురు చానల్ పై చర్యలకు కూడా సిద్ధమవుతూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…