Tag Archives: health condition

Faima: ఆస్పత్రి పాలైన కమెడియన్ ఫైమా…. ఏం జరిగిందంటూ ఆందోళనలో అభిమానులు?

Faima: ఫైమా పరిచయం అవసరం లేని పేరు పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ఫైమా వేసే పంచ్ డైలాగులకు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి తనకు మరింత మంది అభిమానులు పెరిగిపోయారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి ఫైమా ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇక ఫైమా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా తనకు సంబంధించిన అన్ని వీడియోలను ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు ఇదిలా ఉండగా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె ఆసుపత్రి బెడ్ పై చాలా నీరసంగా పడి ఉండడం చూసి అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గెట్ వెల్ సూన్….

చేతికి సెలైన్ బాటిల్ తో ఫైమా ఆస్పత్రి బెడ్ పై ఏమాత్రం ఎనర్జీ లేకుండా పడి ఉండటం చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా హాస్పిటల్లో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తున్నటువంటి ఈమె తనకు ఏం జరిగింది అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇలా ఫైమా ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఏమైంది అంటూ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేయడమే కాకుండా మీరు తొందరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Samantha: ఆరోగ్యం బాగా లేకపోయినా ఆ పని మాత్రం విడిచిపెట్టనీ సమంత… వైరల్ అవుతున్న ఫోటోలు!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కేవలం తనకు వచ్చినటువంటి మయోసైటిస్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవడం కోసమే ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా సమంత సినిమాలకు విరామం ప్రకటించారు.


ఇలా సమంత సినిమాలకు దూరమవుతున్నా అని చెప్పడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందినప్పటికీ తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.ఇక ఇప్పటికే ఈమె కమిట్ అయినటువంటి సినిమా షూటింగ్ పనులు అన్నింటిని కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే చికిత్స నిమిత్తం ఈమె అమెరికా వెళ్లబోతున్నారు.

ఈ విధంగా సమంత ఆరోగ్యం బాగా లేకపోయినా సమంత మాత్రం తన వ్యాపారాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈమె సాకీ అనే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఇలా వ్యాపారంతో వచ్చే లాభాలను సమంత తన ఫౌండేషన్ కోసం అలాగే తన సోషల్ మీడియా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు.

Samantha: సాకీ బ్రాండ్ ప్రమోషన్లలో సమంత…


దీద్ధో తనకు ఆరోగ్యం బాగా లేకపోయినా తన బ్రాండెడ్ దుస్తులను ధరిస్తూ ఈమె భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ సమంత షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన ఆరోగ్యం బాగా లేకపోయినా తన వ్యాపారాన్ని మాత్రం ముందుకు తీసుకువెళ్లాలని ఎంతో కష్టపడుతున్నారు అంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.

Heroine Samantha: ఆ ఇంజక్షన్లు తీసుకుంటున్న సమంత.. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

Heroine Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజుల నుండి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఏడాది కిందట నుంచి సమంత వ్యక్తిగతంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాల పరంగా కాస్త దూకుడు తగ్గించింది. ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ గా మారి వరుస అవకాశాలు అందుకుంది.

అలా గత ఏడాది యశోద సినిమా విడుదల కాగా ఈ సినిమా విడుదల సమయంలో తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో అప్పటినుంచి సమంత ఇంట్లోనే ఉండి ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. అప్పటికే పలు సినిమాలకు సైన్ చేయగా ఆ సినిమాల కోసం బాగా కష్టపడుతుంది.

ఇక జిమ్ములో ఎప్పుడు వర్కౌట్లు చేస్తూ మరింత కష్టపడుతుంది. ఇక తను వర్కౌట్లు చేస్తున్న వీడియోలను కూడా ఇన్స్ స్టా లో పంచుకుంటూ ఉంది. దీంతో చాలామంది ఈ సమయంలో ఇలా చేయకూడదు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. కానీ తన వృత్తి కోసం ఏ కష్టాన్ని కూడా వదలకుండా ఇష్టంగా చేస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటుంది.

Heroine Samantha:

తన వ్యాధికి సంబంధించి నెలవారీ ఐవీఐజీ ఇంజక్షన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. దానికోసం సమంత రెండు నుంచి నాలుగు గంటలు కష్టపడుతుందని తెలిసింది. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటగానే ఉన్నట్లు తెలిసింది. ఇక సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో పాటు సిటాడెల్, ఖుషి సినిమాలలో కూడా నటిస్తుంది. ఇక శాకుంతలం సినిమా ఈనెల విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదల కానుంది

Latha Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం..! ఐసీయూలో చికిత్స..!

Latha Mangeshkar: చైనా వూహాన్ లో మొదలైన కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాన్ని మార్చకుంటూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, బీఏ2 వేరియంట్ల రూపంలో ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది.

Latha Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం..! ఐసీయూలో చికిత్స..!

మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లలో ఎంతోమంది మరణించారు.  మన దేశంలో కూడా ఎంతో మంది ప్రముఖులు ఇటీవల కాలంలో కరోనా బారిన పడ్డారు. థర్డ్ వేవ్ ప్రారంభం అయిన తర్వాత రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.

Latha Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం..! ఐసీయూలో చికిత్స..!

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ తో పాటు మరికొంత మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ ఫిలిం ఇండస్ట్రీకు చెందిన వ్యక్తులు కూడా కరోనా బారిన పడ్దారు. ఇదిలా ఉంటే ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కూడా ఇటీవల కరోనా సోకింది. ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

గత నెల 11న కరోనా బారిన పడ్డ లతా మంగేష్కర్ ..
అయితే ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ ప్రతీత్ సంధాని ఆమె ఆరోగ్యం గురించి వెల్లడించారు. ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. గత నెల 11న లతా మంగేష్కర్ కరోనాతో బాధపడుతతూ ఆసుపత్రిలో చేరారు. అయితే ఇటీవల కోలుకుంటున్న క్రమంలోనే ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది.

నాకు అవకాశాలు తగ్గలేదు.. నేనే అవకాశాలను తగ్గించుకున్నా: బ్రహ్మానందం

తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాలలో కమెడియన్ బ్రహ్మానందం లేని సినిమా లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే రాను రాను బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించేశారు. అయితే ఆయన ఎందుకు సినిమాలు తగ్గించారు? ఆయనే సినిమాలు తగ్గించారా? లేక ఆయనకు అవకాశాలు రాక ఇండస్ట్రీకు దూరంగా ఉన్నారా?అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాలపై స్పందించారు బ్రహ్మానందం. తాను యాక్టింగ్ కి ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పుకొచ్చారు.

దాదాపుగా నేను గత 35 ఏళ్ల నుంచి 3,4 షిఫ్ట్ లు పని చేస్తూ వచ్చాను. ఈ క్రమంలోనే సరైన తిండి తినక, నిద్ర లేక, తిన్నది అరగక వాంతులు చేసుకుంటూ ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అయితే ప్రస్తుతం నా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అనుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవడానికి కొంత డబ్బును పోగొట్టుకున్న నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ అసలు నిజాన్ని బయట పెట్టేసాడు బ్రహ్మానందం.

అదేవిధంగా తనపై వస్తున్న మీన్స్ పై స్పందిస్తూ.. నాపై మీన్స్ చేసే వాళ్లకు థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే నేను సినిమాల్లో నటించకపోయినా ఇప్పటికీ నన్ను జనాలు మర్చిపోకుండా గుర్తు చేసేలా చేస్తున్నా మీన్స్ క్రియేటర్స్ ని, వాళ్ళ ప్రయత్నాన్ని సైతం మెచ్చుకోవాల్సిందే అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం సినిమాల కోసం కాకుండా తన కోసం తానే బతుకుతున్నారని చెప్పుకొచ్చారు.

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమం ..!

ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సోమవారం ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. “ప్రసిద్ధ టాలీవుడ్ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, 66 సంవత్సరాల వయస్సులో, న్యుమోనియాతో నవంబర్ 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం, అతను నిపుణులైన వైద్యుల బృందం నిశితంగా పరిశీలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి 1984లో జననీ జన్మభూమితో గేయ రచయితగా అరంగేట్రం చేశారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల (1986)లో “విధాత తలపున” పాటతో అతను కీర్తిని పొందాడు.

శాస్త్రికి 3000 పాటలకు పైగా రాశాడు. స్వయంకృషి, స్వర్ణ కమలం, శ్రుతిలయలు, గాయం, స్వాతి కిరణం, క్షణ క్షణం, సింధూరం, నువ్వే కావాలి, ఒక్కడు, వర్షం, గమ్యం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కళల రంగంలో ఆయన చేసిన కృషికి 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

అంతే కాదు.. 11 రాష్ట్ర నంది అవార్డులు మరియు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లను గెలుచుకున్నాడు. గేయ రచయితగా వినోద పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గాను అతడు ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ప్రస్తుతం అతడిఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు.

సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కిమ్స్ వైద్యులు.. ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల!

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24వ తేదీ తీవ్రమైన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు అతనిని సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అతను ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకు ఈ విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కిమ్స్ వైద్యులు సోమవారం ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన ఐసియులోనే ఉన్నారని అతను కోలుకోవడానికి నిత్యం తనను పరిశీలిస్తూ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంత వరకు మాత్రమే కుదుటపడిందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.

ఉన్నపళంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ విధంగా ఆసుపత్రి పాలవడంతో ఎంతో మంది అభిమానులు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ అతను క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఆదివారం ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సినీ పరిశ్రమ ఇప్పుడు సీతారామ శాస్త్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే..?

కరోనా కేసులు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా థర్డ్ వేవ్ తప్పదనే అంచనాలకు వస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే.. మునుపటి పరిణామాల కంటే ఎక్కువగా ఉంటే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే. ఇటీవల తమిళ స్టార్ కమల్ హాసన్ కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం శ్రీ రామచంద్ర మెడికల్​ సెంటర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడు త్వరగా కోలుకోవాని తమిళనాడులోని కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు యావత్ దేశమంతా ప్రార్థిస్తుంది. అయితే అక్కడి వైద్యలు తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ను విడదలు చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. తన తండ్రి కమల్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నటి శ్రుతిహాసన్​.

త్వరలోనే అందరి ముందుకు వస్తారని.. ఆయన కూడా అదే ఆకాక్షింస్తున్నారని పేర్కొన్నారు. అయితే అతడికి కరోనా పాజిటివ్ గా నవంబర్ 22 న వచ్చినట్లు అతడే స్వయంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి అతడు ఇండియాకు వచ్చి.. వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. ఆ రోజు నుంచి అతడు సెల్ఫ్ క్వారంటైన్ అయ్యి.. వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇక ఇప్పటికే పలువురు సినీ పెద్దలు కమల్ హాసన్ కు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగానే రజనీకాంత్ కూడా ఉన్నారు. ఇలా క‌మ‌ల్‌ను ప‌రామ‌ర్శించిన వారిలో కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన శివకార్తికేయన్ , , విష్ణు విశాల్, ప్రభు, శరత్ కుమార్ తో పాటు ప‌లువురు ఉన్నారు.

విషమంగానే శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి.. ఈ కుటుంబానికి అండగా నిలిచిన హీరో ధనుష్..!

గత నాలుగు రోజుల క్రితం కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన చిన్న కొడుకు మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ క్రమంలోనే మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈయనకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికే మాస్టర్ ఊపిరితిత్తులు 75% ఇన్ఫెక్షన్ అయ్యాయని వైద్యులు వెల్లడించడంతో ఈయనకు రోజు చికిత్స అందించడానికి సుమారు లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవడంతో అతని కుటుంబ సభ్యులు డబ్బుకోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేయాలని తెలిపారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనుసూద్ వెంటనే స్పందిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉన్నాను ఎవరు కంగారు పడాల్సిన పనిలేదు అంటూ సోను సూద్ భరోసా ఇచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా మరొక హీరో తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో ధనుష్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య విషయంపై స్పందించారు.

ఈ సందర్భంగా ధనుష్ శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. అయితే ఎంత మొత్తంలో అతని కుటుంబానికి సహాయం చేశారనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఇక ధనుష్ తన మూడవ సినిమాగా తెరకెక్కిన తిరుడా తిరుడి అనే చిత్రానికి శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆ పరిచయంతోనే నేడు ఆయనకు ధనుష్ ఆర్థిక సహాయం చేశారు.

కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు అండగా నిలిచిన సోనుసూద్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనుసూద్ గత నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఆయన పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురయ్యారని 75శాతం అతనికి ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఆయనకు చికిత్స అందించాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు.

ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వార్త గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇక ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న బాలీవుడ్ నటుడు రియల్ హీరో సోను సూద్ స్పందించారు.

ఈ సందర్భంగా సోనూసూద్ ఇదే విషయం గురించి శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అతని చికిత్స కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎలాగైనా తన ప్రాణాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడటంతో ఆయన పెద్ద కుమారుడు, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఇక తన భార్య హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక శివ శంకర్ మాస్టర్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించడమే కాకుండా జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు.