Tag Archives: health problem

Comedian Sudhakar: బుల్లితెర షో లో సందడి చేసిన కమెడియన్ సుధాకర్… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడు!

Comedian Sudhakar: వెండి తెరపై ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ సుధాకర్ ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినటువంటి ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈయన అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సుధాకర్ బయట ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఈయన చనిపోయారు అంటూ పెద్ద ఎత్తున ఈయన గురించి వార్తలు సృష్టించారు. ఈ విధంగా సుధాకర్ చనిపోయాడు అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఏకంగా ఈ వార్తలపై ఆయనే స్పందించారు.

ఇలా తన గురించి తాను చనిపోయానంటూ వార్తలు వస్తున్నాయి కానీ నేను బ్రతికే ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇలా వయసు పై పడటంతో ఇంటిపట్టునే ఉన్నటువంటి సుధాకర్ మొదటిసారి బుల్లితెర షోలసందడి చేశారు. జూన్ 18వ తేదీ ఫాదర్స్ డే సందర్భంగా జీతెలుగు నిర్వహిస్తున్నటువంటి నేను నాన్న అనే కార్యక్రమంలో ఈయన సందడి చేశారు.

Comedian Sudhakar: చాలా సంతోషంగా ఉన్నాను…


ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సుధాకర్ కు వేదిక పైన ప్రత్యేకంగా సన్మానం చేయడమే కాకుండా తన చేత కేక్ కట్ చేయించి తన కుమారుడు తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సుధాకర్ సైతం అబ్బబ్బ అంటూ తన డైలాగ్ చెబుతూ అందరిని నవ్వించారు. ఇలా ఫాదర్స్ డే ను ఇంత గ్రాండ్ గా చేసినందుకు తాను సంతోషంగా ఉన్నాను అంటూ తెలియచేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Samantha -Naga Chaitanya: నాగచైతన్య నిజంగానే సమంతను పరామర్శిస్తాడా… ఇది జరిగే విషయమేనా?

Samantha -Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.

నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత ఒంటరిగా జీవిస్తూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత గత కొంత కాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ విధంగా సమంత తాను బాధపడుతున్న అనారోగ్య సమస్య గురించి బయట పెట్టడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సమంతా త్వరగా తిరిగి కోల్పోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ తనకు ధైర్యం చెబుతున్నారు.ఇక అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ సుశాంత్ వంటి వారు కూడా సమంత త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు.

సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతుందని తెలిసినప్పటి నుంచి అందరి ఫోకస్ నాగచైతన్య పై పడింది. నాగచైతన్య సమంతను వెళ్లి పరామర్శిస్తారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా సమంతను పరామర్శించకపోయిన నేరుగా తనని కలిసి తనని పరామర్శించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

Samantha -Naga Chaitanya: ఇద్దరి మధ్య స్నేహబంధం కూడా లేదు..


అయితే తాజాగా అక్కినేని కాంపౌండ్ నుంచి వస్తున్న వార్తలు ప్రకారం అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరు కూడా సమంతను కలవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.విడాకుల ప్రకటన చేసిన తరుణంలో తామిద్దరం ఇకపై మంచి స్నేహితులుగా కొనసాగుతామని చెప్పినప్పటికీ వీరి మధ్య కనీసం స్నేహబంధం కూడా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య వెళ్లి సమంతను పరామర్శిస్తారనేది పూర్తిగా అబద్ధమని ఇది జరిగే పని కాదంటూ మరికొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి నిజంగానే నాగచైతన్య సమంతను పరామర్శిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష చావు బతుకుల మధ్య పోరాడుతుందంటూ వార్తలు.. అసలు విషయం బయటపెట్టిన జబర్దస్త్ బ్యూటీ?

Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదట్లో లేడీ కంటెస్టెంట్ లు లేకుండా కేవలం మగవారు మాత్రమే పాత్రకు అనుగుణంగా లేడీ గెటప్స్ వేసేవారు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో కూడా లేడీ కంటెస్టెంట్ లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంతోమంది లేడీ కంటెస్టెంట్ లో వచ్చి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

Jabardasth Varsha: చావు బతుకుల మధ్య పోరాడుతున్న వర్ష.. అసలు విషయం బయటపెట్టిన జబర్దస్త్ బ్యూటీ?

ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వర్ష ఒకరు. ఈమె ఇమ్మానియేల్ కి జోడిగా ఎన్నో స్కిట్ లలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన వర్ష గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jabardasth Varsha: చావు బతుకుల మధ్య పోరాడుతున్న వర్ష.. అసలు విషయం బయటపెట్టిన జబర్దస్త్ బ్యూటీ?

ఇకపోతే తాజాగా వర్ష చావుబతుకుల్లో ఉందంటూ ఫేక్థంబ్‌నెయిల్‌తో ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేశారు. సాధారణంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వారి ఛానల్ వ్యూస్ కోసం ఇలాంటి థంబ్‌నెయిల్‌ క్రియేట్ చేయడం సర్వసాధారణం ఈ క్రమంలోనే వర్ష గురించి ఇలాంటి వార్త రావడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నిజంగానే తనకు ఏమైందో అంటూ ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు.

బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న వర్ష..

ఈ విధంగా తన గురించి వస్తున్న వార్తలపై స్పందించిన వర్ష తను చావు బతికులలో ఉందనే థంబ్‌నెయిల్‌ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఇదంతా కూడా ఫేక్ అని తనకు ఏమీ కాలేదు అంటూ తన ఆరోగ్యంగా ఉన్నానని వర్ష తన గురించి వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు. ఇక వర్ష ఈ విషయం పై స్పందించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్షకు బిగ్ బాస్ 6 అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి ఉంది.

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

Air Indian Flight:సాధారణంగా రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్యలో తిరుగుతూ ఓట్ల కోసం పెద్ద ఎత్తున తాపత్రయ పడుతుంటారు. ఇలా ఎన్నికల సమయంలో కాకుండా మిగతా సమయంలో ప్రజలలోకి రావడానికి రాజకీయ నాయకులు పెద్దగా ఆసక్తి కనపరిచరు. అయితే కొంతమంది నేతలు మాత్రం ఇందుకు చాలా భిన్నంగా ఉంటారు. వాళ్లు నిత్యం ప్రజల కోసమే కృషి చేస్తూ.. ప్రజల సమస్యలను తీరుస్తూ నిజమైన ప్రజానాయకుడు గా వ్యవహరిస్తారు.

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

తాజాగా కేంద్ర మంత్రి చేసిన పని తెలిస్తే ప్రతి ఒక్కరూ అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. అసలేం జరిగిందనే విషయానికి వస్తే..శనివారం ఢిల్లీ-ఔరంగాబాద్ ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన విమాన సిబ్బంది వెంటనే విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే స్పందించాల్సి ఉంది అంటూ అనౌన్స్మెంట్ చేశారు. ఈ విధంగా అనౌన్స్మెంట్ విన్న కేంద్ర మంత్రి డాక్టర్ బీకే కరాద్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత డాక్టర్ సుభాష్ భమ్రే వెంటనే స్పందించారు.

Air Indian Flight: విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు.. చికిత్స అందించిన కేంద్రమంత్రి..

ఈ క్రమంలోనే ఇద్దరు ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతనికి చికిత్స అందించారు. ఇలా ప్రాథమిక చికిత్స అందించడంతో ఆ ప్రయాణికుడు త్వరగా ఉపశమనం పొందారు. వీరిద్దరూ ఒకరు కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తుండగా మరొకరు మాజీ మంత్రి ఇలా వీరిద్దరూ రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా వృత్తి పరంగా ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్లు.

ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన ఎయిర్ ఇండియా…

ప్రస్తుతం వీరిద్దరూ మంత్రి పదవులలో ఉన్నప్పటికీ ఒక రోగి పట్ల డాక్టర్ గా వ్యవహరించి ఆయనకు చికిత్స అందించడంతో కేంద్ర మంత్రి పై నెటిజన్లు పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వారిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Nirupam – Manjula: అలాంటి వైరస్ సోకి అస్పత్రిలో డాక్టర్ బాబు భార్య మంజుల…ఎమోషనల్ వీడియో!

Nirupam – Manjula: బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సెలబ్రిటీలు అయిన నిరుపమ్, మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బాబు ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఇక ఏ సీరియల్ నుంచి తప్పకుండా డాక్టర్ బాబు ఏ సీరియల్ కు కమిట్ కాలేదు.

Nirupam – Manjula: అలాంటి వైరస్ సోకి అస్పత్రిలో డాక్టర్ బాబు భార్య మంజుల…ఎమోషనల్ వీడియో!

ఇలాంటి సీరియస్ లేకపోవడంతో డాక్టర్ బాబు బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా పలు కార్యక్రమాలలో పాల్గొన్న డాక్టర్ బాబు ఉగాది పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా అనే కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తన భార్య మంజులను కూడా తీసుకు వచ్చారు.

Nirupam – Manjula: అలాంటి వైరస్ సోకి అస్పత్రిలో డాక్టర్ బాబు భార్య మంజుల…ఎమోషనల్ వీడియో!

ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు మంజుల తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు. అదేవిధంగా ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులలో ఒక రుచి అయినా చేదు గురించి చెప్పమని అడగగా, మంజుల తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి తెలియజేశారు.

కంటతడి పెట్టించిన మంజుల…

ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం తనకు వైరల్ ఆర్థరైటిస్ వచ్చి బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అసలు బ్రతుకుతారా లేదా అనే అనుమానం కూడా వచ్చిందని ఈ సందర్భంగా మంజుల తన జీవితంలో జరిగిన అత్యంత చేదు సంఘటన గురించి తెలియజేస్తూ అందరి చేత కంటతడి పెట్టించారు. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

Health Tips: ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. స్కూలుకెళ్లే పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ లో ఫోన్ వాడుతుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరికి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పటంలో సందేహం లేదు. ఐతే చాలామంది నిద్రపోయే సమయంలో కూడా సెల్ ఫోన్లు దిండు కింద పెట్టుకొని మరి నిద్రపోతున్నారు. ఇలాంటి అలవాటు ఉన్న వారు ప్రమాదంలో పడినట్టే.

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజు తలకింద సెల్ ఫోన్ పెట్టుకొని పడుకోవడం వల్ల దాని రేడియేషన్ కి క్యాన్సర్, ట్యూమర్స్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: సెల్ ఫోన్ దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

రాత్రివేళ నిద్రించే సమయంలో మెదడులో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి అవటం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. ఒకవేళ నిద్రపోయే సమయంలో లో సెల్ ఫోన్ తలక్రింద పెట్టుకొని పడుకోవడం వల్ల సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ కి ఈ హార్మోన్ విడుదల అవ్వదు. అందువల్ల నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడతారు.

మెదడుపై అధిక ప్రభావం చూపుతుంది…

సెల్ ఫోన్ తల కింద పెట్టుకొని పడుకోవడం వల్ల దాని నుండి వచ్చే రేడియేషన్ మన మన మెదడు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. తద్వారా నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు నిద్ర పోయే సమయంలో వారి దరిదాపుల్లో కూడా సెల్ఫోన్ ఉండకుండా చూడాలి.

Health Tips: పచ్చి బాదం పప్పు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

Health Tips: సాధారణంగా డ్రైఫ్రూట్స్ తినటం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో వివిధ రకాల పోషక విలువలు దాగి ఉంటాయి. అందువల్ల ప్రతి రోజు కొంత మొత్తంలో డ్రైఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతిరోజు మూడు నాలుగు బాదం పప్పులు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎండు బాదం పప్పు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. పచ్చి బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి అంతే నష్టం కలుగుతుంది.పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Health Tips: పచ్చి బాదం పప్పు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

సాధారణంగా చాలామంది డ్రై బాదంపప్పును నీటిలో నానబెట్టుకుని వాటిని తీసి తింటారు. ఈ క్రమంలో కొంతమంది పచ్చి బాదంపప్పును తినటానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. పచ్చి బాదం పప్పులు టానిన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం కొన్నిరకాల పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతుంది.

Health Tips: పచ్చి బాదం పప్పు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినటం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇవి మన శరీరంలోని కాలేయం మీద ప్రభావం చూపుతాయి. పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగక ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలతో బాధపడేవారు పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి ప్రమాదం..

పచ్చి బాదం పప్పులో ఆక్సలేట్ ఉండటం వల్ల కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పచ్చి బాదం పప్పును తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినడం వల్ల మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి దాని తీవ్రత మరింత పెరిగే ప్రమాదం వుంటుంది. అందువల్ల ఏ ఆహారానైనా మితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు.

Egg Benefits: కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచొచ్చా..? తెలుసుకోండి..!

Egg Benefits: రోజుకో గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. అనే కొటేషన్ మనం వింటూనే ఉంటాం. గుడ్డు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వీటిలో ఎన్నో రకాల పోషక పదర్థాలు ఉన్నాయి. ఇక దీనిని నాన్ వెజ్ తినని వారు కూడా.. వారి ఆహార పదర్థాల్లో గుడ్డును చేర్చుకుంటున్నారు.

Egg Benefits: కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచొచ్చా..? తెలుసుకోండి..!

ఇక ఒకప్పుడు ఫ్రిడ్జ్ లో కూరగాయలు, పండ్లను మాత్రమే నిల్వ చేసుకునే వారు. కానీ మారుతున్న జీవన శైలి.. బిజీ బిజీ జీవితంలో ప్రతీ వస్తువును ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా కోడిగుడ్లు కూడా ఉన్నాయి. అయితే ఇలా గుడ్లను నిల్వ చేయవచ్చా..? దీని వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా.? ఒక వేళ ఇలా నిల్వ చేస్తే ఎన్ని రోజులు ఉంచాలి.. వాటి గురించి తెలుసుకుందాం.

Egg Benefits: కోడి గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచొచ్చా..? తెలుసుకోండి..!

గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కోడి గుడ్లను నిల్వ చేయడం అనేది మాంచిది. ఒక వేళ గుడ్డన ఫ్రిడ్జ్ లో నిల్వ చేయాలంటే.. ఒక బాక్స్ లో ఉంంచి.. గాలి తగలకుండా ఉంచాలి. ఇలా ఉంచితే.. మిగతా వస్తువుల వాసన గుడ్డుకు తగలకుండా ఉంటుంది.

రెండు గంటల పాటు.. బయట ఆరపెట్టాలని ..

ఒక వేల గాలి తగిలితే.. గుడ్డు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ సైడ్ డోర్ లో గుడ్లను నిల్వ ఉంచకూడదు. డోర్ తీస్తున్న సమయంలో బయట వాతావరణం.. ఫ్రిడ్జ్ లో ఉన్న వాతావరణం కలిసి.. గుడ్డు లోపల బాక్టీరియా తయారయి చెడిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నిల్వ ఉన్న గుడ్లను బటయకు తీసి వండే క్రమంలో.. రెండు గంటల పాటు.. బయట ఆరపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా పైన చెప్పిన విధంగా చేస్తే గుడ్డును ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచితే తినే అవకాశం ఉంటుంది.

ఈ సమస్యలతో బాధపడేవారు కాలిఫ్లవర్ ను దూరం పెట్టాల్సిందే..!

ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. కొద్దిమంది ఉదయమే పచ్చి కూరగాయలను ఆకుకూరలను తింటూ ఉంటారు. కూరగాయలలో మరియు ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఒక సీజన్లో ఒక్కొక్క రకమైన కూరగాయలు లభిస్తాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఎక్కువగా తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు మరియు ఎన్ని నష్టాలు తెలుసుకుందాం.

క్యాలీఫ్లవర్ లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కాలీఫ్లవర్ తినక పోవటం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సలహా
ఇస్తున్నారు.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ ను ఎక్కువగా తినటం వల్ల దానిలో ఉండే క్యాల్షియం వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా కాలిఫ్లవర్ ఎక్కువగా తినకూడదు.

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు కూడా క్యాలీఫ్లవర్ తినకూడదు. క్యాలీఫ్లవర్ లో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల యూరిన్ సమస్యలు ఏర్పడి మూత్రపిండాలకు సమస్య ఇంకా పెరుగుతుంది.కిడ్నీ సమస్యలతో బాధపడేవారు థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.

ఈ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..జాగ్రత్త సుమీ!

కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రమాదం. నిజానికి కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.

వేసవికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో మాంగనీస్ మరియు శరీరానికి మేలుచేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రమాదం.

జలుబు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొబ్బరి నీళ్ళలో ఉండే చలవ వల్ల జలుబు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.కొబ్బరి నీళ్లలో బీపీని తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారు మందులు వాడుతూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లో-బిపి పెరిగే ప్రమాదం ఉంది. కావున బిపి ఉన్న వాళ్ళు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు.

కడుపులో ఏదైనా సమస్యలు ఉన్న వారు కానీ, లేక ఏదైనా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ కొబ్బరి నీళ్లు తాగకూడదు . ఒకవేళ తాగాలనుకుంటే వైద్యుని సలహా తప్పనిసరి. పొట్ట ఉబ్బరం లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకపోవడం ఆరోగ్యానికి మంచిది.