Tag Archives: health

Samantha: తన ఆరోగ్యం పై స్పందించిన సమంత ఇప్పుడెలా ఉందంటే?

Samantha: సినీనటి సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇలా ఈ సినిమా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే సమంత తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ సమంత ఆరోగ్యం గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమంత తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.

ఒకప్పుడు తాను చాలా వీక్ గా మారిపోయాయని అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని ఈమె తెలిపారు. తన పనులను తానే చేసుకోగలుగుతున్నాను, బయటకు తిరగ గలుగుతున్నాను అంటూ సమాధానం చెప్పారు. ఇలా ఆరోగ్యం కుదుటపడటంతోనే శాకుంతలం సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొంటున్నానని, ఇలా ఈ ఇంటర్వ్యూలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని సమంత వెల్లడించారు.

Samantha: ఇప్పుడిప్పుడే బయట తిరుగుతున్న..

ఇకపోతే గత కొద్దిరోజులుగా ఈమె మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ వ్యాధి బారిన పడిన సమంత పూర్తిగా సినిమాలకు విరామం ప్రకటించి పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే ఈమె అనారోగ్య సమస్యల నుంచి కోరుకుంటున్నారని తన ఆరోగ్య పరిస్థితి బాగుంది అంటూ సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

Health: కొంతమందికి కొన్ని అలవాట్లు వాళ్ల జీవితంతో మర్చిపోలేరు. ఎంత ప్రయత్నించినా అవి మన నుంచి దూరం కావు. మరి కొన్ని అయితే ఎవరు చెప్పినా వినకుండా.. వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇదే దినచర్యలో ఒక ప్రక్రియగా మారిపోతుంది.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

అలాంటి వాటిళ్లో ఒకటి కూర్చున్న సమయంలో.. పడుకునే సమయంలో కాళ్లు ఊపడం. అయితే ఇలా చేయడం మంచిదేనా.. ఆ అలవాటు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.. కూర్చొని స్నేహితులుతో మాట్లాడుతున్న సమయంలో.. ఫోన్ ను అదేపనిగా చేస్తున్న సమయంలో కొంత మంది కాళ్లు ఊపుతారు.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

ఇలా చేయడం అనేవి.. ఆందోళన, పని ఒత్తిడికి కారకాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పని చేస్తున్న సమయంలో ఇంట్లోని ఎవరైనా చూసి అలా చేయడం మంచిది కాదని చెప్పినా వారి మాట వినరు. వారి మాటలు పెడచెవిన పెడతారు.

అరటిపండ్లు, బీట్ రూట్ వంటి వాటిని..

ఇక నిద్ర సరిగ్గా పట్టకపోవడం.. హర్మోన్ల సమతుల్యత కారణంగా ఇలా జరుగుతందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వాటికి ఎలా చెక్ పెట్టొచ్చంటే.. ముందుగా వైద్యులను సంప్రదించి ఐరన్ మాత్రలు వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతే కాదు.. అరటిపండ్లు, బీట్ రూట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలట. టీ, కాఫీలు ఎక్కువగా అలవాటు చేసుకుంటే మంచిదని.. ఉదయం కన్నా రాత్రి ఎక్కువగా నిద్రపోయే సమయంలో ఫోన్ అస్సలు చూడకూడదంటున్నారు. సాధ్యమైనంతగా.. టీవీ, ఫోన్ చూడటం తగ్గిస్తే మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే కాళ్లు ఊపే అలవాటు తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

Salman Khan: పాము కాటుకు గురైన సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఎలా ఉందంటే..!

Salman Khan: తన పుట్టినరోజుకు ముందు.. సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌కి బయలుదేరాడు. అక్కడ అతను విషం లేని పాము కాటుకు గురయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నటుడిని చికిత్స కోసం కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను ఈ రోజు ఉదయం 9 గంటలకు డిశ్చార్జ్ అయ్యాడు.

Salman Khan: పాము కాటుకు గురైన సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఎలా ఉందంటే..!

సల్మాన్‌ఖాన్‌ చేతికి పాము కరిచింది.. అయితే అతడి ఆరోగ్య పరిస్థతి బాగానే ఉన్నట్లు తెలిపారు. అతనికి యాంటీ-వెనమ్ మెడిసిన్ ఇవ్వబడిందని.. కొన్ని గంటలు అతడిని అబ్జర్వేషన్లో ఉంచి.. తర్వాత తనను ఇంటికి తీసుకెళ్లమని చెప్పినట్లు వైద్యులు తెలిపారు. మొత్తానికి తమ అభిమాన నటుడు పాము కాటు నుంచి క్షేమంగా బయట పడడంతో సల్లూ భాయ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Salman Khan: పాము కాటుకు గురైన సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఎలా ఉందంటే..!

ఇక అతడి పుట్టిన రోజును ప్రతీ సంవత్సరం తన విలాసవంతమైన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో జరుపుకోవడం అతడి సంప్రదాయం. గత సంవత్సరం లాక్‌డౌన్‌లో ఎక్కువ భాగం సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ శర్మ పేరు మీద ఉన్న తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. నటుడు అతను పొలంలో పని చేస్తున్న.. విత్తనాలు విత్తుతున్న అనేక చిత్రాలు, వీడియోలను పంచుకున్నాడు.

డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ 56వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలు, పుట్టినరోజు జరుపుకునేందుకు సల్మాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. ఈ ప్రాంతం చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం ఉంది. దీని కారణంగానే అతడు పాము కాటుకు గురయ్యాడు.

ఆర్ఆర్ఆర్ త్రయంతో ‘నాటు నాటు’ డ్యాన్స్:

ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 15’ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ త్రయంతో ఆయన చేసిన సందడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘నాటు నాటు’ సాంగ్ కు చరణ్, తారక్ ల దగ్గర స్టెప్ నేర్చుకుని మరీ వేశాడు సల్మాన్. వాళ్లతో కలిసి అడ్వాన్స్ గా అతడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు.

యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్.. అతడి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..

క‌రోనా మ‌హ‌మ్మారి తగ్గినట్లే చాపకింద నీరులా మరోసారి విస్తరిస్తోంది. రెండు వేవ్ లల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజానికం.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. ఎస్పీ బాలులాంటి లెజెండ్స్ ను మనకు కాకుండా కూడా చేసింది ఈ మాయదారి వైరస్.

కొన్ని రోజుల క్రితం డ్యాన్స్ మాస్టార్ శివశంకర్ కు కరోనా సోకి.. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ ఎక్కువ కావడంతో చనిపోయిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ కరోనా బారిన ప‌డి కోలుకున్నారు. తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ కి కరోనా సోకింది. ప్ర‌స్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. ఇలా వరుసగా సెలబ్రిటీలను కరోనా వదిలిపెట్టడం లేదు.

ఈ క్రమంలో తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డారు. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గత కొద్దిరోజుల ముందు నన్ను కలిసిన వారందరు దయచేసి కరోనా టెస్ట్ చేయింకోవాలని కోరుతున్నా.. నేను బాగానే ఉన్నా అందరు జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. రామ భక్తహనుమాన్ కి జై’’ అంటూ రాసుకొచ్చారు అర్జున్.

తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే తెలియజేస్తానని అతడు వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని.. దయచేసి ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు అండగా మంచు విష్ణు..!

కరోనా తగ్గినట్లే తగ్గి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఎంతో మంది సెలెబ్రిటీలకు ఆ వ్యాధి మళ్లీ సోకుతుంది. ఇలా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అతడు హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.

అతడి ఊపిరితిత్తులకు 75 శాతం ఇనెఫెక్షన్ సోకడంతో అతడి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని అతడి కుమారుడు అజయ్ కోరిన విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సినిమా తారలు స్పందిస్తున్నారు.

ఇప్పటికే సోనుసూద్ శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అంతే కాదు.. హీరో ధనుష్ కూడా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తాజాగా మాస్టర్‌ గురించి నటుడు మరియు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్‌ చేశారు.

శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. శివశంకర్‌ మాస్టర్‌ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తనతో తెలిపారని.. వాళ్లతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. మాస్టర్‌ రెండో కుమారుడు అజయ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడాను అని విష్ణు ట్వీట్‌ చేశారు.

మరోసారి పంజా విసురుతున్న కరోనా.. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే!

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని గడగడలాడించిన వైరస్. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచం నలుమూలలా వ్యాపించి లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ వైరస్ పుట్టి రెండేళ్లు దాటుతున్న కూడా ఇంకా కరోనా కేసులు తగ్గడం లేదు. కొన్ని దేశాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న, మరికొన్ని దేశాలలో అంతకంతకు విజృంభిస్తోంది.

యూరోప్ దేశాల్లో ఈ వైరస్ రోజుకో సరికొత్త రూపం సంతరించుకుంటూ విజృంభిస్తుంది.ఈ క్రమంలోనే యూరోప్ లో గత వారంలో 11 శాతం కేసులు పెరిగినట్లు ప్రకటించగా వచ్చే వసంత కాలం నాటికి కరోనా ఐరోపాలో 7,00,000 వరకూ కోవిడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని who సంస్థ యూరప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హాన్స్‌లుగే హెచ్చరించారు.

ఈ విషయం పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని యూరోప్ లోని దేశాలన్నిటిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వం తప్పనిసరిగా కరోనా నియంత్రణ కోసం నిబంధనలు పాటించాలని మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.ఇప్పటికే యూరోపియన్‌ దేశాల్లో అనేక ప్రాంతంలో 1బిలియన్‌ కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.యూరప్, మధ్య ఆసియా ప్రాంతాలలో కోవిడ్ కల్లోలం చాలా తీవ్రంగా ఉంది.

అంతేకాదు శీతాకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ప్రభుత్వాలు, ఆరోగ్య అధికారులు, వ్యక్తులు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి చర్య తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ క్లూగే అన్నారు. గత వారంలో ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, బెల్జియం దేశాలు కొవిడ్‌ నియంత్రణకు పాక్షిక లాక్‌డౌన్‌ సహా పలు కఠిన చర్యలు తీసుకున్నారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. వీటితో పాటుగా పలు దేశాలలో కరోనా మహమ్మారి కేసులు మరింత రెట్టింపు అయినట్లు తెలిపారు.

ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన కెసిఆర్ భార్య శోభ.. కుటుంబం మొత్తం ఢిల్లీలోనే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గతంలో ఈమె కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈమెకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పలు ఆసుపత్రిలో ఈమెకి చికిత్స చేయించినప్పటికీ కొందరు డాక్టర్ల సూచన ప్రకారం ఢిల్లీ
ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాను కలవమని సలహా ఇచ్చారు.

ఈ క్రమంలోనే తన కొడుకు కేటీఆర్ కూతురు కవితతో కలిసి కేసీఆర్ సతీమణి శోభ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.పరీక్షల నిమిత్తం వీరు శనివారం తిరిగే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా పరీక్ష ఫలితాలను చూసిన అనంతరం డాక్టర్ ఇన్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలోనే డాక్టర్ల సూచన మేరకు ఈమె ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

ఇక విషయం తెలిసిన కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఇలా కుటుంబం మొత్తం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇకపోతే ఈమెను కేవలం అబ్జర్వేషన్ లో ఉంచడం కోసమే అడ్మిట్ చేశారని శోభమ్మ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు వెల్లడించారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన వెంటనే ఆయన సతీమణి శోభమ్మ, కొడుకు కేటీఆర్, కూతురు కవిత కూడా కరోనా బారినపడ్డారు. అయితే వీరందరూ కోలుకున్నప్పటికీ కేసీఆర్ సతీమణి మాత్రం ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడటం వల్ల ఈమెకు ఢిల్లీలోని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

విషమంగా కైకాల ఆరోగ్య పరిస్థితి.. వెంటిలేటర్ పై చికిత్స.. ఆందోళనలో అభిమానులు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ మంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ప్రస్తుతం కైకాల సృహలోనే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.ఆయనకు చికిత్స అందిస్తున్నామని అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అతనికి ఐసియులోని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

కైకాల సత్యనారాయణ గారికి బీపీ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవటం వల్ల వాసో ప్రెజర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. గత కొద్ది రోజుల క్రితం తన ఇంటిలో జారిపడినప్పటినుంచి ఈయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఇతనికి అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యబృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా అతను కోలుకొని క్షేమంగా బయటకు రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..

ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నావనేది కాదు.. ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది చూస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోగలరు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొంతమందికి శరీరంలో వేడి కారణంగా నోట్లో పూత సమస్య ఏర్పడుతుంటుంది.

వాటిని వేడి పొక్కులు అని కూడా అంటారు. ప్రతీ ఒక్కరికీ ఈ సమస్య అనేది ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇలా రావడం వల్ల తిన్న ఆహారం రుచిగా ఉందా..లేదా అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. అయితే ఈ సమస్యను కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి చెక్ పెట్టవచ్చు. దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.. ఆ పొక్కులు ఏర్పడిన చోటు కాస్తంత నెయ్యిని రాస్తే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

బియ్యం కడిగిన నీటిని తీసుకొని దానిలో కొంత కలకండ్ కలిపి రోజులో చిన్న గ్లాసు తీసుకుంటే నోటి పూత సమస్య తగ్గుతుంది. పటిక బెల్లం కూడా నోటి పూత సమస్య నుంచి ఉపషమనం కలిగిస్తుంది. కొత్తిమీర ఆకులను బాగా నూరి.. ఆ రసాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఊస్తే.. నోటిపూత అనేది మాయం అయిపోతుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి చేసి ఊరుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని గమనించాలి.

వాటితో పాటు తినే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఎక్కవగా జీర్ణం అయ్యే ఆహార పదర్థాలను తీసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకోకపోవడమే మంచిది అంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్న తర్వాత నోట్లో కొన్ని నీళ్లు పోసుకొని పుక్కిలించి ఊయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన విధంగా పాటిస్తే.. పూత సమస్య ఉండదు.

ఎముకలు గట్టిగా తయారు చేయడంలో కాల్షియంతో పాటు ఇవి అవసరమే..!

మన ఎముకలు గట్టిగా..దృఢంగా ఉండాలంటే వాటికి కాల్షియం అనేది ఎక్కువగా ఉండాలని అందరికీ తెలిసిందే. కాల్షియంలో ఉండే మ్యాక్రోన్యూట్రియేంట్‌ అనేది బోన్స్‌ ను దృఢపరుస్తుంది. ఇవి ఎముకలు అనేవి విరకుండా చేస్తుంది. కాల్షియంతో పాటు అందులో ఇతర పోషకాలు కూడా ఉన్నాయట. ఎముకల సాంద్రతను పెంచడంతో ఇవన్ని కలిసి ఎంతగానో ఉపయోగపడతాయి.

దీంతో భవిష్యత్తులో కూడా బోన్స్‌ ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి.
సూర్యరశ్మి ద్వారా విటమిన్ డీ అనేది పుష్కలంగా లభిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇది ఎముకులను దృఢపరచడంలో సహాయం చేస్తుంది. యుక్త వయస్సులో ఉండే వారు రోజుకు దాదాపు 600 యూనిట్ల విటమిన్ డీ అనేది అవసరం అవుతుంది.

70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 800 యూనిట్లు అవసరం. ఎముకలను గట్టిగా తయారు చేయడంలో ప్రోటీన్స్ కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రోటీన్స్ అనేవి మాంసం, గుడ్లు, కాయధాన్యాలు, బీన్స్ లల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కూడా ఎముకలు ఇనుములా తయారు అవుతాయి. విటమిన్ డీ తో పాటు విటమిన్ సీ కూడా ఎముకల బలానికి ఉపయోగపడతాయట. సిట్రస్ పళ్లల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. అవేంటంటే.. ఉసిరి, నిమ్మ, జామలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

ఎముకల వ్యాధిని తగ్గించడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. విటమిన్ కే ఉన్న పళ్లను , పదర్ధాలను తినడం ద్వారా ఎముకులు తన పటిష్టతను పొందుతాయి. కాల్షియం జీవక్రియను పెంచే ప్రోటీన్ ను ఇది సక్రియం చేస్తుంది. పాలకూర, బ్రోకొలీ వంటి వాటిల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం కూడా ఎముకల దృఢత్వానికి ఎక్కువగా ఉపయోగపడతాయి.