Tag Archives: kerala

Malavika Sreenath: గదిలోకి పిలిచి కాంప్రమైజ్ అవ్వమన్నారు… క్యాస్టింగ్ కౌచ్ పై నటి షాకింగ్ కామెంట్స్!

Malavika Sreenath: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం మనకు తెలిసింది. అయితే ప్రతి ఒక్క రంగంలోనూ మహిళలు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కానీ సినిమా రంగంలో ఇది కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తాము క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగా ఈ విషయాల గురించి మాట్లాడారు.

తాజాగా మరొక నటి సైతం తాను కూడా క్యాస్టింగ్ బాధితురాలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మాళవిక శ్రీనాథ్ తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం మంజు వారియర్ కూతురి పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతుండగా తాను కూడా వెళ్లానని తెలిపారు. సినిమా వాళ్ళే తనకు కారు పంపించడంతో తాను అక్క తన తల్లి కలిసి ఆడిషన్స్ కోసం వెళ్ళాము.

ఓ బిల్డింగ్ లో ఆడిషన్స్ జరుగుతుండగా అక్కడికి వెళ్లి బయట కూర్చున్నాము అయితే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మీ జుట్టు సరిగా లేదు పక్కన రూమ్ లోకి వెళ్లి సరి చేసుకోండి అని చెప్పారు. దాంతో నేను గదిలోకి వెళ్ళగా నా వెనకే అతను వచ్చి నన్ను చాలా అసభ్యంగా తడమడం మొదలుపెట్టాడు. బయట మా అమ్మ అక్క ఉన్నారన్న భయం కూడా లేకుండా ఆయన లోపలికి వచ్చే పది నిమిషాలు కాంప్రమైజ్ అయితే ఆ పాత్ర నీకే వస్తుందని చెప్పారు.

Malavika Sreenath:కాంప్రమైజ్ అవ్వమని అడిగారు…

ఇక తాను అతని చెర నుంచి ఎలాగో తప్పించుకొని బయటకు వచ్చానని ఈ సందర్భంగా మాళవిక శ్రీనాథ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2021లో వచ్చిన మధురం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ప్రసుత్తం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీ గడుపుతున్నారు.

Actress Arya Parvathy: లేటు వయసులో మరో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి… వైరల్ అవుతున్న పోస్ట్!

Actress Arya Parvathy: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు చాలా లేటు వయసులో పిల్లలకు జన్మనివ్వడం మనం చూస్తున్నాము. వారి దృష్టి మొత్తం కెరియర్ పై పెట్టి లేటు వయసులో పెళ్లి చేసుకుని పిల్లలకు మరింత ఆలస్యంగా జన్మనిస్తున్నారు. అయితే ప్రస్తుతం హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నటి తల్లి లేటు వయసులో మరో బిడ్డకు జన్మనివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

చెంబట్టు’ ‘ఇలయవళ్ గాయత్రి’ వంటి సీరియల్స్ లో నటించి ఎంతో ఫేమస్ అయ్యారు కేరళకు చెందిన నటి ఆర్య పార్వతి. ప్రస్తుతం ఈమె వయసు 23 సంవత్సరాలు. ఇలా పెళ్లీడుకు వచ్చిన ఒక కూతుర్ని పెట్టుకున్నటువంటి ఈమె తల్లి 47 సంవత్సరాలు వయస్సు కలిగి ఉంది. అయితే ఇలా ఈ వయసులో నటి తల్లి మరొక ఆడబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.

ఈ విధంగా లేటు వయసులో హీరోయిన్ తల్లి మరో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషయం తెలిసినటువంటి నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తన తల్లి బేబీ బంప్ తోఉన్న ఫోటోలను నటి ఆర్య పార్వతి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

Actress Arya Parvathy: చెల్లిని ఆడించడం సంతోషంగా ఉంది…

ఇకపోతే తనకు బుల్లి చెల్లి పుట్టడంతో తనని ఎత్తుకొని ఆడిస్తున్నటువంటి ఒక వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఆర్య పార్వతి తన చెల్లిని ఇలా ఎత్తుకొని ఆడిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Actress Sheela Kaur: అల్లు అర్జున్ పరుగు పెట్టించిన నటి షీలా కౌర్ ప్రస్తుతం ఎలా ఉంది ఏం చేస్తుందో తెలుసా?

Actress Sheela Kaur: అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పరుగు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు నటి షీలా కౌర్. లంగా వోణీలో రెండు జడలు వేసుకుని అమాయకపు చూపులతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈమె ఎంతోమంది అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయారు.

ఈ సినిమా తర్వాత ఈమె నటించిన మస్కా, అదుర్స్ సినిమాలను చూసి అసలు పరుగు సినిమాలో నటించిన హీరోయిన్ షీలానేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయారు.
ఇలా ఈమె తెలుగు తమిళ భాషలలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె క్యాన్సర్ బారిన పడ్డారని,చాలా దీన పరిస్థితిలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా ఈమె క్యాన్సర్ బారిన పడ్డారంటూ వచ్చిన వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది.
ఈమె కేరళకు చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తినీ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈయన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. ఇక ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఇలా పెళ్లయిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పారు.

Actress Sheela Kaur: వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న షీలా కౌర్…

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి షీలా ప్రస్తుతం తన భర్తతో కలిసి ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా షీలా కౌర్ పెద్ద ఫోటోలను చూసినటువంటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభిస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు.

Poonam Kaur: వింత వ్యాధితో బాధపడుతున్న నటి పూనమ్ కౌర్.. కేరళలో చికిత్స తీసుకుంటున్న నటి!

Poonam Kaur: పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు.ఈమె సినిమాలలో చాలా తక్కువగా నటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వివాదాస్పదమైన పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు. ఇలా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తూ ఎంతో గుర్తింపు పొందారు.

ఇకపోతే ఈమె సినిమాల విషయం గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈమె పరోక్షంగా పోస్టులు చేస్తూ అందరిని కన్ఫ్యూషన్ కి గురి చేస్తూ ఉంటారు.మొత్తానికి సినిమాలకన్నా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచిన పూనమ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ విషయం వెల్లడించారు.

గత కొద్దిరోజులుగా కొందరు నటీమణులు అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే సమంత మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతుండగా తాజాగా పూనమ్ సైతం వింత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఈమె గత రెండు సంవత్సరాల నుంచి ఫైబ్రో మయాల్జియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు.

Poonam Kaur:రెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న పూనమ్…

ఈ వ్యాధి కారణంగా తాను ఎక్కువసేపు నిలబడలేకపోవడం, తొందరగా నీరసించి అలసిపోవడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం అలాగే జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నానని ఈమె తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం తాను ఈ వ్యాధికి కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్టు ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Lucky Person: పెయింటర్ ను వరించిన అదృష్టం..! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..! ఎలా అంటే.. !

Lucky Person: లక్ ఉండాలే కానీ.. అరటి పండు కూడా బంగారం అవుతుంది అంటారు. ఒక వేళ అదృష్టం లేకపోతే.. అదే అరటిపండి తింటే పన్ను ఇరుగుతుంది అనేది పెద్దలు చెబుతున్న మాట. ఇలా అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటిది ఓ వ్యక్తికి లాటరీ రూపంలో లచ్చిందేవి వచ్చిపడింది. అసలు ఆ కథేంటో తెలుసుకుందాం.

Lucky Person: పెయింటర్ ను వరించిన అదృష్టం..! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..! ఎలా అంటే.. !

మన దేశంలో లాటరీల ద్వారా డబ్బులు రావడం అనేవి తక్కువ కానీ.. విదేశాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. వారి బిజినెస్ కు సంబంధించి ప్రమోషన్ల కోసం ఇలాంటివి పెడుతుంటారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జూదం, లాటరీలాంటికి నిషేధించారు. కానీ మహారాష్ట్ర, బిహార్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి లాటరీలు పెడుతుంటారు. లాటరీ టికెట్లను బహిరంగంగానే అమ్ముతుంటారు. ఇలా లాటరీ టికెట్ తగిలి ఎంతో మంది రిక్షావాలాలు, డ్రైవర్లు కోటీశ్వరులు అయ్యారు. తాజాగా అదే లాటరీ టికెట్ కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను కోటీశ్వరుడిని చేసింది.


ఈ లాటరీ టికెట్ ను అతడు అనుకోకుండా కొన్నాడట..

అతడి పేరు సదానందన్ ఒలిపరంబిళ్. పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇక అతడికి ఎక్కువగా లాటరీ టికెట్లు కొనుక్కునే అలవాటు ఉంది. ఇటీవల అతడు కొన్ని కొన్న ఒక లాటరీ టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఎప్పుడు కొన్నా లాటరీ తగలకపోవడంతో.. తాను ఇక లాటరీ టికెట్లను కొనొద్దు అనుకున్నాడట. ఇప్పుడు తగిలిన ఈ లాటరీ టికెట్ ను అతడు అనుకోకుండా కొన్నాడట. అతడి ఓ షాప్ కు వెళ్లగా అక్కడ 500 నోట్ చూపించి తనకు కావాల్సిన అవసరాలు తీసుకున్నాడు. కానీ ఆ షాప్ యజమాని దగ్గర చిల్లర లేదు. దీంతో అతడు లాటరీ టికెట్ కొన్నానని చెబుతున్నాడు. అనుకోని రీతిలో ఆ రోజు మధ్యానానికే రిజల్ట్స్ వచ్చాయని.. అప్పుడు ఈ విషయాన్ని తానే నమ్మలేకపోయానని అంటున్నాడు. ఇక లాటరీలో అతడికి వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా.. అక్షరాల రూ.12 కోట్లు. అయితే అందులో 30 శాతానికి పైగా ట్యాక్స్ పోను మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటానని చెబుతున్నాడు.

Parking Fee: పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారా..! అయితే ఇది తెలుసుకోండి..!

Parking Fee: సాధారణంగా షాపింగ్ మాల్స్ నిర్వహించే వారు వినియోగదారులకు పార్కింగ్ ప్లేస్ ను కూడా అలాట్ చేస్తుంటారు. ఇది వారి బాధ్యత. అయితే ఈ పార్కింగ్ ప్లేస్ కు సదరు మాల్స్ వారు ఫీజు వసూలు చేస్తే… సరిగ్గా ఇదే విషయంపై కేరళలో ఓ వ్యక్తి హైకోర్ట్ ను ఆదేశించాడు.

Parking Fee: పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారా..! అయితే ఇది తెలుసుకోండి..!

దీంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు ప్రాథమికంగా మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పార్కింగ్ ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించటం లేదు కానీ అలా వసూల్‌ చేస్తే మాల్స్‌కే ప్రమాదం అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి కున్హి కృష్ణన్‌ పేర్కొన్నారు.

Parking Fee: పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారా..! అయితే ఇది తెలుసుకోండి..!

కలమస్సేరి మునిసిపాలిటీ ఎర్నాకులంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కూడా ప్రశ్నించింది. నిజానికి బిల్డింగ్ రూల్స్ ప్రకారం… పార్కింగ్ స్థలంలో  కూడా బిల్డింగ్ నిర్మాణంలో భాగంగానే ఉంటుందని.. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయబడుతుంది.

ఫీజును రూ. 20 వసూలు చేసినందుకు..
కాబట్టి భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాల్స్ తమ సొంత రిస్క్ తో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది.  అయితే ఇటీవల వడక్కన్ అనే వ్యక్తి డిసెంబర్ 2న లులు మాల్ ను వెళ్లినప్పుడు అతని నుంచి పార్కింగ్ ఫీజును రూ. 20 వసూలు చేసినందుకు హైకోర్ట్ ను ఆశ్రయించారు. తన నుంచి పార్కింగ్ వసూలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. ఆయన అందుకు నిరాకరించారు. దీంతో మాల్ ఎగ్జిట్ గేట్ లను మూసివేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈమేరకు  కోర్ట్  ఈ సమస్యకు సంబంధించిన వివరణను దాఖలు చేయవల్సిందిగా మున్సిపాలిటీని కోరడమే కాక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

రామ.. రామ అయేద్య రాముడి పేరుపై ట్రాఫిక్ చలానా.. సీటు బెల్టు పెట్టుకోలేదని..!

దేశంలో ఏ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ అయినా.. నిబంధనలకు విరుద్దంగా ఏ వాహనదారుడు అయినా వ్యవహరిస్తే అతడికి ఫైన్ వేస్తారు. అక్కడ ఆ నిబంధనకు అనుగురణంగా వాళ్లు ఫైన్ల రూపంలో డబ్బులను వసూలు చేస్తారు. అయితే కేరళలోని ట్రాఫిక్ పోలీసులు కాస్తంత అతి చేశారనే అనిపిస్తుంది. ఈ ఘటన చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది.

ఫైన్ వేసిన తర్వాత అతడి పేరుతో రసీదు ఇవ్వడం అనేది ట్రాఫిక్ పోలీసుల మొదటి కర్తవ్యం. అయితే ఇక్కడ కేరళ ట్రాఫిక్ పోలీస్ మాత్రం అయోద్య రాముడి పేరుమీద చలాన్ రాసి ఇచ్చాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. కేరళలోని కొల్లాం జిల్లా చాడమంగళంలో ఓ వ్యక్తిని సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని ట్రాఫిక్‌ పోలీసుల ఆపి రూ.500 ఫైన్ వేశారు. అయితే ఇదే కారణంతో అతడు ఒక గంట ముందు ఫైన్ కట్టాడు.

తాను అంతక ముందే కట్టాను అని వాళ్లకు చెప్పినా వినలేదు.. ఇక్కడ కూడా కట్టాలని వాళ్లు చెప్పారు. ఇక ఆ వాహనదారుడు చేసేది లేక అసలు పేరు కాకుండా అతడు.. తన పేరు రామా అని.. తన తండ్రి పేరు దశరథ అని.. ఊరు అయోద్య అని చెప్పాడు. కానీ పోలీస్ ఇవన్నీ వివరాలను ఆ రశీదు పై ఏ మాత్రం సందేహం రాకుండా రాశాడు. ఫైన్ వేశామా.. డబ్బు వసూలు చేశామా అన్నట్లే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కానీ.. వాహనదారుడు ఏ పేరు చెబితే మా కేంటి అన్నట్లు ఉంటుంది.

అలాగే అతడు రసీదు రాసి ఇచ్చాడు. అయితే వాహనదారుడు దానికి సంబంధించి రశీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అతడు చెప్పే పేరు, ఊరును కూడా అడగకుండా ఇలా రశీదు ఎలా రాస్తారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేరళలో పోలీసులు కారణం లేకుండా ఫైన్లు వేస్తున్నారంటూ.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లాటరీలో 20 కోట్లు గెలిచాడు… కానీ ఆ డబ్బును అందుకోలేక పోతున్నాడు… కారణం అదే!

సాధారణంగా కొందరికి అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోతుంటారు మరికొందరికి దురదృష్టం వెంటాడితే ఎన్ని కోట్లు ఉన్న రాత్రికి రాత్రే బిచ్చగాడిగా మారిపోతారు. అయితే మీరెప్పుడైనా ఒకే వ్యక్తికి అదృష్టం దురదృష్టం వెంటవెంటనే రావడం గురించి విన్నారా. అయితే ఈ కేరళకు చెందిన వ్యక్తికి జరిగిన విషయం గురించి తెలుసుకోవాల్సిందే.

కేరళకు చెందిన నహీల్ అనే వ్యక్తి గత కొంత కాలంగా దుబాయిలో నివసిస్తున్నారు. సెప్టెంబర్ 26న నహీల్ ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.ఈ టిక్కెట్ కొనుగోలు చేసే సమయంలో అతని అడ్రస్ కేరళ ఇవ్వగా అలాగే అతని ఫోన్ నెంబర్ లు రెండు ఇచ్చాడు. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబూదాబి సిరీస్‌ 232 లాటరీ డ్రాలో అతడు ఏకంగా 10 మిలియన్ దుబాయ్ దిర్హామ్‌లు గెలిచాడు.

మన భారత కరెన్సీ ప్రకారం అతను లాటరీలో ఏకంగా 20 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు.ఇలా 20 కోట్లను గెలుచుకున్న విషయాన్ని లాటరీ నిర్వాహకులు అతనికి తెలియ చేయాలని అతను ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ ప్రయత్నించడంతో ఆ రెండు సెల్ నెంబర్లు పని చేయకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే కేరళకు చెందిన నహీల్ నిజాముద్దీన్ కు తను లాటరీలో గెలిచిన 20కోట్ల విషయం తనకు ఇప్పటికీ తెలియదని ఎలాగైనా ఈ విషయాన్ని తనకు చేరవేసే వరకు మా ప్రయత్నం చేస్తూనే ఉంటానని లాటరీ నిర్వాహకులు తెలియజేశారు.దీన్ని బట్టి చూస్తే అదృష్టం దురదృష్టం రెండు తనని వెంటాడుతున్నాయని చెప్పవచ్చు.ఏదిఏమైనప్పటికీ 20 కోట్లు గెలుచుకొని తను పొందకపోవడం నిజంగానే దురదృష్టం.

కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. అబార్షన్ కు అనుమతించిన కోర్టు..

ఈ మధ్య కాలంలో దేశంలో ఉన్న కొన్ని కోర్టులు సంచలన తీర్పులను వెలువరిస్తున్నాయి. ఇటీవల పంజాబ్, హర్యానా హైకోర్టు మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని.. మైజర్ అయిన తర్వాత చట్టబద్దం చేసుకోవచ్చని.. అంతేకాకుండా మేజర్ అయిన తర్వాతనే విడాకులకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులు బాటు ఉంటుందని తీర్పు చెప్పింది.

తాజాగా మరో సంచలన తీర్పు వెలుగులోకి వచ్చింది. అత్యాచార బాధితులకు ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించింది కేరళ హైకోర్టు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్ లో గర్భస్రావం చేయడం అనేది నేరంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో అది చట్టబద్దమైనదిగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. తప్పని పరిస్థితుల్లో పిండాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే తొలగిస్తారు.

దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే కేరళ హైకోర్టు ఓ కేసులో ఇలా తీర్పు ఇచ్చింది.. ఆమె 8 నెలల గర్భవతి. గర్భస్రావం చేయాలని వైద్యులను సంప్రదించినప్పుడు.. వైద్యులు ఇలా చేయడం నేరం అంటూ చెబుతారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయిస్తుంది. ప్రెగ్నెన్సీ తీయించుకోవడం అనేది సదరు మహిళ సమ్మతి మాత్రమే అని.. దీనిపై తల్లిదండ్రులకు, భర్తకు ఎలాంటి అధికారం లేదని తెలిపింది.

18 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు గర్భవతి అయితే మాత్రం కచ్చితంగా తల్లిదండ్రుల సమ్మతి ఉండాల్సి ఉంటుంది. అయితే ఆమెకు అబార్షన్ చేసేందుకు కేరళ కోర్టు అంగీకరించింది. దానికి ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని సూచించింది. దీంతో బాధితులకు ఇది అనుకూలమనే చెప్పాలి. కానీ కొన్ని మార్గదర్శకాలను మాత్రం పాటించాలని సూచించారు.

ప్రేయసిని 10 ఏళ్లు బంధించాడు.. పోలీసుల విచారణలో మరో ట్విస్ట్..

ఓ వ్యక్తి తన ప్రేయసిని 10 ఏళ్ల పాటు నిర్భందించిన ఘటన కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో మలో కీలక విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రెహమాన్, సజిత ఇద్దరు ప్రేమికులు. 2010 సంవత్సరంలో సజిత పెళ్లి చేసుకోవాలనే కారణంతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు.

అప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లు. తర్వాత ఇంట్లో వాళ్లు కూడా ఆమెను వెతకడం మానేశారు. రెహమాన్ పెయింటింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించాడు. సజితను అతడు ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే పది సంవత్సరాలు బంధించాడు. బయట ప్రపంచానికి ఎవరికీ తెలియకుండా ఒక గదిలో ఉంచాడు. అయితే తాజాగా వాళ్లిద్దరు వితనస్సేరీలోని ఒక చిన్న ఇంటికి మారారు. అతడి కుటుంబసభ్యులు రెహమాన్ కనిపించడంత లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో అతడి విషయాలు ఏమి లభ్యం కాలేదు. అయితే ఓ నెన్మారా ప్రాంతంలో అతడి ఆచూకీ కనుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సజితను 10 ఏళ్లు బంధించిన మాట వాస్తవమే.. కానీ ఆమె ఇష్టంతోనే ఇలా చేశానని.. ప్రేమించుకున్న తాము పెళ్లిచేసుకోవాలని అనుకున్నామన్నారు.

ఆమెతో సహజీవనం చేసినట్లు చెప్పాడు. దీంతో ఆమెను పిలిచి పోలీసులు అడగ్గా.. అతడంటే ఇష్టమని చెప్పడంతో కేసు కొట్టేశారు పోలీసులు. తర్వాత వాళ్లిద్దరు అక్కడే రిజిస్టార్ ఆఫీస్ కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను పురగోమన కళా సాహిత్య సంఘం కొల్లంకోడు సమితి చేసింది. ఇక తాము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు.. అతడు మీడియాతో చెప్పాడు.