Tag Archives: kerala

దారుణం: కరోనా సోకిన మహిళపై ఆంబులెన్స్ లోనే వేధింపులు

సాధారణంగా మహిళల పట్లఎంతో నీచంగా ప్రవర్తించే మానవ మృగాలు ఎలాంటి పరిస్థితులు ఉనప్పటికీ మహిళల పట్ల ఏమాత్రం జాలి, దయ లేకుండా మహిళల పట్ల దారుణానికి పాల్పడుతుంటారు. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో కారొనతో బాధపడుతున్న ఓ మహిళ నిస్సహాయతను ఆసరాగా చేసుకొని ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రికి తీసుకెళ్తున్న మహిళను అంబులెన్స్ లోనే అటెండెంట్ ఆమె పట్ల నీచమైన చర్యలకు పాల్పడిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.

కేరళలోని మలప్పురం జిల్లాలో ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కరోనా సోకిన బాధిత మహిళ పెరింతల మన పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను ఏప్రిల్ 27న ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం అంబులెన్స్‌లో ల్యాబ్‌కు తరలించమని చెప్పగా అంబులెన్స్ లో ఆ మహిళ పట్ల అటెండెంట్  అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక కూడా వేధించాడు.

కరోనాతో ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న మహిళ అప్పుడు ఏమి చేయలేకపోయింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆంబులెన్స్ లో అటెండెంట్ తన పట్ల వ్యవహరించిన తీరును వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పగా.. సదరు మహిళ అటెండెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నేరానికి పాల్పడిన నిందితుడిని ప్రశాంత్‌గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.

ఆ దేవాలయాలు ఎంతో అద్భుతం.. ఎందుకంటే?

మన భారతదేశం ఆధ్యాత్మిక మందిరాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయాలలో వెలిసిన దేవ దేవతల విశిష్టతలు తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని దేవాలయాలలో కొన్ని వింత రహస్యాలు ఉన్నాయి. అయితే ఆ రహస్యాల వెనుక గల కారణం ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అలాంటి అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే కొన్ని దేవాలయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

* స్వామి వారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయంగా కేరళలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శయనమందిరం.

* 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు పడి తిరిగి అతుక్కొని దేవాలయం బిజిలీ మహదేవ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది.

* సంవత్సరానికి ఒక్కసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు
1నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.

* నిరంతరం కోనేటిలో నీరు ప్రవహించే దేవాలయాలు
1.మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్,
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి

*నిరంతరం జ్వాలా రూపంగా వెలిగే దేవాలయాలు
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.
3. మంజునాథ్.

ఈ దేవాలయాలలో జరుగుతున్న ఈ వింత రహస్యాలను గురించి ఇప్పటి వరకు ఎంతోమంది అన్వేషించి నప్పటికీ ఈ రహస్యం అంతుచిక్కకుండా ఉండడం ఎంతో విశేషమని చెప్పవచ్చు.

దేశంలోనే తొలిసారి.. తిరువనంతపురం మేయర్ గా 21 ఏళ్ల యువతి..!

ప్రస్తుతం దేశంలో ఆర్యా రాజేంద్ర‌న్ అనే్ యువతి పేరు మారుమ్రోగుతోంది. దేశంలో అతిపిన్న వయస్సులో మేయర్ పదవికి ఎంపికైన యువతిగా ఒక యువతి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని తిరువ‌నంత‌పురం నగరానికి ఆర్యా రాజేంద్రన్ మేయర్ కానున్నారు. సీపీఎం నుంచి పోటీ చేసిన ఆర్యా రాజేంద్రన్ విపక్ష కూటమి నుంచి సీనియర్ అభ్యర్థి బరిలో నిలిచినా విజయం సాధించారు.

అదృష్టం కలిసిరావడంతో ఆర్యా రాజేంద్రన్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు ఎన్నికలు జరగగా ఎల్డీఎఫ్ పార్టీ 516కు పైగా స్థానాలలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవల్ ముగన్ వార్డ్ నుంచి సీపీఎం తరపున ఆర్యా రాజేంద్రన్ పోటీ చేశారు.

ఎల్డీఎఫ్‌ పెద్దలు యువతరానికి పెద్దపీట వేయాలని భావించి ఆర్యా రాజేంద్ర‌న్ కు మేయర్ పదవి ఇస్తున్నట్టు నేడు ప్రకటించారు. గతంలో 23 సంవత్సరాలకే మేయర్ పీఠాన్ని అధిరోహించిన రికార్డు అలహాబాద్ కు చెందిన అభిలాష గుప్తాకు ఉండగా ఆర్య ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆర్యా బీఎస్సీ మ్యాథ‌మాటిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి ఆర్యాకు రాజకీయాలంటే ఎంతో ఆసక్తి.

ఆర్యా రాజేంద్ర‌న్‌ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కూడా కావడం గమనార్హం. తనకు అతిపిన్న వయస్సులో మేయర్ పోస్టు ఆర్యా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ పోస్టులో చేరడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ఆర్యా మీడియాకు వెల్లడించారు.

ఉద్యోగం పోయింది.. రూ.7 కోట్లు సంపాదించినా వ్యక్తి!

కరోనా ఈ ప్రపంచం మొత్తం వ్యాపించడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేశాయి. దీంతో అన్ని ప్రైవేటు రంగాలు మూతపడడంతో ఎంతోమంది నిరుద్యోగులుగా మారిపోయారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం కావడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా వ్యాపించి అందరికీ ఎన్నో కష్టాలను తెచ్చిందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ కరోనా కొందరికి మాత్రం ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తి నవనీత్ సజీవన్‌కు.

కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్ సజీవన్‌ గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు.కరోనా వ్యాపించడంతో ఉన్నఫలంగా అతని ఉద్యోగం ద్వారా వచ్చే వేతనంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిస్తూ వస్తున్న ఆ కంపెనీ అతడిని నోటీసు పీరియడ్ కింద పని చేయించుకుంటూ ఉంది.చాలీచాలని జీతంతో ఎన్నో బాధలు అనుభవిస్తున్న నవనీత్ తన జీతంలో కొంత డబ్బుతో లాటరీ టికెట్ కొన్నాడు.

లాటరీ టికెట్ కొంటూ తనకు అదృష్టం కొంచమైనా ఉందో లేదో అని భావించి లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.ఆదివారం దుబాయి డ్యూటీ ప్రీ మిలీనియం మిలియనీర్ డ్రా నిర్వాహకులు నవనీత్‌కు ఫోన్ చేసి లాటరీ టికెట్ ద్వారా 7.4 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నారని చెప్పడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నవంబర్ 22న ఆన్లైన్ ద్వారా లాటరీ టికెట్ కొన్న నవనీత్ లాటరీ గెలవడంతో తన కష్టాలన్నీ తీరిపోయాయని ఎంతో సంబరపడ్డాడు. తన గెలుచుకున్న ప్రైజ్ మనీతో తన కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు తన స్నేహితులకు, సహోద్యోగుల అవసరాలకు కొంత డబ్బును వినియోగిస్తున్నట్లు నవనీత్ సజీవన్‌ తెలిపారు. లాటరీ ద్వారా ఒకే సారి ఇంత మొత్తంలో డబ్బులు గెలవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

కేరళలో ప్రాణాలు తీస్తున్న ప్రాణాంతక బ్యాక్టీరియా.. కరోనా కంటే ప్రమాదమా..?

2020 సంవత్సరం దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వైరస్ లు, బ్యాక్టీరియాలు ప్రజలకు కొత్త కష్టాలను సృష్టిస్తున్నాయి. ఒక వ్యాధి అదుపులోకి వచ్చిందని అనుకునే లోపు మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. దేశంలో 10 నెలలు గడిచినా కరోనా మహమ్మారి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినా వైరస్ పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో వ్యాక్సిన్ వచ్చినా కరోనాను కట్టడి చేయలేమా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో కొత్త వైరస్ లు, బ్యాక్టీరియాలు వెలుగులోకి వస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేరళలోని కోజికోడ్ లో షిగెల్లా అనే బ్యాక్టీరియా వల్ల 11 సంవత్సరాల బాలుడు మృతి చెందారు. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో ఆ బాలుడితో సన్నిహితంగా మెలిగిన వారిలో సైతం షిగెల్లా లక్షణాలు కనిపిస్తున్నాయి. బాలుడి స్నేహితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందితే మాత్రం కరోనా కంటే ప్రమాద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కడుపులో తిప్పడం, జ్వరం, అతిసారం లాంటి లక్షణాలు ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. కేరళలో ఈ వ్యాధి బారిన పడి 20 మంది ఆస్పత్రులలో చేరారు. అయితే వైద్యులు మాత్రం ఈ బ్యాక్టీరియా కొత్తది కాదని చాలా సంవత్సరాల క్రితమే దీనిని గుర్తించారని చెబుతున్నారు.

గతేడాది ఒక పాఠశాలలో 40 మంది విద్యార్థులలో షిగెల్లా వ్యాధి లక్షణాలు కనిపించగా వీరిలో ఇద్దరికి షిగెల్లా నిర్ధారణ అయింది. కొందరు ఈ బ్యాక్టీరియా బారిన పడినా ఎలాంటి లక్షణాలు కనిపించవని అయితే షిగెల్లా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణతో పాటు చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.