Tag Archives: krishna

Balakrishna: ఆ టాలీవుడ్ హీరోల స్టామినా తగ్గిపోయిందా… బాలయ్య మాత్రమే ఫామ్ లో ఉన్నారా?

Balakrishna:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి వారి తర్వాత జనరేషన్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలు. ఇక ఈ జనరేషన్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారు. అయితే చిరంజీవి కన్నా ముందుగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థానంలో కొనసాగారు బాలయ్య.

అయితే బాలయ్య నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఊహించని విధంగా సుమన్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. అయితే కొన్ని కారణాల వల్ల సుమన్ అతి తక్కువ సమయంలోనే ఫెయిడౌట్ అయ్యారు.ఇక మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ వచ్చారు.ఇక వీరి వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో వీరి హవా కొంతమేర తగ్గిందని చెప్పాలి.

ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత కొన్ని రోజులపాటు సినిమాకు విరామం ప్రకటించారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయని నిరూపించాయి. ఇక నాగార్జున బాలకృష్ణ పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉంది. ఇక నిన్న విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు రూ.16.68 కోట్ల షేర్ రాబట్టింది.

Balakrishna: ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య..

అదేవిధంగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా రూ.2.42 కోట్ల రూపాయలు రాబట్టింది వెంకటేష్ ఈ మధ్యకాలంలో వరుస మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఈయన సినిమాలు కూడా ఎప్పుడు మొదటి రోజు 10 కోట్ల షేర్స్ రావట్లేదు.ఇక మిగిలినది నందమూరి నటసింహం బాలకృష్ణ ఈయన తాజాగా నటించిన చిత్రం అఖండ. అఖండ సినిమా విడుదల అయినా మొదటి రోజు ఏకంగా రూ. 18.04 కోట్ల షేర్ ను రాబట్టింది.దీన్ని బట్టి చూస్తే సీనియర్ హీరోలలో బాలకృష్ణనే ఫుల్ ఫామ్ లో ఉన్నారని మిగిలిన హీరోల హవా తగ్గిపోయిందని తెలుస్తుంది.

Actress Jayachitra: ఆ చిన్న పొరపాటు వల్ల బాహుబలి సినిమా అవకాశాన్ని కోల్పోయాను.. సీనియర్ నటి జయ చిత్ర కామెంట్స్ వైరల్!

Actress Jayachitra: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో గ్లామరస్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి జయ చిత్ర ఒకరు.అప్పట్లో ఈమె కృష్ణంరాజు కృష్ణ శోభన్ బాబు వంటి హీరోల సరసన నటించి అద్భుతమైన నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ విధంగా గట్టిగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో అద్భుతంగా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.

హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందినటువంటి జయ చిత్ర సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ఫుల్ అత్త పాత్రలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో వచ్చినటువంటి పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జయచిత్ర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు సీరియల్స్ లో కూడా నటించానని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగులో రాఘవేంద్రరావు బంధువులు తెరకెక్కిస్తున్నటువంటి మంగమ్మగారి మనవడు సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.ఆ సమయంలో తాను రాజమౌళి గెస్ట్ హౌస్ లో ఉన్నానని ఇలా తనకు అవకాశం రావడంతో తాను ఈ సీరియల్లో చేయడానికి ఓకే చెప్పాను.అయితే అదే సమయంలోనే కొందరు ఉద్దేశపూర్వకంగా తాను ఈ సీరియల్ లో నటించడానికి ఇష్టత చూపలేదని తను ఫారెన్ వెళ్లాలనుకుంటున్నాను అంటూ దర్శకులకు అబద్ధాలు చెప్పారు.

Actress Jayachitra:శివగామి పాత్ర నాకే వచ్చేది..

ఇది నిజమే అనుకొని నాకు ఈ సీరియల్లో అవకాశం లేకుండా పోయింది.హీరోయిన్ గా ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకున్న తనకు ఈ సీరియల్ మిస్ అవ్వడంతో ఆ అసంతృప్తి తనలో అలాగే ఉండిపోయిందని ఈమె తెలియజేశారు.ఒకవేళ ఈ సీరియల్లో కనుక నేను నటించి ఉంటే తప్పకుండా నాకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించే అవకాశం వచ్చేదని ఆ చిన్న పొరపాటు కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయానంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి చివరి కోరికను తీర్చలేకపోయారా…కుమిలిపోతున్న మహేష్ బాబు?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం జరిగిన విషయం మనకు తెలిసిందే. సెప్టెంబర్ 28వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇందిరా దేవి తుది శ్వాస విడిచారు. ఇలా ఇందిరా దేవి మరణించడంతో మహేష్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపోతే తల్లి పట్ల ఎంతో ప్రేమను చూపించే మహేష్ బాబు తన తల్లి చివరి కోరికను నెరవేర్చలేకపోయారని, ప్రస్తుతం ఈ విషయాన్ని గుర్తుచేసుకొని మహేష్ బాబు ఎంతగానో కుమిలి పోతున్నారని తెలుస్తోంది.

ఇంతకీ ఇందిరా దేవి చివరి కోరిక ఏంటి మహేష్ బాబు తీర్చలేని ఆ కోరిక ఏంటి అనే విషయానికి వస్తే..మహేష్ బాబు ఇందిరాదేవి ఆయన కుమార్తె సితార ఇద్దరు ఒకే పోలికలతో ఉండటం వల్ల సితార అన్న కూడా మహేష్ బాబుకు అమితమైన ప్రేమ అలాగే సితార తన నానమ్మ ఇందిరా దేవితో ఎంతో సమయం గడుపుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇందిరాదేవి తన మనవరాలు సితారకు ఓణీ ఫంక్షన్ చేయమని కోరారట.

అయితే మహేష్ బాబుకు ఇలాంటివన్నీ ఇష్టం లేకపోవడంతో ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు అంటూ ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది.అయితే ఇందిరా దేవి తరచూ తన కోరిక గురించి మహేష్ బాబు దగ్గర ప్రస్తావించడంతో ఇప్పుడు అప్పుడు అంటూ మహేష్ బాబు ఆలస్యం చేస్తూ వచ్చారు. అయితే అదే సమయంలోనే ఇందిరా దేవి అనారోగ్యానికి గురయ్యారు.

Mahesh Babu: కొడుకుగా బాధ్యతలు నిర్వర్తించిన మహేష్…

ఈ విధంగా ఈమె అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా మహేష్ బాబుకు తన తల్లి లేని బాధ ఒకవైపు వేధిస్తుండగా మరోవైపు తన తల్లి సితార గురించి అడిగిన కోరికను తీర్చలేకపోయానని మరింత బాధపడుతున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా మహేష్ బాబు తన తల్లి మరణం పట్ల ఎంతగానో కృంగిపోయారు ఇక కొడుకుగా మహేష్ బాబు దగ్గరుండి హిందూ సంప్రదాయాల ప్రకారం తన తల్లికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు.

Indira Devi: మహేష్ బాబు తల్లి మృతి.. విషాదంలో ఘట్టమనేని ఫ్యామిలీ..!

Indira Devi: ఒకప్పటి అగ్ర హీరో అయినా కృష్ణ సతీమణి ఇందిరా దేవి గురించి మనందరికీ తెలిసిందే. ఈమె మహేష్ బాబు తల్లి అన్న విషయం కూడా తెలిసిందే. మహేష్ బాబుకి ఇందిరాదేవి అంతే ప్రాణం అని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే పలుసార్లు స్టేజ్ పై తన తల్లి గురించి మాట్లాడినప్పుడు మహేష్ బాబు ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే మహేష్ బాబు తల్లి ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వినిపించాయి.

గత కొద్ది రోజులుగా అనారోగ్యాలు సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవి తాజాగా ఆ పరిస్థితి మరింత విషమించడంతో ఆమె ఎమర్జెన్సీ వార్డ్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటోంది. అయితే తాజాగా అందులో సమాచారం ప్రకారం ఆమె కొద్దిసేపటి క్రితం ఇంట్లోనే తుది శ్వాస విడిచింది. దీంతో ఒక్కసారిగా మహేష్ బాబు ఇంట్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

ఈ వార్త తెలిసిన పలువురు ఘట్టమనేని అభిమానులు ఇందిరా దేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. దంపతులకు మహేష్ బాబు, రమేష్,మంజుల జన్మించారు. కాగా కృష్ణ రెండవ భార్య అయిన విజయనిర్మల 2019లో మరణించిన సంగతి తెలిసిందే.

Indira Devi: కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవీ మృతి..

ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఇందిరా దేవిని 1961 లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కృష్ణ విజయనిర్మలను 1969 లో రెండవ పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా అతను అన్న ను కడసారి కూడా చూడలేకపోయారు మహేష్ బాబు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే ఘట్టమనేని ఫ్యామిలీ కోరుకుంటుండగా ఇంతలోనే ఇందిరా దేవి ఆరోగ్యం సీరియస్ కావడం ఆమె మరణించడంతో ఒకసారిగా ఘట్టమనేని ఫ్యామిలీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

Sudheer Babu -Payal Rajputh: పాయల్ నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తా మంచి డ్రెస్ కొనుక్కో.. వేదికపైనే పాయల్ పరువు తీసిన సుధీర్ బాబు?

Sudheer Babu -Payal Rajputh: కృష్ణ మేనల్లుడిగా, మహేష్ బావగా సుధీర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈయన హీరోగా పలు సినిమాలలో నటించినా ఈయనకు ఏది సరైన బ్రేక్ ఇవ్వలేదని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికీ ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలను అందుకొని ఈయన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కృతి శెట్టితో కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమా చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సుధీర్ బాబు హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన తీస్ మార్ ఖాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా తాజాగా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబు, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు హాజరయ్యారు.ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక కోసం పాయల్ రాజ్ పుత్ వేసుకున్న డ్రెస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈమె తన ప్యాంటు మొత్తం చిరిగిపోయి ఉన్న విధంగా డిజైన్ చేశారు.ఇలా ఈ ప్యాంటు వేసుకొని రావడంతో ఒక్కసారిగా తన డ్రెస్సింగ్ స్టైల్ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అయితే సుధీర్ బాబు తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి మనసులో దాచుకోలేక తన డ్రెస్ పై దారుణమైన కామెంట్ చేశారు.ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ పాయల్ నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను ఓ మంచి డ్రెస్ కొనుక్కో అంటూ వేదికపైనే తన పరువు తీశాడు.

Sudheer Babu -Payal Rajputh: అభిమానులకు ఇలా ఉంటేనే ఇష్టమేమో….

ఇలా పాయల్ డ్రెస్ గురించి సుదీర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా అభిమానులను ఉద్దేశిస్తూ… మీరు ఒప్పుకోరేమో మీకు ఇలాగే బాగున్నట్టుంది అంటూ సుధీర్ బాబు మరో సెటైర్ వేశారు. మొత్తానికి ఈమె డ్రెస్ చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇదే అయినప్పటికీ సుధీర్ బాబు మాత్రం తన ఫీలింగ్ దాచుకోకుండా బయటకు చెప్పడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi: ఈ ఫ్లాప్ సినిమా చిరంజీవిని మెగాస్టార్ చేసిందనే విషయం మీకు తెలుసా?

Chiranjeevi: ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి అగ్ర హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో ఈయన విలన్ పాత్రలలో నటిస్తూ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

 

ఇకపోతే ఈయనలో ఉన్న టాలెంట్ గుర్తించిన కొందరు దర్శక నిర్మాతలు ఈయనకు హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ విధంగా స్వయంకృషితో చిరంజీవి సినిమాలలో నటిస్తూ నేడు ఈ స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఈయన బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. తద్వారా ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్నారు.

Chiranjeevi: ఆ విషయంలో విజయశాంతిని చాలా అవమానించారు.. చిరంజీవి గారికి చెబుదామంటే కలవలేక పోయాను: సీవీల్ నరసింహారావు

ఇకపోతే ఈయన పేరు ముందు మెగాస్టార్ అని రావడానికి ఓ నిర్మాత కారణమని అయితే ఈ బిరుదు ఒక ఫ్లాప్ సినిమా వల్ల వచ్చిందని విషయం చాలామందికి తెలియదు. మరి ఈయనకు మెగాస్టార్ అని బిరుదు ఇచ్చినది ఎవరు? ఇతనికి ఆ ఫ్లాప్ సినిమా రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్.రామారావు నిర్మాణంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సుమారు ఐదు సినిమాల వరకు వచ్చాయి.

ఈ సినిమాలన్నీ కూడా యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కినవే వీరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం అభిలాష, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం చాలెంజ్ రాక్షసుడు మరణం మృదంగం వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలలో మరణం మృదంగం మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

మరణ మృదంగంతో మెగాస్టార్ గా మారిన చిరు…

ఇకపోతే మరణం మృదంగం సినిమా ముందు వరకు సుప్రీం హీరోగా ఉన్నటువంటి చిరంజీవి ఈ సినిమాతో మెగాస్టార్ అయ్యారు. కె ఎస్ రామారావు మరణం మృదంగం సినిమా సమయంలో థియేటర్లో స్క్రీన్ పై తన పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదును ఉండాలని సూచించారట.అప్పటినుంచి ఈయన పేరు ముందు మెగాస్టార్ అని బిరుదు ఉంది అయితే మరణం మృదంగం సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాల తర్వాత కె ఎస్ రామారావు మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయకపోవడం గమనార్హం.

Super Star Krishna : సినిమాలో నటిస్తావా అని అడిగినందుకు మహేష్ బాబు స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడు: కృష్ణ

Super Star Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నటుడు మహేష్ బాబు గురించి ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి కృష్ణ తన సినీ కెరీర్లో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులకు తెలియజేయడం కోసం తన కూతురు మంజుల యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తండ్రిని ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్ వ్యూలో భాగంగా కృష్ణ తన కెరియర్ లో జరిగిన సంఘటనల గురించి అలాగే తన సినిమా విషయాల గురించి ఎన్నో తెలియజేశారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా మంజుల కృష్ణని ప్రశ్నిస్తూ మహేష్ బాబు హీరోగా పరిచయం చేయడం గురించి ప్రశ్నించారు.ఈ క్రమంలోనే చిన్నప్పుడు మహేష్ బాబుతో జరిగిన ఒక సంఘటన గురించి కృష్ణ ఈ సందర్భంగా బయటపెట్టారు.

Mahesh Babu: నటిస్తావా అని అడిగినందుకు మహేష్ బాబు స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడు: కృష్ణ

ఒక రోజు ఒక సినిమా షూటింగ్ సమయంలో తనతోపాటు మహేష్ బాబుని కూడా షూటింగ్ కి వెంట తీసుకొని వెళ్ళాను.షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు ఒక మూలన మెట్లపై కూర్చుని గడ్డం కింద చేతులు పెట్టుకుని షూటింగ్ చూస్తున్నాడు. అది చూసి నువ్వు నటిస్తావా అని అడిగాను. నేను చేయను అంటూ బాగా మారాం చేశాడు.

Mahesh Babu: నటిస్తావా అని అడిగినందుకు మహేష్ బాబు స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడు: కృష్ణ

చిన్నప్పుడే పరిగెత్తించాడు..

చేస్తావా చేయవా అంటూ నేను అడిగేసరికి మహేష్ బాబు స్టూడియో మొత్తం పరుగులు తీశాడు. నేను కూడా తన వెంట స్టూడియో మొత్తం పరుగులు పెట్టాల్సి వచ్చిందని ఈ సందర్భంగా కృష్ణ తెలిపారు. ఇకపోతే ఆయన మే 31వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవడంతో పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Flash Back : 1994 జనవరిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో అనుకోకుండా ఒక చిత్రం ముందుకు దూసుకు వచ్చింది.?!

ఆ సంవత్సరంలో స్టార్ హీరోలైన కృష్ణ, చిరంజీవి, నాగార్జున బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేశారు. సంక్రాంతి కానుకగా ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. అందులో ముందుగా విడుదలైన “ముగ్గురు మొనగాళ్ళు” 1994, జనవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. 

అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, నగ్మా, రమ్యకృష్ణ, రోజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో చిరంజీవి మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేశాడు. రంగనాథ్, శ్రీవిద్య తమ కుమారులు పృథ్వీ, విక్రమ్, దత్తాత్రేయ (చిరంజీవి త్రిపాత్రాభినయం)లతో ఒక గ్రామంలో నివసిస్తున్నారు. ఒక కేసు విషయంలో రంగనాథ్ ను శరత్ సక్సేనా చంపివేస్తాడు.

గర్భవతి అయిన శ్రీవిద్య పారిపోతూ పృథ్వీ నుండి విడిపోతుంది. గూండాల నుండి తప్పించుకునేటప్పుడు తన కొడుకు చంపబడ్డాడని అనుకుంటుంది. ఒక ఆలయంలోకి వెళ్ళి అక్కడ కవలలకు జన్మనిస్తుంది. సంతానం లేని పూజారి ఒక కొడుకును దత్తత తీసుకుంటాడు, శ్రీవిద్యతో ఉన్న విక్రమ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవుతాడు. దత్తాత్రేయ నృత్య ఉపాధ్యాయుడు. సోదరులు ఒకరినొకరు, తల్లిని ఎలా కలిసారు, విలన్లపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అనేది మిగతా కథ.

నెంబర్ వన్ 1994 జనవరి 14 న విడుదలైన తెలుగు చిత్రం.ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం, సంగీతం, దర్శకత్వం ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి అందించారు.ఈ చిత్ర గీతాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కృష్ణ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ శ్రీ షిర్డీ సాయి ఫిల్మ్స్…. తల్లితండ్రులు చనిపోగా అనాథగా మారిన ఒక కుటుంబాన్ని పెద్ద కుమారుడు ఎలా పోషించి ప్రయోజకత్వం సాధించాడనేది కథ. పెద్ద కుమారుడిగా ఘట్టమనేని కృష్ణ నటించారు. కృష్ణ ఇందులోని పాటలలో శివాజీ తదితర వేషాలలో కనిపించారు.

తిరుమల ఆలయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
1994 జనవరి 21 రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో “గోవిందా గోవిందా” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. త్రేతా యుగం, కలియుగం మధ్య కాలంలో శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరుడిగా ఎందుకు భూమి వెలశాడో తెలిపే కథతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కథ ప్రస్తుతం లోకి వస్తే బ్యాంకాక్ లోని ఓ తాంత్రికుడు వేంకటేశ్వరుడి కిరీటానికి ఓకన్యను బలి ఇవ్వడం ద్వారా, టెలి కైనెసిస్ అనే ప్రక్రియ ద్వారా లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

తిరుమల ఆలయంలోని ఆ కిరీటాన్ని దొంగిలించే బాధ్యత ముంబై లో పేరుమోసిన దొంగయైన పరేష్ అనే వ్యక్తికి అప్పగిస్తాడు. చిన్నప్పటి నుంచి బ్యాంకాక్ లో పెరిగిన నవీన అనే యువతి తన తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో భారతదేశంలో తాడేపల్లి గూడెంలో ఉన్న తన బామ్మను వెంటతీసుకుని వెళ్ళడానికి వస్తుంది… ఆ సంవత్సరం జనవరి నెలలో ఒక వారం తర్వాత మరొక చిత్రం బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చాయి.. నాగార్జున హీరోగా నటించిన “గోవిందా గోవిందా ” చిత్రం పరాజయం పొందింది, మెగాస్టార్ నటించిన “ముగ్గురు మొనగాళ్ళు” “యావరేజ్ హిట్ గా నిలవగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన “నెంబర్ వన్” చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Krisha – Rajnikanth : ఈ ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి నటించిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెట్టింది.!!

ఒక హీరో తెలుగులో సూపర్ స్టార్ అయితే మరొక హీరో తమిళంలో సూపర్ స్టార్. వీరిద్దరూ కలిసి నటించే సమయానికి సూపర్ స్టార్ కృష్ణ “స్టార్” గా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. అలా తెలుగు, తమిళ సూపర్ స్టార్ లు కలిసి నటించిన చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఎలా పరుగులు పెట్టిందో చూద్దాం…”

అన్నదమ్ముల సవాల్ ” 1978 లో విడుదలైన తెలుగు నాటక చిత్రం. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, రజనీకాంత్, జయచిత్ర, చంద్రకళ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కన్నడంలో విష్ణువర్ధన్, రజనీకాంత్ లు కలసి నటించిన “సహోదర సవాల్” ను పునర్నిర్మించిన చిత్రం. కన్నడంలో చిత్రానికి కూడా కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు. రెండు చిత్రాలకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు. కన్నడ పాట “హే నానాగాగాయియే” యొక్క తెలుగు వెర్షన్ “నాకోసమే నీవున్నదీ” అలానే ఉంచబడింది. “నీ రూపమే” అనే పాటను” ఓ నల్లనే సవి మథోండా” స్థానంలో ఉంచబడింది. ఈ పాటను చెళ్లపిళ్ల సత్యం కన్నడ చిత్రం “సీతారాములు” లో “ఈ రూపావె నానీ బాలినా” గా ఉపయోగించారు.

ఇద్దరు సోదరులు (కృష్ణ , రజనీకాంత్) మధ్య ఘర్షణ జరగి విడిపోవడం, చివరికి వారు ఎలా ఏకం అవుతారు అనే అంశంపై కథ రాయబడింది. జయచిత్ర, చంద్రకళ వరుసగా తమ ప్రేమ అభిరుచులను పోషిస్తారు. అంజలీ దేవి సహాయక తారాగణంలో హలాం, జయమాలిని, చలం, అల్లు రామలింగయ్యలతో కలిసి తల్లిగా నటించింది. 1978 లో విడుదలైన పొట్టేలు పున్నమ్మ,కటకటాల రుద్రయ్య.. అలాగే ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ “రామకృష్ణులు” వంటి చిత్రాలతో పోటీపడి “అన్నదమ్ముల సవాల్” చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి ఆనాటి విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Super Star Krishna : హీరో కృష్ణ నటించిన”నెంబర్ వన్” చిత్రం టైటిల్ ఆ రోజుల్లో ఎందుకు కాంట్రవర్సీగా మారిందో తెలుసా.!?

ఎస్వీ కృష్ణారెడ్డిగా పిలువబడే సత్తి వెంకటకృష్ణారెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు.దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలుచిత్రాలు విజయవంతమయ్యాయి.

ఎస్.వి.కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు. కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు. మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో “పగడాల పడవ” అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతను సినిమాలలో రాణించాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు.

1991మనిషా ఫిలిమ్స్, కె అచ్చిరెడ్డి నిర్మాణం, కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో “కొబ్బరి బొండం” విడుదలైంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, నిరోషా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఎస్.వి.కృష్ణారెడ్డి కథ, సంగీతం సమకూర్చారు. దర్శకత్వంలో ఎలాంటి అనుభవం లేకున్నా ఆ తర్వాత మనిషా ఫిలిమ్స్ తమ సొంత బ్యానర్ లో ఎస్.వి.కృష్ణారెడ్డికి “రాజేంద్రుడు-గజేంద్రుడు” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించింది.

ఆ తర్వాత “మాయలోడు” చిత్రానికి దర్శకత్వం వహిస్తూ… షూటింగ్ గ్యాప్ లో సూపర్ స్టార్ కృష్ణకి కథలోని ఓ సీన్ చెప్పారు. హీరో కృష్ణ ఆ సీన్ బాగుంది చేద్దామని చెప్పారు. మిగతా కథ సిద్ధం చేసుకొని.. 1994 మనీషా ఫిలిమ్స్, కె.అచ్చిరెడ్డి నిర్మాణం, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘నెంబర్ వన్’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో కృష్ణ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి సంగీత సారధ్యంలో వచ్చిన ఈ చిత్రంలోని ఐదు పాటలు మంచి విజయాన్ని పొందాయి. ముఖ్యంగా “కోలో..కోలో కోయిలమ్మ కొండ కోన బుల్లెమ్మ” అనే పాటలో సూపర్ స్టార్ కృష్ణ వివిధ రకాలైన గెటప్ లో కనిపించడం ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

అయితే 1990 దశకంలో హీరో కృష్ణ చిత్రాలు తగ్గిపోయినా కూడా “నెంబర్ వన్” టైటిల్ పెట్టడం ఏంటి అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. ప్రతి ఇంట్లో కుటుంబ బాధ్యతలను తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. “నెంబర్ వన్” చిత్రంలో తల్లి, తండ్రి చనిపోగా కుటుంబ బాధ్యతలను హీరో భుజాన వేసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు. కావున ఈ చిత్రానికి హీరో కృష్ణ నెంబర్ వన్ అని చెప్పడంతో కాంట్రవర్సీ సద్దుమణిగింది.