Tag Archives: money

Pitapuram: పవన్ ను ఓడించే అందుకు కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపీ… పవన్ గెలుపును ఒప్పుకున్నట్టేగా?

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి చూపు పిఠాపురం పైనే ఉంది.

పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్ లో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కు మెజారిటీ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆయనకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వంగ గీతాను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు. అంతేకాకుండా ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు కూడా రచిస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఆ నియోజకవర్గంలో మండలాల వారిగా ఇన్చార్జిలను కేటాయిస్తూ పార్టీ విజయానికి దోహదపడేలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ఓటుకు పదివేలు చొప్పున డబ్బు కూడా పంచుతున్నారని ఇంటికి లక్ష రూపాయలు చొప్పున డబ్బును అందిస్తున్నట్టు సమాచారం.

ఓటుకు నోట్లు…
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా వైసిపి ముందడుగులు వేస్తున్నారు. ఇలా భారీ స్థాయిలో డబ్బును పంచుతున్నటువంటి తరుణంలో ఓటమి లక్ష్యంగా వైసిపి ముందడుగులు వేస్తున్నారు. ఇలా భారీ స్థాయిలో డబ్బును పంచుతున్నారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. ఇక వైసిపి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వీరు ఒప్పుకున్నట్లేనని ఆయనకు భయపడే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Venu Swamy: వేణుస్వామి జాతకం చెప్పాలంటే గంటకు అన్ని వేల రూపాయలు ఇవ్వాల్సిందేనా?

Venu Swamy: వేణు స్వామి ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన గత కొంతకాలం నుంచి జ్యోతిష్యం చెబుతూ ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. ఈయన సమంత నాగచైతన్య విషయంలో చెప్పినటువంటి జాతకం ఎప్పుడైతే నిజమైందో అప్పటినుంచి వేణు స్వామి జాతకాలను నమ్మే వారి సంఖ్య ఎక్కువగా అయ్యింది.

ఇకపోతే వేణు స్వామి చెప్పే జాతకాలు ఇటీవల కాలంలో నిజం కావడం లేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ విషయంలోనూ అలాగే హీరో ప్రభాస్ సలార్ సినిమా విషయంలో ఈయన జాతకాలు తప్పవడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా విమర్శల పాలవుతున్నటువంటి వేణు స్వామి యధావిధిగాని సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.

ఇక ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈయన చేత జాతకాలు చెప్పించుకోవడమే కాకుండా జాతక పరిహారాలను కూడా చేయించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వేణు స్వామి చేత జాతకం చెప్పించుకోవాలన్న లేదంటే పూజ చేయించుకోవాలన్న భారీ మొత్తంలోనే ఆయనకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఇలా ఈయన గంటకు దాదాపు 5వేల రూపాయల వరకు డబ్బు తీసుకుంటారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

పబ్ మెయిన్ బిజినెస్..

ఇలా ఈయన చేత పూజలు చేయించుకున్న వారు గంటకు ఇంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. అయితే వేణు స్వామికి జాతకాలు చెప్పడం అనేది కేవలం సైడ్ బిజినెస్ మాత్రమే నట ఈయన అసలు బిజినెస్ పబ్ నడపడం అని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని కూడా వేణు స్వామి ఎన్నో సందర్భాలలో తెలియజేశారు తన జాతకం ప్రకారం తనకు ఈ రంగం అయితేనే కలిసి వస్తుందని అందుకే తాను అటువైపు వెళ్ళాను అంటూ వేణు స్వామి వెల్లడించారు.

Shivaji: బిగ్ బాస్ విన్నర్ కంటే నేనే ఎక్కువగా సంపాదించాను.. రెమ్యూనరేషన్ లీక్ చేసిన శివాజీ?

Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు నటుడు శివాజీ. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన తప్పకుండా టైటిల్ గెలుస్తారని అందరూ భావించారు కానీ చివరి వారాలలో ఈయన వ్యవహార శైలి కారణంగా ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయి టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు రావాల్సి వచ్చింది.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో 15 వారాలపాటు సందడి చేసిన అనంతరం శివాజీ బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ కార్యక్రమం గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే రెమ్యూనరేషన్ గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.

తాజాగా శివాజీ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ అమాయకుడని తనకి ఏమీ తెలియదని తెలిపారు. తనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వాటిని ఎలా మానిటైజ్ చేసుకోవాలో తెలియక భారీ మొత్తంలో డబ్బు నష్టపోయారని తెలిపారు. ఇక తానే తన యూట్యూబ్ ఛానల్ మానిటైజింగ్ చేశాను అంటూ శివాజీ తెలిపారు..

ప్రశాంత్ అమాయకుడు…

ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినటువంటి ప్రశాంత్ కంటే తానే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఈయన తెలిపారు. ప్రశాంత్ వారానికి లక్ష రూపాయలకు లోపే రెమ్యూనరేషన్ అందుకున్నారు ఇక ప్రైజ్ మనీతో పాటు మరో రెండు బహుమతులను పొందారు. కానీ శివాజీ మాత్రం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడంతో ఈయన వారానికి నాలుగు లక్షల రూపాయలు అందుకున్నారు. ఇలా 15 వారాలకు ఈయన సుమారు 60 లక్షల వరకు తీసుకున్నారని తెలుస్తుంది. ఎంత తీసుకున్నాను అనే విషయాన్ని శివాజీ చెప్పకపోయినా విన్నర్ కంటే తానే ఎక్కువగా తీసుకున్నాను అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Lakshmi Devi: ఇలాంటి సంకేతాలు మీకు కనబడుతున్నాయా… మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే?

Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఎన్నో రకాల పూజలు వ్రతాలు హోమాలు చేస్తూ ఉంటారు. మనం కష్టపడి సంపాదించిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంది అంటే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు కనుక మనకి ఎదురవుతూ ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నట్టే.

మన ఇంటి ఆవరణంలో కోకిల తరచూ కూస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం అయితే ఉదయం సమయంలో ఆగ్నేయ మూలలో కోయిల కూస్తూ ఉంటే అది అశుభానికి సంకేతం కానీ సంధ్య సమయంలో ఆగ్నేయ దిశగా కోయిల కూస్తూ ఉంటే మంచిది. అలాగే మామిడి చెట్టుపై కోయిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని అర్థం.

ఇకపోతే నల్ల చీమలు ఇంట్లో కనపడితే అది లక్ష్మీదేవి రాకను చూచిస్తుంది ముఖ్యంగా చీమలు బియ్యాన్ని కనుక తీసుకు వెళుతూ ఉన్నట్టయితే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అర్థం. ఇక బల్లి కూడా మనపై అనుకోకుండా పడితే అది కూడా అదృష్టమని కానీ కుడి వైపు బల్లి పడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.

నల్ల చీమలు సంపదకు సూచిక…

ఇంట్లో కనుక నల్ల చీమలకు బదులు ఎర్రటి చీమలు కనపడితే మనపై అప్పుల భారం పెరుగుతుందని అర్థం. ఇక చాలామంది ఇళ్లల్లో కొన్నిసార్లు అనుకోకుండా పాము కనబడుతూ ఉంటుంది ఇలా పాము కనబడటం వల్ల ఏదైనా దోషం ఉందా అని భావిస్తూ ఉంటారు కానీ పాము కనబడటం లక్ష్మీదేవి రాకకు సూచిక అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు కనుక కనపడితే మీ పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే.

Anchor Suma: ఇప్పటివరకు సంపాదించింది చాలా లేదా సుమక్క… డబ్బు కోసం ఇలా చేయడం అవసరమా?

Anchor Suma: సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర పై గత మూడు దశాబ్దాలుగా యాంకర్ కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమా ఈవెంట్స్ బుల్లితెర కార్యక్రమాలు అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

సుమ ఒకవైపు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె తన కుటుంబ సభ్యులను, తన టీమ్ ను కూడా చూపిస్తూ వారితో కలిసి సందడి చేస్తూ ఉంటారు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగానే డబ్బు సంపాదిస్తూ ఉంటారు.

తాజాగా సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో ఈమె ఫుడ్ పికిల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ వీడియోని చేశారు. ఇందులో తన భర్త రాజీవ్ కనకాల కూడా ఉన్నారు.అయితే సుమ ప్రమోట్ చేసే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇది వరకు చాలామంది ఉపయోగించారని పెద్దగా అవి టేస్ట్ లేవు నాసిరకం ఫుడ్ అంటూ పెద్ద ఎత్తున ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.

Anchor Suma: డబ్బు కోసం ఆరోగ్యాలతో ఆటలు అవసరమా…


ఇలా సుమా చేసిన ఈ వీడియోకి భారీగా నెగిటివ్ కామెంట్స్ రావడంతో కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ ఇప్పటివరకు యాంకర్ గా భారీగానే సంపాదించావు కదా సుమక్క డబ్బు కోసం ఇలాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి ఆరోగ్యలతో ఆడుకోవడం అవసరమా అంటూ భారీగా ఈమెపై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. సుమ ప్రమోషన్ వీడియో ద్వారా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

Samantha: డబ్బు కోసం మరీ ఇంత దిగజారావ్ ఏంటి సమంత…. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లో అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.గత కొంతకాలంగా మయోసైటిసిస్ కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ప్రస్తుతం తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో సమంత వెంట పలు కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ తిరుగుతున్నారు.

ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి సమంత తాజాగా ఈమె చేసిన పని కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఒక సెలబ్రిటీ ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు అంటే అది జనాలకు ఉపయోగకరంగా ఉండాలి కానీ ఇబ్బందులను తీసుకువచ్చేదే ఉండకూడదు. కానీ తాజాగా సమంత పెప్సీ యాడ్ చేశారు.

Samantha ఆరోగ్యానికి హానికరం…

ఇలా ఈ ప్రమోషన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్ సమంత ఈ వీడియో పై స్పందిస్తూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సంపాదించిన డబ్బు సరిపోలేదా డబ్బు కోసం తిరిగి ఇలా ఆరోగ్యానికి హానికరం చేసే వాటిని కూడా ప్రమోట్ చేయాలా అంటూ తీవ్రస్థాయిలో తనని ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే సమంత అభిమానులు మాత్రం సమంత మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Manchu Manoj: ఆరోజు డబ్బు కోసం ముందడుగు వేసి ఉంటే నేను బ్రతికి వేస్ట్… మనోజ్ షాకింగ్ కామెంట్స్!

Manchu Manoj: మంచు మనోజ్ మౌనిక రెడ్డి దంపతులు ఇటీవల వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలాకాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు తాజాగా కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఇది వీరిద్దరికీ రెండవ పెళ్లి కావడంతో ఇద్దరూ కూడా కొంతకాలం ఎన్నో కష్టాలు అనుభవించినట్లు ఇటీవల మనోజ్ వెల్లడించాడు.

తాజాగా వివాహం తర్వాత మనోజ్ మౌనిక రెడ్డి జంటగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” అలా మొదలైంది ” షో లో సందడి చేశారు. ఈ షోలో వారి ప్రేమను గెలిపించుకోవడానికి పడిన కష్టాల గురించి మనోజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో మనోజ్ మాట్లాడుతూ..” మౌనిక కష్టాలు చూస్తే నా కష్టాలు చాలా చిన్నవనపించింది. అయితే మొదట నా ప్రేమను తెలిపినప్పుడు మౌనిక కుటుంబం గురించి సమాజం గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అని నన్ను ప్రశ్నించింది.

అంతా నేను చూసుకుంటానని చెప్పటంతో మౌనిక నన్ను నమ్మి ఓకే చెప్పిందని మనోజ్ తెలిపాడు. ఈ క్రమంలో చాలా కాలం క్రితం మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే చిత్రం గురించి వెన్నెల కిషోర్ ప్రశ్నించగా… మౌనిక కోసమే ఆ చిత్రాన్ని వదిలేసానని మనోజ్ అసలు విషయం రివీల్ చేశాడు. అహం బ్రహ్మాస్మి కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాం. అదే సమయంలో మౌనికతో నా బంధం ఏర్పడింది. మౌనిక నన్ను నమ్ముకుని బిడ్డతో వచ్చింది.

Manchu Manoj: చెన్నై వెళ్లిపోయాం…

ఆ సమయంలో నేను కెరీర్ కోసం, డబ్బు కోసం ఆశ పడి ఉంటే నేను బ్రతకడమే వేస్ట్. అందుకే సినిమానా.. మౌనికా అని అనుకున్నప్పుడు నేను మౌనికని ఎంపిక చేసుకొని సినిమా వదిలేసా. అయితే ఆ సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ని క్షమించమని కోరా. ఆ తర్వాత
ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెన్నై వెళ్లి ఏడాదిన్నర పాటు అక్కడే ఉన్నాం అంటూ మనోజ్ వెల్లడించాడు. ఎన్నో ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న వీరు ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహబంధంలోకి అడుగు పెట్టారు.

Umair Sandhu: డబ్బు కోసం ఆమె ఏం చేయడానికి అయినా సిద్ధమే… నటిపై ఉమైర్ సందు షాకింగ్ కామెంట్స్!

Umair Sandhu: తరచూ సినీ సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ నటుడు క్రిటిక్ ఉమైర్ సందు .ఇదివరకు ఈయన ఎంతో మంది సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసినటువంటి ట్వీట్స్ కారణంగా ఈయన పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొందరు సెలబ్రిటీలు ఈయనపై ఫిర్యాదులు కూడా చేశారు.

ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఈయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఈయన మాత్రం తన ధోరణి మార్చుకోలేదు ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఈయన తాజాగా నాగిని ఫేమ్ మౌని రాయ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. పలు బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

పాజిటివ్ రోల్ అయినా నెగిటివ్ రోల్ అయినా ఇట్టే ఇమిడిపోయి నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి మౌనీ రాయ్ గత కొద్ది రోజుల క్రితం
గతేడాది సూరజ్ నంబియార్ ను మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా ఉమైర్ సందు మౌని రాయ్ గురించి కామెంట్స్ చేస్తూ ఈమె దర్శక నిర్మాతలతో సంబంధాలు పెట్టుకున్నారని డబ్బు కోసం ఈమె ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుందంటూ ఈయన కామెంట్ చేశారు.

Umair Sandhu: దర్శక నిర్మాతలతో సంబంధాలు ఉన్నాయి…


ఇలా తను డబ్బు కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే అంటూ ఈయన చేసినటువంటి కామెంట్ల పై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.లైక్స్, వ్యూస్ కోసం ఉమైర్ సంధు దిగజారుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి తన గురించి ఇలాంటి కామెంట్స్ చేసిన ఈయనపై నటి మౌని రాయ్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Ramya Raghupathi: కొడుకు మెయింటెనెన్స్ కోసం నరేష్ డబ్బులు పంపిస్తున్నారు… రమ్య కామెంట్స్ వైరల్!

Ramya Raghupathi: సినీ నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఈయన మూడో భార్య రమ్య రఘుపతి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పటికే నరేష్ గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన రమ్య తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొని తనుకు నరేష్ ఇచ్చే భరణం అవసరం లేదని తెలిపారు.

నరేష్ నుతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అయితే ఈయన మాత్రం ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తనని దూరం పెట్టారని తెలిపారు. అయితే నరేష్ కువిడాకులు ఇవ్వకూడదని తన కుమారుడు తనతో ఒట్టు వేయించుకున్నాడని అందుకే తాను నరేష్ కు విడాకులు ఇవ్వాలనుకోవడం లేదంటూ ఈమె తెలియజేశారు.

నేను నరేష్ కు విడాకులు ఇవ్వడం కోసం ఆయన మూడు కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల వరకు నాకు భరణం ఆఫర్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు నేను ఆయన భార్యగా ఉండాలి నా కొడుకుకు తను తండ్రిగా ఉండాలని, అందుకే తాను విడాకులు ఇవ్వడం లేదు అంటూ రమ్య తెలిపారు.

Ramya Raghupathi: ఆయన ఆస్తి డబ్బు నాకు అవసరం లేదు…

ఇక నరేష్ నా కుమారుడి మెయింటెన్ కోసం డబ్బులు పంపిస్తున్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి మాత్రమే నెలకు 50000 చొప్పున పంపించేవారని ప్రస్తుతం 70000 పంపిస్తున్నారని ఈ సందర్భంగా రమ్య తెలిపారు.నేను నరేష్ ఆస్తులపై ఆయన డబ్బుపై ఏమాత్రం ఆశపడలేదు. ఆయన నా కుమారుడికి తండ్రిగా ఉండాలని ఆయనకు నేను భార్యగా ఉండాలని మాత్రమే ఆశపడుతున్నాను. అందుకే ఆయనకు నేను విడాకులు ఇవ్వదలుచుకోలేదు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.