Tag Archives: nagarjuna

Bangarraju-Nagarjuna: బంగార్రాజు సీక్వెల్ రెడీ.. ! హింట్ ఇచ్చేసిన నాగార్జున..!

Bangarraju-Nagarjuna: కరోనా ఎఫెక్ట్ వల్ల అనుకోవాలో లేదా.. పెద్ద సినిమాలు విడుదలను వాయిదా వేసుకోవడం వల్ల అనుకోవాలో తెలియదు కానీ.. నాగార్జునకు ఈ సంవత్సరం కలిసి వచ్చిందనే చెప్పాలి. సంక్రాంతి విడుదలకు పెద్ద సినిమాలు విడుదల కాకపోవడవతో కెలక్షన్లతో దూసుకుపోతోంది బంగార్రాజు సినిమా.

Bangarraju-Nagarjuna: బంగార్రాజు సీక్వెల్ రెడీ.. ! హింట్ ఇచ్చేసిన నాగార్జున..!

మొత్తంగా రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్ . పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలను గ్రామీణ ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. అంతే కాదు.. ఒకే ఫ్రేమ్ లో తండ్రీ కొడుకులు కనిపించడం అటు నాగ్ అభిమానులతో పాటు.. ప్రేక్షకులకు కూడా కనులపండగుగా ఉంది.

Bangarraju-Nagarjuna: బంగార్రాజు సీక్వెల్ రెడీ.. ! హింట్ ఇచ్చేసిన నాగార్జున..!

‘మనం’ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఈ వారసులు.. మళ్లీ ఈ సినిమాలో కనిపించారు. ఒకవేళ నాగేశ్వరరావు బతికి ఉన్నట్లైతే.. నాగచైతన్య నాన్నగా నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చేవారు. అప్పుడు ఇక మరో మనం సినిమాను మళ్లీ చూసినట్లు అయి ఉండేది. ఏదేమైనా.. హిట్ కోసం కొన్ని సంవత్సారాల నుంచి ఎదురు చూస్తున్న నాగార్జునకు ఆ దాహం తీరినట్లే కనిపిస్తోంది.


వచ్చే ఛాన్స్ ఉన్నాయని ఓ హింట్ ఇచ్చాడు.. అదేంటంటే..

ఇక సినిమా టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వాననికి సపోర్టుగా ఉన్నాడు కాబట్టే.. ఏపీలో మూడు రోజులు నైట్ కర్ఫ్యూని వాయిదా వేశారని.. కావాలనే జగన్ ప్రభుత్వం నాగార్జునకు ఫేవర్ చేశారనేది కొందరు సినీ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సినిమా విజయవంతం అవ్వడంతో నాగార్జున విలేకరులతో మాట్లాడారు. ఇక బంగార్రాజు సినిమాకు కూడా సీక్వెల్ వస్తుందా అని అడగ్గా.. వచ్చే ఛాన్స్ ఉన్నాయని ఓ హింట్ ఇచ్చాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. బంగార్రాజు అక్కడే మొదలయ్యింది. అయితే చివరలో శివాలయంలో 24 ఏళ్లకు ఓ సారి హోమం చేయాలి. అది కూడా నాగార్జున ఫ్యామిలీ మాత్రమే చేయాలి. దానిని బంగార్రాజు చిత్రంలో ఒక హోమం పూర్తి చేశారు. మరో హోమం బేస్ చేసుకొని.. మరో సారి సీక్వెల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే.. అప్పుడు చూద్దాం అని నాగార్జున చెప్పడంతో.. బంగార్రాజు సీక్వెల్ పక్కాగా వస్తుందనేది కొందరు అభిప్రాయపడుతున్నారు.

Nagarjuna: సమంత నాగచైతన్య విడాకులపై స్పందించిన నాగార్జున.. ఎంతో బాధాకరం అంటూ!

Nagarjuna: అక్కినేని నాగ చైతన్య, సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు వీరికి అధికారికంగా విడాకులు వెలువడలేదు.

Nagarjuna: సమంత నాగచైతన్య విడాకులపై స్పందించిన నాగార్జున.. ఎంతో బాధాకరం అంటూ!

వీరు విడాకులు తీసుకొని సుమారు నాలుగు నెలలు కావస్తున్న తరుణంలో మొదటిసారిగా నాగార్జున వీరి విడాకులపై స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నాగార్జున వీరిద్దరి విడాకుల ప్రస్తావన గురించి మాట్లాడారు.

Nagarjuna: సమంత నాగచైతన్య విడాకులపై స్పందించిన నాగార్జున.. ఎంతో బాధాకరం అంటూ!

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. వారిద్దరి విడాకులు తీసుకోవడం ఎంతో బాధాకరమని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఏ వ్యక్తికైనా ఎంతో కష్టమని కానీ నాగచైతన్య మాత్రం ఈ విషయంలో ఎంతో హుందాగా ప్రవర్తించారని నాగార్జున తెలిపారు.

తనే నాకు ధైర్యం చెప్పారు..

ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి చైతన్య ఎలా గట్టేక్కిస్తాడా అని ఎంతో కంగారుపడ్డాను అయితే చైతన్య ఎంతో పరిపక్వత చెందాడని, తనకు పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే ధైర్యం ఉందని తాను ధైర్యంగా ఉంటూ నాకే ఎంతో ధైర్యం చెప్పాడని నాగార్జున తెలియజేశారు. నాగ చైతన్య ఇంత తొందరగా ఈ సంఘటన నుంచి బయటపడి ఇలా సంతోషంగా ఉండడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

Bangarraju: నాగార్జున బంగార్రాజు చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అక్కినేని మల్టీస్టారర్ సంక్రాంతి హిట్‌ని సాధించడానికి గ్రౌండ్ రిలీజ్ కాబోతోంది. పండుగకు పెద్దగా విడుదలయ్యే ఇతర చిత్రాలేవీ లేవు. దీంతో దీనిపై విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల లేకపోవడంతో బంగార్రాజుకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ , ఆక్యుపెన్సీ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

ఈ విషయంపై మంత్రి పేర్ని నాని కూడా సంక్రాంతి సినిమాలను విడుదల తేదీలను వాయిదా వేయమని కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. సినిమాలను వాయిదా వేయమని సూచించిన ప్రభుత్వం ఇప్పుడు రాత్రి కర్ఫ్యూ , ఆక్యుపెన్సీ పరిమితుల ప్రణాళికలను కూడా వాయిదా వేసింది. జనవరి 18 నుంచి కర్ఫ్యూ అంటూ పేర్కొంది ప్రభుత్వం.


ఇప్పుడు అది అతనికి ఈ మార్గంలో..

దీనిని బట్టి చూస్తే.. ఏపీ ప్రభుత్వం నాగార్జునకు ఫేవర్ గా ఉంటుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
సినీ పరిశ్రమను కలవరపెడుతున్న ఏపీ టిక్కెట్ల సమస్యపై నాగార్జున సినీ పరిశ్రమ వైపు నిలవకుండా.. ఏపీ ప్రభుత్వం వైపు మాట్లాడారు. అంతే కాదు.. టికెట్స్ ను తగ్గించడం కరెక్ట్ అని.. తన సినిమాకు ఏ మాత్రం ప్రాబ్లం లేదు అంటూ.. ఏపీ ప్రభుత్వానికి మద్ధతుగా మాట్లాడారు. అందుకే అతనికి ఈ సహాయాలు లభించాయని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. నాగార్జున ఏపీ ప్రభుత్వంతో చాలా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అది అతనికి ఈ మార్గంలో సహాయపడింది. ఇక అంతకముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా సందర్భంలో కూడా.. 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చు అని ఏపి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక ఇవన్నీ చూస్తుంటే.. నాగార్జునకు ఏపీ ప్రభుత్వం ఫేవర్ చేస్తుందంటూ.. సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Samantha-Nagarjuna: నాగార్జునపై సమంత సంచలన వ్యాఖ్యలు..! నాగార్జున భార్య ఇలా అంటూ..!

Samantha-Nagarjuna: నాగచైతన్యతో విడాకుల తరువాత జోరు పెంచింది సమంత. వరసగా సినిమాలకు కమిట్ అవుతోంది. కొన్నాళ్లు విడాకులతో డిప్రెషన్ లో ఉన్న సమంత మళ్లీ యాక్టివ్ అయింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది.

Samantha-Nagarjuna: నాగార్జునపై సమంత సంచలన వ్యాఖ్యలు..! నాగార్జున భార్య ఇలా అంటూ..!

తనపై ట్రోల్స్, కామెంట్లు చేసేవారికి గట్టిగానే సమాధానం ఇస్తోంది సమంత.  తాజాగా పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది సమంత. ‘ ఊ అంటావా మావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.

Samantha-Nagarjuna: నాగార్జునపై సమంత సంచలన వ్యాఖ్యలు..! నాగార్జున భార్య ఇలా అంటూ..!

పరోక్షంగా పుష్ప సినిమా హిట్ అయ్యేందుకు సహకరిచంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్, సమంత అందం, బన్నీ ఊర మాస్ స్టెప్పులు ఇలా అన్ని కలిసి రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది ఈసాంగ్. యూబ్యూబ్ లో ట్రెండింగ్ నిలిచింది.


మీడియాలో మాత్రం చాలా వైరల్..

ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో ఓ విషయం మాత్రం బాగా ట్రెండింగ్ అవుతోంది. ఇటీవల నాగార్జున  సమంతకు ఫోన్ చేశాడట. అయితే ఫోన్ చూసి మాట్లాడకుండా పక్కన పెట్టేసిందట సమంత. ఆ సమయంలో సమంత పక్కన ఉన్న టాలీవుడ్ హీరోతో.. నాగార్జునకు అంత సీన్ లేదు.. భార్య మాటే వింటాడు… ఆయనతో మాట్లాడి వేస్ట్ అంటూ కామెంట్ చేసిందట. అయితే ఇది నిజయో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో బంగార్రాజు సంక్రాంతి కానుకగా వస్తోంది. ఇందులో బేబమ్మ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Akkineni Nagarjuna: ‘‘ఈ రోజు నాతో పడుకుంటావా’’..! నాగార్జున వ్యాఖ్యలు వైరల్..!

Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరావు ఫ్యామిలీ నుంచి మూడు తరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. నాగేశ్వరావు తర్వాత నాగార్జున… తర్వాత అతని కొడుకులు నాగచైతన్య, అక్కినేని అఖిల్ కొనసాగుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై.. తర్వాత సినిమాలకు ఆశలు రేపారు అక్కినేని బ్రదర్స్.

Akkineni Nagarjuna: ‘‘ఈ రోజు నాతో పడుకుంటావా’’..! నాగార్జున వ్యాఖ్యలు వైరల్..!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్ అందుకున్న అఖిల్.. మరో ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నాడు. లవ్ స్టోరీ సినిమాతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగాడు అక్కినేని నాగ చైతన్య. ఇక తండ్రీ కొడుకులు కలసి నటించిన మరో సినిమా బంగార్రాజు.

Akkineni Nagarjuna: ‘‘ఈ రోజు నాతో పడుకుంటావా’’..! నాగార్జున వ్యాఖ్యలు వైరల్..!

ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 14న విడుదల ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చేటట్లుగా కమర్షియల్ హంగులతో ఉన్నట్లుంది ఈ మూవీ. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.


ఇంగ్లీష్ లోకి అనువదించినప్పుడు బూతు పదాలు..

ఇక ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రతీ సాంగ్ బంపర్ హిట్ కొట్టాయి. ఇక ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో కనిపించనుండగా.. కృతి శెట్టి నాగచైతన్య పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలో నాగార్జున ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. కొన్ని సినిమాల్లో మహిళలను వెంటపడి వేధించడాన్ని రొమాన్స్ గా చూపిస్తుంటారు కదా.. దానిపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. అందంతా ట్రాన్స్ లేషన్ మిస్టేక్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తెలుగులో ఓ అమ్మాయిని అందంగా వర్ణిస్తూ రాసిన పాట లిరిక్స్ ను.. ఇంగ్లీష్ లోకి అనువదించినప్పుడు బూతు పదాలు వస్తాయన్నారు. దానికి ఉదాహరణగా చెబుతూ.. బాంగార్రాజు సినిమాలోని ఓ సాంగ్ లిరిక్స్ ను అనువాదిస్తే.. ఈ రోజు నాతో పడుకుంటావా అనే మీనింగ్ వస్తుందని.. అనువాదంలో ఇలా దారుణమైన అర్థాలు వస్తాయని నాగార్జున సమాధానం చెప్పారు.

Nagarjuna: బంగార్రాజులో ఎనిమిది మంది హీరోయిన్లు..ఆ లిస్ట్ లో ఉన్నది ఎవరంటే..!

Nagarjuna: అక్కినేని నాగార్జున, నాగచైతన్య క్రేజీ కాంబినేషన్ లో ఉన్న ‘బంగార్రాజు’ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి’, ‘జీ స్టూడియోస్’ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Nagarjuna: బంగార్రాజులో ఎనిమిది మంది హీరోయిన్లు..ఆ లిస్ట్ లో ఉన్నది ఎవరంటే..!

హీరోయిన్ కృతి శెట్టి అందం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇదిలా  ఉంటే అనూప్ రూబెన్స్ అందిచిన మ్యూజిక్ ఇప్పటికే హిట్ అయింది.  ఇదిలా ఉంటే గతంలో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా వస్తోంది. ఆరేళ్ల క్రితం సంక్రాంతి బరిలో దిగిన ఆసినిమా భారీ విజయం సాధించింది.

Nagarjuna: బంగార్రాజులో ఎనిమిది మంది హీరోయిన్లు..ఆ లిస్ట్ లో ఉన్నది ఎవరంటే..!

2016లో విడుదలైన ఈసినిమా నాగ్ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచింది. అయితే ఆ రేంజ్ హిట్ నాగార్జునకు పడలేదు. పలు సినిమాలు చేసినా.. బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దీంతో ఈసినిమా నాగార్జునకు చాలా ఇంపార్టెంట్ గా మారింది. 


స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనగకలుగా ..

అయితే సినిమా విడుదలకు డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సినిమా యూనిట్. అయితే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. బంగార్రాజు సినిమాలో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు.. 8 మంది హీరోయిన్లు నటించారనే విషయాన్ని వెల్లడించారు. వాళ్లెవరని ప్రశ్నిస్తే…రమ్య కృష్ణ, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా, మీనాక్షి దీక్షిత్,దర్శిని, వేదిక,దక్ష నగార్కర్,సిమ్రత్ కౌర్ అంటూ జవాబిచ్చాడు. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనగకలుగా కొంతమంది సందర్భానుసారం కనిపిస్తారని వెల్లడించారు. ఇంత మంది హీరోయిన్లు నటిస్తుండటంతో… సినిమా ఓ పండగలా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు.

Nagarjuna: ఆ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పిన నాగార్జున.. అసలేం జరిగిందంటే?

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా మ్యూజిక్ నైట్స్ అనే కార్యక్రమాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Nagarjuna: ఆ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పిన నాగార్జున.. అసలేం జరిగిందంటే?

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాను మించి బంగార్రాజు చిత్రం ఉండబోతోందని తెలిపారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదే రోజున అన్నపూర్ణ స్టూడియో కూడా పుట్టిందని నాగార్జున గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ఎంతో అద్భుతమైన సంగీతం అందించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పారు.అసలు నాగార్జున అభిమానులకు ఎందుకు క్షమాపణలు చెప్పారు అనే విషయానికి వస్తే…

కరోనా కారణం వల్ల ఆ కండిషన్ తప్పలేదు…

జనవరి 14వ తేదీ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ వేడుకను ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు.అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకకు అభిమానులను ఎవరిని పిలవడం లేదని అందుకు ప్రతి ఒక్క అభిమానికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు నాగార్జున ఈ వేదికపై తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Bangarraju: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు..కానీ మరో బ్యాడ్ న్యూస్ ఎంటంటే..!

Bangarraju: అటు బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్ గా ఉటూ.. ఇటు సోగ్గాడే చిన్ని నాయనకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమాలో నటించాడు. ఇందులో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.

Bangarraju: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు..కానీ మరో బ్యాడ్ న్యూస్ ఎంటంటే..!

ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా.. జనవరి 14న థియేట్రికల్‌గా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటంతో సంక్రాతి బరిలో నిలిచే సినిమాలకు బాగా కలిసిరానుంది. అందులో ఈ సినిమా కూడా కావడం విశేషం.

Bangarraju: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు..కానీ మరో బ్యాడ్ న్యూస్ ఎంటంటే..!

ఇదంతా ఇలా ఉంటే.. ఈ బంగార్రాజు సినిమా ఫైనల్ కాపీ ఇంకా సిద్ధం కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇది అభిమానులను కాస్త నిరాశే అని చెప్పాలి. దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా సాగుతున్నాయి. నాగార్జున కూడా అదే పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కంటెంట్ పై బంగార్రాజు పూర్తి నమ్మకంగా ఉన్నట్లు సమాచారం.


రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.25కోట్లు ..

తన యాజమాన్యంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీఎఫ్‌ఎక్స్, సౌండ్ మిక్సింగ్ పనులను వ్యక్తిగతంగా నాగార్జున పర్యవేక్షిస్తున్నాడు. నాగార్జున దగ్గర నుంచి డైరెక్ట్ ఆర్డర్‌లతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లోని టెక్నీషియన్లు కూడా బంగార్రాజుపై పూర్తిగా దృష్టి పెట్టారు. మూవీ చిత్ర యూనిట్ అంతా.. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బంగార్రాజు ఇప్పటి వరకు నాగార్జున కెరీర్‌లో అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.25కోట్లు దాటినట్లు తెలుస్తోంది. కేవలం ఏపీలోని సీడెడ్ ప్రాంతంలోనే రూ.12 కోట్ల రేషియో వచ్చినట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం 2016లో వచ్చిన సాగ్గాడే చిన్నినాయనకు ప్రీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఇక దీనికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని వహిస్తుండగా.. విడుదలైన అన్నీ పాటలు బంబర్ హిట్ కొట్టాయి.

Nagarjuna: ‘సినిమా టికెట్ల రెట్లు తగ్గినా ఇబ్బంది లేదు’ నాగార్జున షాకింగ్ కామెంట్స్!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున రమ్యకృష్ణ నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్ చిత్రంగా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

జనవరి 14వ తేదీ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల వాయిదా పడటంతో బంగార్రాజు చిత్రాన్ని విడుదల చేయడం కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తడంతో ఈ సినిమా విడుదల పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చారు.

Nagaarjuna: సినిమా టికెట్ల విషయంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన నాగార్జున ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదలవుతుందని తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల రేట్లు దారుణంగా తగ్గిపోయాయి.ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేస్తే నష్టం వస్తుందని చాలా మంది ఈ సమస్యపై పోరాడుతున్నారు. ఈ విషయంపై కూడా నాగార్జున స్పందించారు.

Nagarjuna : టికెట్ల రేట్లు పెంచితే చాలా మంచిది..

ప్రస్తుతం ఏపీలో టికెట్లు రేట్లు తగ్గించడం వల్ల తన సినిమాకు ఏ విధమైనటువంటి ఇష్టం లేదని నాగార్జున తన అభిప్రాయం వ్యక్తం చేశారు. టికెట్లరేట్లు తగ్గించడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే టికెట్లు రేట్లు పెంచితే మరింత లాభం వస్తుందని నాగార్జున టికెట్ల విషయం పై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. నాగార్జున ఈ అభిప్రాయం చూస్తుంటే తప్పకుండా ఈ సినిమాని జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య నాగార్జున నటించగా రమ్యకృష్ణ కృతి శెట్టి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.

Bigg Boss: బాలకృష్ణ బిగ్ బాస్ హోస్టింగ్ పై స్పందించిన నాగార్జున..! క్లారిటీ ఇచ్చేశాడుగా..!

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. ఇప్పుడందరిలో సీజన్ 6పై చర్చ ప్రారంభమైంది. అయితే వచ్చే సీజన్ ఓటీటీలో ప్రసారం అవుతుందా.. లేకపోతే స్టార్ మాలోనే ప్రసారం అవుతుందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో పాటు సీజన్ 6కు హెస్ట్ గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారనే వాదన కూడా నడుస్తోంది. ఇప్పటికే ఆహాలో ’’అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే‘‘ టాక్ షోలో హోస్ట్ గా దుమ్ము రేపుతున్నారు బాలయ్య.

Bigg Boss: బాలకృష్ణ బిగ్ బాస్ హోస్టింగ్ పై స్పందించిన నాగార్జున..! క్లారిటీ ఇచ్చేశాడుగా..!

అయితే వీటన్నింటికి సమాధానాలు ఇచ్చారు కింగ్ నాగార్జున. బిగ్ బాస్ 5 ముగియడంతో మరో రెండు రోజుల్లోనే బిగ్ బాస్ 6 కూడా ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అయితే దీనికి సంబంధించి కంటెస్టెంట్లు ఎవరో అని తెలియదు. శుక్రవారం ’పరంపర‘ వెబ్ సిరీస్ విడుదల అవుతున్న సందర్భంలో హాట్ స్టార్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

Bigg Boss: బాలకృష్ణ బిగ్ బాస్ హోస్టింగ్ పై స్పందించిన నాగార్జున..! క్లారిటీ ఇచ్చేశాడుగా..!

అయితే టీవీలో వచ్చే బిగ్ బాస్ కు ఓటీటీలో వచ్చే బిగ్ బాస్ కు తేడా ఉంటుందని ఆయన అన్నారు. దీనిని కొత్తగా ప్రోగ్రామింగ్ చేస్తున్నామని.. ఇందులో ఉండే సెలబ్రెటీలు ఎవరో తెలియదని నాగార్జున అన్నారు. ఓ పక్క సినిమాలు.. మరో పక్క బిగ్ బాస్ షో ఒత్తడి అనిపించదా.. అనే ప్రశ్నకు సమాధానంగా .. నాకు ఒత్తడి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా వర్క్ చేస్తానని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ నాకు ఫ్యామిలీగా అనిపిస్తుందని కామెంట్ చేశారు.

బిగ్ బాస్ రెండు ఛానళ్లలో..

బిగ్ బాస్ ను ప్రేక్షకులే కాదు..నేను మిస్ అవుతున్నానని చెప్పారు. మీరు చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ కు తేడా లేమిటి అని  అడగ్గా.. మీలో ఎవరు కోటీశ్వరుడు నాలెడ్జ్ షో అని… బిగ్ బాస్ దీనికి పూర్తిగా విభిన్నంగా ఉంటుందని.. ఇక్కడ వ్యక్తులపై నాలెడ్జ్ వస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్నకు కూడా నాగార్జున సమాధానం ఇచ్చారు.


బిగ్ బాస్ 6 లో మీరు హోస్ట్ గా వ్యవహరించరని వార్తలు వస్తున్నాయి… వేరే వాళ్లు హోస్ట్ గా చేస్తున్నట్లు తెలిసింది అన్న ప్రశ్నకు నాగార్జున క్లారిటీ ఇచ్చారు. వచ్చే బిగ్ బాస్ 6 సీజన్ కు కూడా నేనే హోస్ట్ గా ఉంటానని స్పష్టం చేశాడు. దీంతో బాలయ్య హోస్ట్ గా చేస్తున్నారనే పుకార్లకు తెర పడినట్లు అయింది. 
ప్రస్తుతం వస్తున్న బిగ్ బాస్ 6.. హాట్ స్టార్ లో వేరేలా.. స్టార్ మాలో వేరేలా ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు.