Tag Archives: ott

100 Days Movie: సినిమా ఆడకపోయిన శత దినోత్సవ ఉత్సవాలు… ఏమిటో ఈ విడ్డూరం?

100 Days Movie: ఒకానొక సమయంలో హీరోలు నటించిన సినిమాలు థియేటర్లో విడుదలయితే 100 రోజులు 200 రోజులు సినిమాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అప్పట్లో సినిమాలను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించేవారు.అప్పట్లో కూడా కొన్ని సినిమాలు 100 రోజులు ఆడకపోయినా థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి వంద రోజులు సినిమాని ఆడే విధంగా చేసేవారు.

ఇలా అప్పట్లో సినిమాలు నిజాయితీగా వంద రోజులు ఆడిన చిత్రాలకు ఆడించిన చిత్రాలని రెండు విభాగాలుగా విభజించి చూసేవారు.అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే విషయం కాకుండా ఎంత కలెక్షన్లు రాబట్టింది అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఒక సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది అంటే ఆ సినిమా హిట్ అని అర్థం.

అయితే ప్రస్తుత కాలంలో వంద రోజులు ఆడే సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. సినిమా విడుదలైన 40 రోజులలోనే ఆ సినిమా ఓటీటీలో ప్రసారమవుతుంది తద్వారా థియేటర్లకు వెళ్లి చూసే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇలాంటి తరుణంలో కొన్ని ప్రాంతాలలో థియేటర్ యాజమాన్యులకు డబ్బులు ఇచ్చి మరి 100 రోజుల పోస్టర్లు వేయిస్తున్నారు.

100 Days Movie: షోలు పడకపోయినా శత దినోత్సవమా…

ఇలా తమ హీరో సినిమా ఫలానా థియేటర్లో వంద రోజులు పూర్తి చేసుకుందని చెప్పడం కోసమే ఇలా థియేటర్ యజమానులకు డబ్బులు చెల్లించి మరి బయట వంద రోజుల పోస్టర్లు వేయిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలు ఆడకపోయినా 100 రోజుల పోస్టర్లు వేసి శత దినోత్సవ సెలబ్రేషన్స్ చేసుకోవడం విడ్డూరంగా మారిపోయింది.ఈ క్రమంలోనే ఈ విషయంపై పలువురు స్పందిస్తూ… షోలు పడకపోయినా శత దినోత్సవమా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Salman Khan: ఓటీటీలకు కూడా సెన్సార్‌ ఉండాలి…. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

Salman Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ తన పూర్తి సమయాన్ని కేవలం సినిమాలకు మాత్రమే కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం ” కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ” అనే సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓటీటీ ల గురించి సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఇంట్లో ఉన్న ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నాయి. కరోనా సమయం నుండి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి.
థియేటర్ లకు వచ్చిన కొన్నిరోజులకే ఓటీటీల్లో సినిమాలు వస్తుండటంతో.. ప్రేక్షకుల కూడా థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యే కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ లేకపోవడం సమస్యగా మారింది.

ఇప్పటికే ఎంతోమంది ఓటీటీలకు సెన్సార్ తప్పనిసరిగా ఉండాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీ కంటెంట్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్ విషయంలో ఓటీటికి సెన్సార్ ఉండాలి అన్నారు. ప్రస్తుతం ఓటీటీల్లో వచ్చే కంటెంట్ లో వల్గారిటీ చాలా ఎక్కువగా ఉంటోంది. హింస, మితిమీరిన శృంగారం డిజిటల్ కంటెంట్ లో ఎక్కువైపోతుంది.

Salman Khan:ఓటీటీ పై సెన్సార్ దృష్టి పెట్టాలి…

ఇలా ఉండటం వల్ల పిల్లలు చెడుదారులు పడుతన్నారంటూ తల్లి తండ్రులు కూడా ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీ కంటెంట్‌పై తప్పకుండా సెన్సార్‌షిప్‌ ఉండాలని, అప్పుడే శృంగార, అశ్లీల, హింసాత్మక దృశ్యాల్ని అడ్డుకోగలం అన్నారు. ప్రస్తుతం చాలా మంది దర్శకనిర్మాతలు క్లీన్‌ కంటెంట్‌ మీదనే దృష్టి పెడుతున్నారని, అలాంటి కథలే ఎక్కువ మందికి చేరువవుతున్నాయని సల్మాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డారు.

Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు సక్సెస్ కాకపోవడానికి ఇవే ప్రధాన కారణాల?

Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రేవంత్ ట్రోఫీ గెలుచుకొని విజేతగా నిలబడటం శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు.ఇకపోతే ఈ కార్యక్రమం గత సీజన్లతో పోలిస్తే పెద్దగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ సాధించలేక పోయిందని తెలుస్తుంది.నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం సక్సెస్ కాకపోవడానికి ఇవే ప్రధాన కారణాలనీ తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ ఈ కార్యక్రమం పై తీవ్రమైన ప్రభావం చూపించడంతో ఈ షో ప్రారంభం రేటింగ్ కూడా దారుణంగా ఉందని చెప్పాలి.ఇక షో నిర్వాహకులు ప్రారంభంలో ఎంతో వినోదభరితమైన టాస్కులను ఇచ్చినప్పటికీ చివరి వరకు అలాగే కొనసాగింపలేకపోయారు.

ఇక ఈ సీజన్లో పెద్దగా కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి లవ్ ట్రాక్స్ క్రియేట్ చేయకపోవడంతో ఈ షో అనుకున్న స్థాయిలో రేటింగ్ కైవశం చేసుకోలేకపోయింది. అదేవిధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయినటువంటి బాలాదిత్య, గీతు, ఇనయ,వంటి కంటెస్టెంట్లను బయటకు పంపించడం కూడా ఈ కార్యక్రమానికి మైనస్ పాయింట్ అయింది.

Bigg Boss6: అన్ని విషయాలు లీక్ కావడం కూడా మైనస్ పాయింట్…

ఇక ఈ కార్యక్రమాన్ని టీవీలో మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా ప్రసారం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్క సంఘటన కూడా సోషల్ మీడియాలో లీక్ అవడంతో పెద్దగా ఈ కార్యక్రమం పై ఎవరు కూడా ఆసక్తి చూపలేదు తద్వారా గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పాలి.

Actor Naresh: సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లు ఖాళీ.. నరేష్ కామెంట్స్ వైరల్!

Actor Naresh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా చాలా నష్టపోయింది. కరోనా కారణంగా సినిమా నిర్మాణ పనులు ఆగిపోయి నటీనటులందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా ప్రేక్షకులు బయటకి వచ్చి థియేటర్లలో సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు.

థియేటర్లు మూతపడటంతో ఓటీటీ లకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటిటిలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి నెలలు గడుస్తున్నా కూడా చాలామంది ప్రేక్షకులు ఓటీటీ లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగటమే. బాగా డబ్బున్న వారికి ఈ టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా చూడాలంటే మినిమం 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు.

ఇటీవల ఈ విషయంపై నటుడు వి కె నరేష్ స్పందించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో ఉన్న రిలేషన్ వల్ల వివాదంలో నిలిచిన నరేష్ చాలాకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. ఇటీవల నరేష్ ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రజలు థియేటర్లలో సినిమా చూడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నరేష్ స్పందిస్తూ…సినిమా కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకి వచ్చి సినిమాలు చూస్తారు. ఇటీవల విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయని వెల్లడించాడు.

Actor Naresh: పాప్ కార్న్ పెప్సీ రేట్లు పెరగడం కూడా..

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడకపోవటానికి టికెట్ రేట్లు పెరగటం ముఖ్య కారణం కావచ్చు .కానీ అదొక్కటే కారణం కాదు. సినిమా టికెట్ రేట్లతో పాటు సినిమా థియేటర్లలో అమ్ముతున్న పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు రూ.20, రూ.30 లకు దొరికే పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధర ఇప్పుడు రూ.200, రూ.300 అయ్యింది. అందువల్ల ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు రావటానికి ఆసక్తి చూపరు. వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారు. అని నరేశ్‌ ట్వీట్‌ చేశాడు.

Shahid Kapoor: ఆ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యకండి.. కావాలంటే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. యంగ్ హీరో?

Shahid Kapoor: ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పలు ఆంక్షలు విధించడం వల్ల థియేటర్లు మూత పడ్డాయి. ఈ క్రమంలోనే విడుదల కావాల్సిన సినిమాలన్నీ మరోసారి వాయిదా వేసుకున్నాయి. ఇలా వాయిదా వేసుకున్న చిత్రాలలో జెర్సీ హిందీ రీమేక్ చిత్రం కూడా ఒకటి. అన్ని పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Shahid Kapoor: ఆ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యకండి.. కావాలంటే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. యంగ్ హీరో?

అయితే కరోనా ఆంక్షల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఈ సినీ నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో షాహిద్ కపూర్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా రికార్డులను సృష్టిస్తుందని నమ్మడం వల్ల ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు.

Shahid Kapoor: ఆ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యకండి.. కావాలంటే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. యంగ్ హీరో?

తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రీమేక్ చేసి ఎంతో పాపులారిటీ దక్కించుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమా ద్వారా మరింత క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడంతో ఎలాంటి ఫలితం ఉండదని భావించారు.

తన రెమ్యూనరేషన్లు ఎంతైనా కోత విధించండి..

ఎంతో అద్భుతమైన ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లోనే చూడాలని బాధించిన ఈ హీరో ఏకంగా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ 31 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఇందులో 5 లేదా 10 కోట్లు లేదా ఎంతైనా కోత విధించాలని ఆయన నిర్మాతలను వేడుకున్నారు. కొద్ది రోజుల పాటు ఈ సినిమా విడుదలను వాయిదా వేసి అనంతరం థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలను రిక్వెస్ట్ చేశారు. మరి ఈయన విన్నపాన్ని నిర్మాతలు వింటారా? లేక ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Big Boss Ott Telugu: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన బిగ్ బాస్.. కంటెస్టెంట్ లు వీళ్లే?

Big Boss Ott Telugu: బుల్లితెరపై ప్రసారమవుతూ వివిధ భాషలలో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమం ఈసారి బుల్లితెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం చేయడానికి సిద్ధమైంది.

Big Boss Ott Telugu: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన బిగ్ బాస్.. కంటెస్టెంట్ లు వీళ్లే?

ఈ క్రమంలోనే ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని కంటెస్టెంట్ ల ఎంపిక కూడా జరుగుతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే ఈరోజు నాగార్జున తెలియజేశారు. ఫిబ్రవరి నెలలోనే బిగ్ బాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని నాగార్జున తెలియజేశారు.అయితే చాలామంది సీజన్ సిక్స్ ప్రారంభమవుతుందని భావించినప్పటికీ సీజన్ సిక్స్ కాకుండా ఈ కార్యక్రమం ఓటీటీలో ప్రసారం కాబోతుందని , దీనికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని వెల్లడించారు.

Big Boss Ott Telugu: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన బిగ్ బాస్.. కంటెస్టెంట్ లు వీళ్లే?

ఈ బిగ్ బాస్ కార్యక్రమం ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం గురించి వార్తలు రావడంతో ఈ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయానికి వస్తే…

24 గంటలు ప్రసారం కానున్న బిగ్ బాస్ కార్యక్రమం..

యాంకర్ వర్షిని, యాంకర్ శివ, వరంగల్ వందన, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి, డీ 10 విన్నర్ రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమం కేవలం గంట మాత్రమే కాకుండా 24 గంటల పాటు లైవ్ రానున్నట్లు నాగార్జున ఇప్పటికే వెల్లడించారు. ఇక బిగ్ బాస్ ఫైవ్ కోసం నిర్మించిన ఇంటిలోనే కొన్ని మార్పులు చేసి ఓటీటీ బిగ్ బాస్ కార్యక్రమం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీకి ‘మహాసముద్రం’.. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ సంస్థ..!

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా ఈనెల 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిని ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నా.

జగపతిబాబు, రావురమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్‏తో ఏకే ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

అందులో ఉన్న డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ నచ్చేశాయి. దీంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. దీనికి కథే హీరో అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అయితే ఈ చిత్రం థియేట్రికల్ విడుదల అనంతరం ప్రముఖ ఓటిటి దిగ్గజం ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ మంచి డీల్ కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత దీనిని నెట్ ఫ్లిక్స్‏ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ‘మహాసముద్రం’ చిత్రానికి పోటీగా దసరా బరిలో మరో రెండు సినిమాలు దిగుతున్నాయి. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మరియు నాగశౌర్య ‘వరుడు కావలెను’ చిత్రాలు అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

సమంత, కాజల్ బాటలోనే రకుల్… త్వరలోనే అధికారిక ప్రకటన!

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పలువురు నటీమణులు వెబ్ సిరీస్ లో అడుగు పెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే అక్కినేని కోడలు సమంత, వెండితెర చందమామ కాజల్ అగర్వాల్, మిల్క్ బ్యూటీ తమన్నా లాంటివారు పలు వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరి స్టార్ సెలబ్రిటీల చూపుకూడా వెబ్ సిరీస్ ల పై పడింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యారు. ప్రేక్షకుల్లో బాగా డిమాండ్ పెరిగినా ఓటీటీ కంటెంట్‌తో త్వరలోనే ఆకట్టుకోవాలని రకుల్ ప్రీత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకే సరికొత్త కథలను వినే పనిలో పడ్డారు. దర్శకులు కొత్త వారైనా కథలో నైపుణ్యం ఉంటే చేయడానికి ఈ బ్యూటీ సిద్ధంగా ఉన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఓటీటీ అనేది బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ వేదికపై విడుదల కావడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా విడుదలయ్యే వెబ్ సిరీస్ లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో సరైన కథ నచ్చితే ఓటీటీ లో ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ బ్యూటీ సిద్ధమైనట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఓటీటీకి ఉదయ్ కిరణ్ చివరి చిత్రం వచ్చేది అప్పుడే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం నటన పై ఉన్న ఆసక్తి ద్వారా అవకాశాలను సంపాదించుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు అలాంటి హీరోలలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉదయ్ కిరణ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అర్ధాంతరంగా తనువు చాలించారు. ఈ విధంగా ఉదయ్ కిరణ్ అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ” చిత్రం” సినిమా ద్వారా అరంగ్రేటం చేసిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత “మనసంతా నువ్వే”,” నువ్వు నేను”, నీ స్నేహం వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి చిత్రం “చిత్రం చెప్పిన కథ”ఈ సినిమాను ఉదయ్ కిరణ్ చనిపోయిన ఏడాది అనగా 2014వ సంవత్సరంలోనే విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.తాజాగా ఉదయ్ కిరణ్ చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు ఆయన నటించిన చివరి చిత్రం విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది.

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ సినిమా నిర్మాతలు ఈ సినిమాను ప్రముఖ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో రిలీజ్ పై ఒప్పందం కుదుర్చుకున్నారని, త్వరలోనే డిజిటల్ రిలీజ్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలపై త్వరలోనే సమాచారం తెలియనుంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటి మదాలసా శర్మ హీరోయిన్ గా నటించగా మోహన్ ఏఎల్ఆర్కే దర్శకత్వంలో సీహెచ్ మున్నా నిర్మించారు.

జూన్ లో రానున్న ‘దృశ్యం2’.. ఓటీటీ లోనా.. లేక థియేటర్స్ లోనా..??

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రస్తుతం నారప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు వెంకీ.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు వెంకీ. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన అసురన్ సినిమాకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు ఎఫ్ 3, దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు వెంకీ.

వీటిలో దృశ్యం 2 కు సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేసారు..ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..అంతేకాదు సినిమా కథను దర్శకుడు చెప్పిన విధానం.. స్క్రీన్ ప్లే సైతం విమర్శలకుల ప్రశంసలు అందుకుంది..

అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ నడుస్తుంది. దృశ్యం 2 ను మొదటి నుండి కూడా జూన్ లో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి.

అన్నట్లుగానే జూన్ లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నారట. అయితే అది ఓటీటీలో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది కాబట్టి ఓటీటీలో విడుదల చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతుందా.. లేక థియేటర్స్ లో విడుదల అవుతుందా..అనేది చూడాలి.