Tag Archives: pawan kalyan

AP politics: లోకేష్ పవన్ కు పోటీగా మహిళ అభ్యర్థులు.. మహిళలను రంగంలోకి దింపిన జగన్?

AP politics: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల జాబితాను తెలియజేశారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో అందరీ చూపు రెండు నియోజక వర్గాల పైనే ఉంది.

ఒకటి పిఠాపురం కాగా మరొకటి మంగళగిరి. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి గెలవాలనే ఉద్దేశంతో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కి పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీతా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఈమె ఈసారి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు.

ఇక మంగళగిరిలో గత ఎన్నికలలో నారా లోకేష్ పోటీ చేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈయన మరో నియోజకవర్గానికి వెళ్లకుండా ఈ ఎన్నికలలో కూడా అక్కడే విజయం సాధించాలన్న ధీమాతో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మంగళగిరి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈసారి ముడుగూరు లావణ్య అనే మహిళను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు.

పోటీగా మహిళా అభ్యర్థులు..
ఇక వీరిద్దరికీ మాత్రమే కాకుండా బాలయ్యకు పోటీగా కూడా మహిళా అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దీపిక రంగంలోకి దిగారు. ఇలా ఈ ముగ్గురికి పోటీగా జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యర్థులను నియమించి భారీ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ ఎన్నికలలో ఈ ముగ్గురు గెలిస్తే పర్వాలేదు కానీ లేకుంటే మహిళల చేతిలో ఓడిపోయారనే ఆపవాదం మూట కట్టుకోవాల్సి వస్తుందని చెప్పాలి.

Ap Politics: మరో 30 ఏళ్లు జగనే సీఎం… పవన్ పై ముద్రగడ ఫైర్!

Ap Politics: ఏపీలో రాష్ట్ర రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయి. నేడు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున రాజకీయాలలో మార్పులు చేర్పులు చర్చలు మొదలయ్యాయి. ఇకపోతే కాపు నేతగా కాపు ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వస్తారని అందరూ భావించారు కానీ ఈయన జనసేనకు గట్టి షాక్ ఇచ్చారు.

ముద్రగడ పద్మనాభం శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో వైసిపి పార్టీలోకి చేరిన సంగతి మనకు తెలిసిందే .ఈయనతో పాటు తన కుమారుడు కూడా వైసిపి పార్టీలోకి చేరారు. ఇలా వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరినటువంటి ముద్రగడ మీడియా ముందుకు వచ్చారు. ఈయన శనివారం కాకినాడ కిర్లంపూడిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు నేను ఎలాంటి పదవులు ఆశించి వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరలేదని తెలిపారు. మరో 30 సంవత్సరాలు పాటు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. ఆ పార్టీ నేతగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎక్కువమంది కార్యకర్తలతో కలిసి తాను పార్టీలో చేరాలనుకున్నాను కానీ ప్రస్తుతం పిల్లలకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఒంటరిగా వెళ్లి పార్టీలో చేరానని తెలిపారు.

కాపులు కారణం కాదు..
ఒక కాపు నేతగా తన కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టింది తన కాపు కులస్తులు కాదని ఈయన తెలిపారు. రాజకీయ బిక్ష పెట్టింది బీసీలు, దళితులు, కాపులు కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.నేను ఎవ్వరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ముద్రగడ అన్నారు. నా రాజకీయాలకు నేనే హీరోని అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: నేను రాజకీయాలలోకి రావడం ఆ డైరెక్టర్ కి ఇష్టం లేదు… పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించి రాజకీయాల పరంగా ఎంతో బిజీగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇటీవల రాజకీయ సభలలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ తాను రాజకీయాలలోకి రావడం ఒక డైరెక్టర్ కు ఇష్టం లేదంటూ వెల్లడించారు.

పవన్ రాజకీయాలలోకి రావడం ఎవరికి ఇష్టం లేదు ఈయన ఎవరి గురించి చెప్పారనే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తావించినది మరెవరి గురించో కాదు తన స్నేహితుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియజేశారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అని తెలిపారు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని ఈయన వెల్లడించారు.

ఇక నేను రాజకీయాలలోకి రావడం త్రివిక్రమ్ కి ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు. నేను సమాజం గురించి ఆలోచించి రాజకీయాలలోకి వచ్చాను కానీ త్రివిక్రమ్ మాత్రం నా గురించి ఆలోచిస్తూ ఉంటారని పవన్ తెలిపారు. ఇక నేను సంపాదించిన డబ్బులని రాజకీయాలలో పార్టీ కోసం ఖర్చు పెడుతూ ఉండగా ఆయన మాత్రం నాకు సినిమాలను తీస్తూ నా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండేలాగా చేస్తూ ఉంటారు.

నా గురించే ఆలోచిస్తాడు..
ఇలా త్రివిక్రమ్ నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు కానీ రాజకీయాలలోకి వచ్చేటప్పుడు మనకు పాలిటిక్స్ ఎందుకు అంటూ చాలా సార్లు చెప్పారు కానీ నేను వినకపోవడంతో ఆయన చెప్పడం కూడా మానుకున్నారని పవన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Ramgopal Varma: పిఠాపురం ఎన్నికల బరిలో వర్మ… పవన్ కి పోటీగా నిలబడుతున్నారా?

Ramgopal Varma: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి జరుగుతుంది. మరికొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ప్రజలలోకి వస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారు అనే జాబితాలను కూడా విడుదల చేస్తున్నారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్న నేపథ్యంలో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా పవన్ కళ్యాణ్ తాను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటించిన వెంటనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

తాను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే అనుకోకుండా తాను పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నానని ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తాను కూడా పిఠాపురం నియోజకవర్గంలో నిలబడుతున్నానంటూ ఈయన కామెంట్ చేయడంతో వర్మ ట్వీట్ వెనుక ఉన్న అర్థమేంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

వర్మ సెటైరికల్ ట్వీట్…
ఈయన నిజంగానే పిఠాపురం ఎన్నికల బరిలో దిగబోతున్నారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయగా మరి కొందరు పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఇలాంటి ట్వీట్ చేశారు అంటూ వర్మ చేస్తున్న ట్వీట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఎలాంటి ఉద్దేశంతో వర్మ ఈ విధమైనటువంటి పోస్ట్ చేశారనే విషయం తెలియాలి అంటే ఆయనే స్పందించాల్సి ఉంటుంది.

AP politics: చిచ్చు రేపిన రెండో జాబితా.. రాజీనామాల బాటలో టీడీపీ జనసేన?

AP politics: ఏపీ ఎన్నికల తేదీ ప్రకటనలు రాకముందే ఎన్నికల వేడి రాజు కుంది. సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతూ పార్టీకే ముప్పు తెచ్చేలా పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సీట్లను జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు రెండో జాబితాను విడుదల చేశారు ఇదివరకే 99 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు రెండో జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఈ రెండో జాబితా పార్టీ నేతలలోనూ కార్యకర్తలలోనూ పెద్ద ఎత్తున చిచ్చు రేపింది.

రెండో జాబితాలో ఆయన తమ పేరు ఉంటుందని ఆశించినటువంటి పలువురు సీనియర్లకు ఈసారి తీవ్ర నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సీట్లు రాలేదన్న ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలలో టిడిపికి జనసేన పార్టీకి తీవ్రస్థాయిలో వ్యతిరేక సెగ తగులుతుంది.

టీడీపీకి రాజీనామా..
పలు నియోజకవర్గాలలో ఆశించిన వారికి టికెట్లు రాకపోవడంతో మనస్థాపానికి గురైనటువంటి కొంతమంది నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో చంద్రబాబు నాయుడుకి జనసేనానికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది ఇక మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు పేరు రెండో జాబితాలో లేకపోవడంతో ఈయన కూడా అలక మానలేదని తెలుస్తుంది. అయితే ఇలా అలిగిన వారందరినీ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి వారందరికి చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ… ఊహించని షాక్ ఇచ్చిన పిఠాపురం వాసులు?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో హీరోగా నటిస్తూనే మరో వైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీని స్థాపించారు అయితే ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలి అన్న ఉద్దేశంతో ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సభలను ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సీట్ల పంపకాలు కేటాయింపులు కూడా పూర్తి అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ తాను ఈసారి భీమవరం గాజువాక నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని వెల్లడించారు.

ఇలా ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేయగానే పిఠాపురంలో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు భగ్గుమన్నారు.. పవన్ కళ్యాణ్ కు టికెట్ ఇస్తే కనుక తాము ఓట్లు వేయము అంటూ టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపి పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ కరపత్రాలతో పాటు ఫ్లెక్సీలను చింపేసి మంటలలో కాల్చి వేశారు.

గెలుపు కష్టమేనా…
ఇలా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాననే విషయాన్ని ప్రకటించడం ఆలస్యం వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి ఇలా వీరి వ్యవహార శైలి చూస్తుంటే ఈసారి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అసాధ్యంగానే మారిందని తెలుస్తోంది.

Pawan Kalyan: బ్రో సినిమా విషయంలో నేను ఎన్నో తిట్లు తిన్నాను.. పవన్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి రాజకీయాలపై ఎంతో ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉంది. ఇలా రాజకీయాలలో భాగంగా ఈయన వచ్చే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఇదివరకు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గతంలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గెలుపొందలేకపోయారు. అయితే ఈసారి మాత్రం పక్క గెలవాలని ఉద్దేశంతో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల రాజకీయ పార్టీలలో జనాలు లేకపోతే పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ లను ఉపయోగిస్తూ జనాలను పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాకు సినిమాలలో కూడా గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదని తెలిపారు.

గ్రాఫిక్స్ ఇష్టం లేదు…
ఇలా సినిమాలలోనే నాకు గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదని అయినప్పటికీ బ్రో సినిమా విషయంలో తాను ఎన్నో తిట్లు తిన్నానని తెలిపారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఏ మాత్రం బాగాలేదు అంటూ చాలామంది నన్ను తిట్టారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: ఆస్తులను అమ్మకానికి పెట్టిన పవన్.. కొనడానికి సిద్ధమైన స్టార్ హీరో?

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన రాజకీయాలలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా రాజకీయాలలోకి వచ్చినటువంటి ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎలాగైనా గెలుపొందాలన్న దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇలా పార్టీ కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతున్నటువంటి తరుణంలో ఈయన తన వద్ద ఉన్నటువంటి ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా తన ఆస్తులన్ని అమ్మి పార్టీని ముందుకు నడిపించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈయన ఆస్తులను అమ్మకానికి పెట్టారనే విషయం తెలిసి మరో టాలీవుడ్ స్టార్ హీరో ఆస్తులను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

పవన్ కి అండగా చిరు…
పవన్ కళ్యాణ్ ఆస్తులను కొనడానికి ఆసక్తి చూపుతున్నది మరెవరో కాదు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవికి తన తమ్ముళ్లు అంటే ఎంతో ప్రాణం. ఇక పార్టీని నడిపించడం కోసం పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముతున్నారనే విషయం తెలిసిన చిరంజీవి ఆస్తులన్నీ అమ్మేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఇబ్బందులలో పడుతుందని భావించి తన ఆస్తులను తన పేరుపై పెట్టుకుని నువ్వు ఎంతకు ఈ ఆస్తులను అమ్మాలనుకుంటున్నావో చెప్పు నేను అంత డబ్బు ఇస్తానని చెప్పారట. అలా కుదరదని పవన్ చెప్పడంతో చిరంజీవి అలాగైతేనే నాతో మాట్లాడు లేకపోతే ఇకపై మాట్లాడకు అని చెప్పగా పవన్ కళ్యాణ్ సరే అన్నారట. ఇలా తమ్ముడి కోసం చిరంజీవి పెద్ద ఎత్తున డబ్బులను ఇచ్చారని తెలుస్తోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అలవాటు కారణంగా బెంబేలెత్తిపోయిన చిరంజీవి?

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పొందినటువంటి చిరంజీవి అనంతరం తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఒక్కొక్కరిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వచ్చారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇకపోతే చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆ సమయంలో చిరంజీవి ఎక్కడికి వెళ్లినా కుటుంబ సభ్యులకు వివిధ రకాల వస్తువులను తీసుకొని వచ్చేవారట ఈ క్రమంలోనే తాను ఆ సినిమా షూటింగ్లో నిమిత్తం విదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా కావాలా అంటూ పవన్ కళ్యాణ్ ని అడిగితే తాను మాత్రం డమ్మీ గన్నులు తీసుకొని రా అన్నయ్య అంటూ చెప్పే వారట.

ఇలా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం కావాలి అని అడిగిన తనకోసం గన్ తీసుకొని రా అని చెప్పడంతో ఒక్కసారిగా చిరంజీవిలో ఏదో తెలియని భయం మొదలైందని చిరు పలు సందర్భాలలో తెలియజేశారు. వీడు ఎక్కడికెళ్లిన గన్ను తీసుకొని రమ్మంటున్నారు ఏంటి కొంపతీసి వీడు నక్సలైట్లలోకి కనక కలిసిపోతాడా అనే భయం నాలో పట్టుకుందని చిరంజీవి తెలిపారు.

ప్రజలు మెచ్చిన నాయకుడు…
ఇలా గన్నులు అంటే ఎంతో ఇష్టం చూపడంతో తనకు భయం వేసిందని కానీ నక్సలైట్లలోకి వెళ్లిపోతాడు అనుకున్న తన తమ్ముడు కాస్త ప్రజలు మెచ్చిన నాయకుడు అవుతున్నారు అంటూ చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Akira: హ్యాండ్సమ్ లుక్ లో అకిరా.. పవన్ కళ్యాణ్ ను గుర్తు చేస్తున్న మెగా వారసుడు?

Akira: అకిరా నందన్ పరిచయం అవసరం లేని పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడిగా అందరికీ ఎంతో సుపరిచితమే ప్రస్తుతం ఈయన తన తల్లి రేణు దేశాయ్ వద్దంటున్నారు. ఏదైనా పండగల సమయంలో మెగా ఫ్యామిలీతో కలిసి రచ్చ చేస్తూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ తన పిల్లలకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా రేణు దేశాయ్ అకిరాకు సంబంధించిన ఒక హ్యాండ్సం పిక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ కలర్ షర్టులో ఈయన హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నటువంటి ఫోటోని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జూనియర్ పవన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా తన కొడుకు ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె తాను తన పిల్లలకు ఒక విషయాన్ని చెప్పానని తన పిల్లలు అదే పాటిస్తున్నారని చెప్పుకు వచ్చారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వైర్లెస్ ట్రెండి బ్లూటూత్ వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల బ్రెయిన్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుందని అందుకే వైర్ హెడ్ ఫోన్స్ వాడమని తన పిల్లలకు సలహా ఇచ్చానని వాళ్ళు అదే చేస్తున్నారు అంటూ ఈమె తెలియజేశారు.

అమ్మ మాటే శాసనం..
ఈ క్రమంలోనే అకిరా ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ఫోటోలలో అకిరా అచ్చం యంగ్ ఏజ్ లో పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఉన్నారో తను కూడా అలాగే కనిపిస్తూ ఉండడంతో మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అకిరా ఇండస్ట్రీలోకి కనక వస్తే తండ్రిని మించిన తనయుడు అవుతారని , అకిరా సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి అభిమానులకు అకిరా ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో తెలియాల్సి ఉంది.