Tag Archives: police case

Pallavi Prashanth: 14 రోజులు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు రిమాండ్… చంచల్ గూడ జైలుకు తరలింపు!

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ సీజన్లో విన్నర్ గా నిలిచినటువంటి ఈయన పోలీసులు వద్దని చెప్పిన భారీ స్థాయిలో ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు ఈయనపై కేసు నమోదు చేశారు. అయితే ఈయన అభిమానులు సెలబ్రిటీల కార్లపై అదే విధంగా ఆర్టిసి బస్సులపై రాళ్ల దాడి చేయడంతో సుమారు ఆరు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆస్తిని నష్టం చేసినందుకుగాను ఈయనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

ఇలా పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడు మనోహర్ పై కేసు నమోదు కావడంతో వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. అయితే లాయర్ సూచనల మేరకు ఇంటికి రావడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన స్వగ్రామానికి వెళ్లి పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడు మనోహర్ ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు..

ఇలా ప్రశాంత్ తో పాటు తన సోదరుడుని పోలీసులు అరెస్టు చేసి అనంతరం ఆరు గంటలపాటు వీరిని విచారించి జడ్జి ఇంటిలోనే ఆయన ముందు హాజరు పరిచారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు A1 ముద్దాయిగా ప్రశాంత్ పేరు నమోదు చేయగా A2 గా తన సోదరుడు మనోహర్ పై కేసు నమోదు చేశారు. అయితే లాయర్ వాదన విన్న తర్వాత జడ్జ్ వీరికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

హద్దులు దాటిన అభిమానం…

14 రోజుల తర్వాత తిరిగి విచారణ జరుపనున్నారు ఇలా పల్లవి ప్రశాంత్ ను ప్రస్తుతం జైలులో వేయడంతో కొందరు ఈ విషయంపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అభిమానం ఉండాలి కానీ ఆ అభిమానం ఇలా మనల్ని ఇబ్బందులలో పడేసేలా ఉండకూడదని అభిమానులను అలా ప్రవర్తించేలా రెచ్చగొట్టకూడదు అంటూ ఈయన వ్యవహార శైలిపై కామెంట్స్ చేస్తున్నారు. వీరితోపాటు వీరు ర్యాలీ కోసం వెళ్లినటువంటి కారు డ్రైవర్ల పై కూడా కేసులు నమోదయాయని తెలుస్తోంది.

Allu Arjun: ఆ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటమేకాకుండా మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ పెద్దఎత్తున డబ్బును సంపాదిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ చేసిన ప్రతి ఒక్క ప్రకటన కూడా పలు వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈయన చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఒక వ్యాపార ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే.

Allu Arjun: ఆ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు?

ఈ విధంగా అల్లు అర్జున్ నటించిన ఈ ప్రకటనలో పూర్తిగా అవాస్తవాలే ఉన్నాయని, ఈ ప్రకటన అందరిని తప్పుదోవ పట్టించేలా ఉందంటూ సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు.ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చిన చైతన్య విద్యా సంస్థల పై అలాగే ఈ ప్రకటనలో నటించిన అల్లు అర్జున్ పై ఈయన అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Allu Arjun: ఆ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు?

ఈ నెల జూన్ 6వ తేదీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి పలు పత్రికల్లో ఐఐటీ(IIT), ఎన్‌ఐటీ(NIT) ర్యాంకుల ప్రకటన వచ్చింది. అయితే దీనిని అల్లు అర్జున్‌ ప్రమోట్ చేశారు.అయితే ఈయన ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చైతన్య విద్యా సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోసారి చేదు అనుభవం..

ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తరుచు వివాదాల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈయన పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన జొమాటో, ర్యాపిడో ప్రకటనలో కూడాపెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయం మర్చిపోకముందే మరోసారి చైతన్య విద్యా సంస్థల నుంచి ఈయన ఈ విధమైనటువంటి వివాదంలో చిక్కుకున్నారు.

Prabhas Heroin: అర్ధరాత్రి అసభ్యకర మెసేజ్ లతో ఎంతో ఇబ్బంది పడిన ప్రభాస్ హీరోయిన్… భరించలేక పోలీసులకు ఫిర్యాదు!

Prabhas Heroin: కాలం మారుతున్న సమాజం రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్న అమ్మాయిల పట్ల జరిగే దాడులు వారికి జరుగుతున్న అవమానాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవి కూడా కాలంతోపాటు పెరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎంతోమంది అమ్మాయిలు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కేవలం సాధారణ అమ్మాయిలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Prabhas Heroin: అర్ధరాత్రి అసభ్యకర మెసేజ్ లతో ఎంతో ఇబ్బంది పడిన ప్రభాస్ హీరోయిన్… భరించలేక పోలీసులకు ఫిర్యాదు!

ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు పలువురు అసభ్య ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డామని బహిరంగంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది.ప్రభాస్ హీరోగా బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలి పాత్రలో నటించిన సంజనా గల్రాని అందరికీ సుపరిచితమే.

Prabhas Heroin: అర్ధరాత్రి అసభ్యకర మెసేజ్ లతో ఎంతో ఇబ్బంది పడిన ప్రభాస్ హీరోయిన్… భరించలేక పోలీసులకు ఫిర్యాదు!

ఈమె బుజ్జిగాడు సినిమా తరువాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ డ్రగ్స్ వ్యవహారంలో ఈమె ఎంతో పాపులర్ అయ్యారు. డ్రగ్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక ఈ విషయంలో బెయిల్ పై బయటకు వచ్చిన సంజన మరొక వివాదంలో నిలిచారు.

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆడం బిడ్డప్ప సంజనతో ఒకప్పుడు పని చేశారు. ఇలా ఈ సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం వీరి మధ్య మంచి స్నేహ బంధంగా మారింది. అయితే సదరు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఈమెకు అర్ధరాత్రి సమయంలో వినడానికి రాయడానికి కూడా ఎంతో అసభ్యకరంగా ఉండే పదాలతో మెసేజ్ లు చేశారని వాటిని చూసి భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయంపై సదరు ఫోటోగ్రాఫర్ ని విచారించగా తాను ఎలాంటి అభ్యంతరకర మెసేజ్ లు పెట్ట లేదని వాదించాడు దీంతో పోలీసులు అతని ఫోన్ తీసుకొని చెక్ చేయగా ఫోన్ లో ఏ విధమైనటువంటి మెసేజ్ లు కనిపించకపోవడంతో పోలీసులు అతని ఫోను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసులో భాగంగా తప్పు ఎవరిదో తెలియాల్సి ఉంది.

Mohanbabu Family: వారిపై కేసు పెట్టిన మోహన్ బాబు ఫ్యాన్స్.. ఎందుకంటే..!

Mohanbabu Family: మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన మోహన్ బాబు ‘ సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ప్లాప్ కు కారణం  ఈ ట్రోలింగే అంటూ.. మంచు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 

Mohanbabu Family: వారిపై కేసు పెట్టిన మోహన్ బాబు ఫ్యాన్స్.. ఎందుకంటే..!

ఇటీవల ట్రోలింగ్ పై కూడా మంచు మోహన్ బాబు స్పందించారు.  ఓ ఇద్దరు హీరోలు పనికట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఈ  కామెంట్ల గురించి కూడా చివరకు ట్రోలింగ్ చేశారు.

Mohanbabu Family: వారిపై కేసు పెట్టిన మోహన్ బాబు ఫ్యాన్స్.. ఎందుకంటే..!

ఇటీవల మోహన్ బాబు, మంచు విష్ణు ట్రోలర్స్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంచు ఫ్యామిలీ కూడా చాలా సీరియస్ అయింది. అయితే.. తాజాగా మోహన్ బాబు ఫ్యాన్స్ మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న వారి పై కేసు నమోదు చేశారు

మేం ఎప్పుడు వేరే హీరోలను ట్రోల్ చేయలేదు: మోహన్ బాబు ఫ్యాన్స్


శ్రీ మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. తిరుపతి అర్బన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కేసు నమోదు చేశారు. ఆయన మాట్లాడుతూ…‘గత 20 ఏళ్లుగా మోహన్ బాబుగారి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ గా ఉన్నాను. ఎప్పుడు కూడా మోహన్ బాబు ఫ్యాన్స్ వేరే హీరోలపై కామెంట్స్ చేయలేదు. మోహన్ బాబు ఇటీవల నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి కొంతమంది ట్రోలర్స్ మంచు కుటుంబం పై తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. 1, 2 కాదు 100 పైగా యూట్యూబ్ ఛానల్స్ వారు సినిమా రిలీజ్ ముందే సినిమా బాగాలేదని ట్రోల్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశాం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Raviteja Mother: హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే?

Raviteja Mother: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రవితేజ తల్లి పై పోలీస్ కేసు నమోదు కావడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అసలు ఎప్పుడూ వార్తలలో కూడా వినిపించని ఈమె పై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేసారనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.

Raviteja Mother: హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే?

ఈ క్రమంలోనే రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో పాటు మర్రి పాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా వీరి పై పోలీసులు కేసు నమోదు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

Raviteja Mother: హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే?

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలవ స్లూయిజ్ నిర్మాణ పనులను రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో పాటు సంజయ్ అనే వ్యక్తి ఆ నిర్మాణ పనులను ధ్వంసం చేశారని పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.

అనుమతి లేకుండా ధ్వంసం చేసినందుకే..

ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను అధికారుల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వీరు నాశనం చేయడంతో పోలీసులు పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.రవితేజ తల్లి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మరి రవితేజ తల్లి పై పోలీస్ కేసు పెట్టడంతో హీరో రవితేజ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Dasari Arun Kumar: ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. బైక్ లను ఢీకొట్టిన టాలీవుడ్ హీరో.. కేసు నమోదు చేసిన పోలీసులు!

Dasari Arun Kumar: టాలీవుడ్ దర్శకుడు, సినీ పెద్ద దివంగత దాసరి నారాయణరావు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన తనయుడు దాసరి అరుణ్ కుమార్ హీరోగా పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే దాసరి మరణం తర్వాత అరుణ్ ఇండస్ట్రీలో పెద్దగా సందడి చెయ్యలేదని చెప్పాలి. తన తండ్రి మరణం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన అరుణ్ ఎన్నో సమస్యలలో ఇరుక్కున్నాడు.

Dasari Arun Kumar: ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. బైక్ లను ఢీకొట్టిన టాలీవుడ్ హీరో.. కేసు నమోదు చేసిన పోలీసులు!

తాజాగా ఈయన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా దాసరి అరుణ్ కుమార్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో పోలీసులు ఇతనిపై కేసును నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇతనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Dasari Arun Kumar: ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. బైక్ లను ఢీకొట్టిన టాలీవుడ్ హీరో.. కేసు నమోదు చేసిన పోలీసులు!

ఈ విధంగా అరుణ్ కుమార్ కారు అతి వేగంగా నడుపుతూ బైక్ ఢీ కొట్టడంతో అతను మద్యం సేవించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దాసరి అరుణ్ కు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

హీరోగా సందడి చేసిన అరుణ్

దాసరి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అరుణ్ సామాన్యుడు, చిన్న, ఆదివిష్ణు వంటి సినిమాలలో హీరోగా సందడి చేశారు.అయితే దాసరి మరణాంతరం ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరమైన పలు వ్యాపారాలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా పోలీసులకు పట్టుబడటంతో ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.

Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

Tirupati MP: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు, దోపిడీలు చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మనకు తెలియకుండానే మన డబ్బులను టెక్నాలజీ సహాయంతో దొంగిలిస్తున్నారు.

Tirupati MP: తిరుపతి ఎంపీకి టోకరా..! దాదాపు రూ.5 కోట్ల వరకు..!

ఓటీపీ ఫ్రాడ్స్, లాటరీ వచ్చిందని ప్రజల్ని మోసాలు చేయడం ఇటువంటి కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏదో చదువుకోని వారు మోసపోతున్నారంటే.. ఏమో అనుకోవచ్చు, కానీ చదువుకుంటూ… ఉన్నత ఉద్యోగాలు చేసే వారు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. 

ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా..

తాజాగా రాజకీయ నాయకులు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తికి సైబర్ చీటర్ ఫోన్ కాల్ చేశాడు. సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తూ… తనను అభిషేక్ అనే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద రూ. 5 కోట్లు మంజూరైనట్లు నమ్మబలికాడు. 


ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా..

ఇదిలా ఉంటే మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్ డబ్బులు వేయాలన్న అభిషేక్.. 25 దరఖాస్తులకు ఒక్కొక్క దానికి రూ. 1.5 లక్షలు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన తిరుపతి ఎంపీ గురుమూర్తి… వెంటనే సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసి విషయంపై ఆరా తీశారు. ఆ పేరుతో ఎవరూ లేరని నిర్థారించుకున్న తరువాత.. ఎంపీ అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మెయిల్ ద్వాారా వివరాలను ఎంపీ, ఎస్పీకి పంపించాడు. ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైబర్ చీటర్ ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Crime News: జూనియర్ ఒంటిపై బట్టలు విప్పి.. వీడియో తీసిన సీనియర్లు.. ట్రిమ్మర్ తో వెంట్రుకలు కట్ చేస్తూ దాడి!

Crime News: సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థి తనపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్త సంవత్సరం రోజు సీనియర్లు తనపై ర్యాంగింగ్ చేశారని.. ఒంటిపై బట్టలు విప్పించి.. ఫొటోలు తీసి.. సెల్ఫీలు దిగారని.. అంతే కాకుండా.. తన వెంట్రుకలను ట్రిమ్మర్ తో కట్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించాడు.

Crime News: జూనియర్ ఒంటిపై బట్టలు విప్పి.. వీడియో తీసిన సీనియర్లు.. ట్రిమ్మర్ తో వెంట్రుకలు కట్ చేస్తూ దాడి!

అయితే ఎలాగోలా అతడు సీనియర్ల నుంచి తప్పించుకొని.. తన రూంకి వెల్లి.. తండ్రికి కాల్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే బాధితుడి తండ్రి డయల్ 100కి సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితుడిని రక్షించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి సూర్యాపేటలోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు.

Crime News: జూనియర్ ఒంటిపై బట్టలు విప్పి.. వీడియో తీసిన సీనియర్లు.. ట్రిమ్మర్ తో వెంట్రుకలు కట్ చేస్తూ దాడి!

శనివారం ఇంటి నుంచి బయలుదేరి రాత్రి కళాశాల హాస్టల్‌కు వచ్చాడు. ఆ సమయంలో ఉన్నత పాఠశాలలకు చెందిన 25 మంది విద్యార్థులు అతడిని బలవంతంగా తమ గదిలోకి తీసుకెళ్లారు. అతని బట్టలు విప్పి సెల్ ఫోన్లలో వీడియో తీశారు. వారంతా మద్యం మత్తులో ఉండడంతో అప్పటికే స్పృహ తప్పి విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడు. ట్రిమ్మర్‌తో షేవింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా బాధితుడు తప్పించుకుని తన గదిలోకి వెళ్లాడు.

వారిపై చర్యలు తీసుకోండి.. మంత్రి హరీశ్ రావు..

అక్కడి నుంచి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో కంగారుపడిన అతను వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. సూర్యాపేట పోలీసులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని బాధితుడి తండ్రి ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి స్పందిస్తూ.. విద్యార్థులు చెప్పిన మాట వాస్తవమేనన్నారు. ఘటనపై విచారణకు నలుగురు హెచ్‌వోసీలను నియమించామని.. సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడితే కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. విద్యార్థినిపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటనపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు సోమవారం విచారణకు ఆదేశించారు. ర్యాగింగ్‌ ఘటనలు చోటుచేసుకోకుండా వైద్య విద్య సంచాలకులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

vicky -Kaushal: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పై కేసు వేసిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

vicky -Kaushal: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ వివాహం జరిగి కొద్ది రోజులైనా జరగకనే అతనిపై మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి పోలీస్ కేసు పెట్టారు. అసలు నటుడు విక్కీ కౌశల్ పై కేసు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ లుకా చుప్పి 2 అనే చిత్రంలో నటిస్తున్నారు.

vicky -Kaushal: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పై కేసు వేసిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం నుంచి చిత్రబృందం ఒక మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తూ ఉంటారు. ఈ సన్నివేశంపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జై సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తం చేస్తే పోలీస్ కేసు వేశాడు.

vicky -Kaushal: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పై కేసు వేసిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

ఈ వ్యక్తి పోలీస్ కేసు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈ వీడియోలో విక్కీ కౌశల్ నడుపుతున్న బండి నెంబర్ కి తన బండి నెంబర్ ప్లేట్ ఉపయోగించారని జై సింగ్ యాదవ్ వీరిపై పోలీస్ కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇలా ఉపయోగించాలి చట్టరీత్యా నేరం..

లుకా చుప్పి 2చిత్ర బృందం తన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా తన నెంబర్ ప్లేట్ ను సినిమాలో బండికి ఉపయోగించడం చట్టరీత్యా నేరమని జై సింగ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై తను పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదుపై చిత్రబృందం ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

పోసానిపై కేసు నమోదు.. ఎవరు పెట్టారో తెలుసా..?

రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అంత్యంత ఆక్రోశంతో మాట్లాడిన విషయం తెలిసిందే. అటు ప్రభుత్వం సినీ పరిశ్రమపై చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. తర్వాత దీనిపై ప్రతీ ఒక్కరూ స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు ఘాటుగా సమాధానం కూడా ఇచ్చారు.

అయితే ఇదే వ్యాఖ్యలపై పోసాని ప్రెస్ మీట్ పెట్టి వైకాపా కార్యకర్తగా స్పందించాడు. దీంతో పవన్ అభిమానులు అతడి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత రెండో సారి ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ ఫ్యామిలీ విషయంలో కూడా తలదూర్చాడాని.. పోసానిపై దాడి చేసేందుకు కూడా పవన్ అభిమానులు వెనుకాడలేదు. కనిపిస్తే.. తీవ్రంగా కొట్టడానికైనా చూశారు.

దాని తర్వాత పవన్ అభిమానులపై పోసాని కేసు నమోదు చేస్తానంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు పోసానిపై కేసు నమోదు చేశాడు. వైఎస్ఆర్ కార్యకర్తల నుంచి తానకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి జనసేన కార్యకర్త అయిన రాజశేఖర్ ఈ ఫిర్యాదు చేశాడు.

వైకాపా కార్యకర్తలు తనను అవమానించారని.. పోసాని వ్యాఖ్యల తర్వాత ఇక్కడ తాము పవన్ అభిమానులమంటూ చెప్పుకొనే పరిస్థితి లేకుండా అయిందని అతడు వాపోయాడు. అతడి వ్యాఖ్యల వల్ల నాకు ప్రాణ హాని ఉందంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు. ఇటు పవన్ అభిమానుల నుంచి కూడా తనకు అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.