Tag Archives: properties

Nayanatara: ఆస్తులు మొత్తం తన పేరు పైకి రాయించుకున్న నయనతార.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?

Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా 20 సంవత్సరాల నుంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకొని సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్స్ గా నయనతార పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే జవాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే నయనతార తన భర్తను ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిందో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

విడాకుల దిశగా అడుగులు..
ఇదిలా ఉండగా తాజాగా నయనతార తన భర్త పేరుపై ఉన్నటువంటి ఆస్తులను మొత్తం తిరిగి తన పేరు మీద రాయించుకుందని తెలుస్తుంది. తన భర్త తన సర్వస్వం అంటూ ఈమె సినిమాలలో సంపాదించినది మొత్తం తన భర్త పేరు మీదగా ట్రాన్స్ఫర్ చేశారట అయితే ఉన్నఫలంగా ఈమె ఆస్తులు అన్నింటిని కూడా తన పేరు మీద రాయించుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరుగుతున్నాయా వీరు కూడా విడాకులు దిశగా అడుగులు వేస్తున్నారా వీరి జీవితంలో వేణు స్వామి చెప్పినది నిజం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Pawan Kalyan: ఆస్తులను అమ్మకానికి పెట్టిన పవన్.. కొనడానికి సిద్ధమైన స్టార్ హీరో?

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన రాజకీయాలలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా రాజకీయాలలోకి వచ్చినటువంటి ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎలాగైనా గెలుపొందాలన్న దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇలా పార్టీ కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతున్నటువంటి తరుణంలో ఈయన తన వద్ద ఉన్నటువంటి ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా తన ఆస్తులన్ని అమ్మి పార్టీని ముందుకు నడిపించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈయన ఆస్తులను అమ్మకానికి పెట్టారనే విషయం తెలిసి మరో టాలీవుడ్ స్టార్ హీరో ఆస్తులను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

పవన్ కి అండగా చిరు…
పవన్ కళ్యాణ్ ఆస్తులను కొనడానికి ఆసక్తి చూపుతున్నది మరెవరో కాదు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవికి తన తమ్ముళ్లు అంటే ఎంతో ప్రాణం. ఇక పార్టీని నడిపించడం కోసం పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముతున్నారనే విషయం తెలిసిన చిరంజీవి ఆస్తులన్నీ అమ్మేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఇబ్బందులలో పడుతుందని భావించి తన ఆస్తులను తన పేరుపై పెట్టుకుని నువ్వు ఎంతకు ఈ ఆస్తులను అమ్మాలనుకుంటున్నావో చెప్పు నేను అంత డబ్బు ఇస్తానని చెప్పారట. అలా కుదరదని పవన్ చెప్పడంతో చిరంజీవి అలాగైతేనే నాతో మాట్లాడు లేకపోతే ఇకపై మాట్లాడకు అని చెప్పగా పవన్ కళ్యాణ్ సరే అన్నారట. ఇలా తమ్ముడి కోసం చిరంజీవి పెద్ద ఎత్తున డబ్బులను ఇచ్చారని తెలుస్తోంది.

Mahesh Babu: మహేష్ బాబు ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాల నటుడిగా సుమారు పది సినిమాలకు పైగా నటించినటువంటి ఈయన అనంతరం హీరోగా మారిపోయారు ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు కేవలం టాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలు ఏవి కూడా పాన్ ఇయర్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఇక హీరోగా మహేష్ బాబు ఇప్పటివరకు 27 సినిమాలు చేశారు. తన 28వ సినిమా అని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నేడు మహేష్ బాబు తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక నేడు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇప్పటివరకు సినిమాలలో నటిస్తూ యాడ్స్ చేస్తూ సంపాదించినటువంటి ఆస్తులు ఎంత అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆయన ఆస్తులను ఏమాత్రం తీసుకోలేదని తెలుస్తుంది. కృష్ణ తన ఆస్తులు అన్నింటిని కూడా తన మనవడు మనవరాలు పేరిట రాశారట.

Mahesh Babu: వేల కోట్లు సంపాదించిన మహేష్…


ఈయన నమ్రతను వివాహం చేసుకోవడంతో నమ్రతనుంచి సుమారు 2000 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కలిసి వచ్చాయని తెలుస్తుంది. ఇక పలు సినిమాలలో నటిస్తూ మహేష్ బాబు సుమారు 70 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు ఒక యాడ్ వీడియో చేస్తే 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఏడాదికి సుమారు 200 కోట్లకు పైగా ఈయన ఆదాయం ఉందని తెలుస్తుంది.ఈ విధంగా మహేష్ బాబు సినిమాలలో కొనసాగుతూనే సుమారు 13 వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టినట్టు సమాచారం.

Sreeja: శ్రీజ కోసం కోట్ల విలువచేసే ఆస్తులను ఇచ్చిన మెగాస్టార్…?

Sreeja: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఆయన కుమార్తె శ్రీజ మాత్రం చిరంజీవి పేరును చెడగొడుతున్నారనే చెప్పాలి ఇప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి ఇద్దరు భర్తలకు దూరంగా తన ఇంట్లోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఒంటరిగా ఉండటంతో చిరంజీవి ఎంతో ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి ఇద్దరు భర్తలతో విడాకులు తీసుకుని విడిపోయినటువంటి శ్రీజ ప్రస్తుతం తన కూతుర్లతో కలిసి మెగాస్టార్ ఇంట్లోనే ఉన్నారు. అయితే తాను ప్రేమగా చూసుకునే శ్రీజ జీవితం అలా మారడంతో చిరంజీవి తన కుమార్తె విషయంలో చాలా ఆందోళన చెందారట ఎలాగైనా తన కుమార్తె జీవితాన్ని చక్కదిద్దాలని భావించి తాను సంపాదించినటువంటి ఆస్తిలో కొంతమంది శ్రీజకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ఈ క్రమంలోనే శ్రీజ కూతుర్ల బాధ్యత చిరంజీవి తీసుకోవడమే కాకుండా తనకోసం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఏకంగా 35 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేసి వెంటనే ఆ ఇంటిని శ్రీజ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారని తెలుస్తుంది. ఈ విధంగా చిరంజీవి తన చిన్న కుమార్తె కోసం భారీగానే ఆస్తులు కూడా పెడుతున్నారట.

Sreeja: కోట్ల ఆస్తిని ఇచ్చిన చిరు…


చిరంజీవికి శ్రీజ చిన్న కూతురు కావడంతో చిన్నప్పటి నుంచి తనని చాలా అల్లారు ముద్దుగా పెంచారు. అయితే శ్రీజ ప్రస్తుతం ఒంటరిగా తన పిల్లలతో గడుపుతున్నప్పటికీ చిరంజీవి తన పట్ల చూపించే ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని తన కుమార్తె క్షేమం కోసం చిరంజీవి ఇలా కోట్ల విలువ చేసే ఆస్తులను తనకు ఇచ్చారనీ తెలుస్తోంది.

Gopichand Malineni: అప్పుల బాధతో ఆస్తులన్నీ అమ్మేశాము… గోపీచంద్ కష్టాలు మామూలుగా లేవు!

Gopichand Malineni: చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి అందరికీ సుపరిచితమే ఈయన ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నారు. క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ మల్లినేని అనంతరం బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేశారు.

ఈ సినిమా కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్, నిర్మాత ,హాని రోజ్ వరలక్ష్మి శరత్ కుమార్ వంటి తదితరులు పాల్గొన్నారు.

ఇలా బాలకృష్ణ చిత్రం బృందంతో సరదాగా ముచ్చటిస్తూ ఎన్నో సినిమా విశేషాలను పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య రవితేజకు ఫోన్ చేసి ధమాకా సక్సెస్ తెలియజేశారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి తనదైన శైలిలో మాట్లాడుతూ ఆట పట్టించారు. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి మాట్లాడుతూ ఈయన పలు విషయాలను బయటపెట్టారు.

Gopichand Malineni: ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్న గోపీచంద్…


గోపి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్రాక్ సినిమాకి ముందు ఏడాదిన్నర పాటు చాలా కష్టాలు పడ్డావట ఆస్తులు కూడా అమ్మేశావట ఆ సమయంలో ఏమనిపించింది అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గోపీచంద్ స్పందిస్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అదే సమయంలోనే నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనని ఓదార్చారు. మరి క్రాక్ సినిమాకి ముందు ఏం జరిగింది? ఎందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.

Chalapathy Rao: ఇన్నేళ్ల సినీ కెరియర్లో చలపతిరావు సంపాదించిన ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chalapathy Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.కైకాల మరణ వార్త నుంచి బయటపడక ముందే చలపతిరావు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఇక ఇండస్ట్రీలో నటుడిగా సుమారు ఐదున్నర దశాబ్దాల కాలం పాటు కొనసాగుతూ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినటువంటి చలపతిరావు నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈయన గూడచారి 116 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో సుమారు 1200 సినిమాలలో నటించిన ఈయన భారీ మొత్తంలోనే ఆస్తులు కూడా పెట్టి ఉంటారని అందరూ భావిస్తున్నారు.

ఇకపోతే చలపతిరావు ఇండస్ట్రీలో ఉంటూ ఈయన సంపాదించిన ఆస్తుల విలువ చాలా తక్కువ అని మాత్రం చెప్పాలి. ఈయన ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం తన పిల్లల కోసం ఖర్చు చేసి తన పిల్లలను ఉన్నత స్థానంలో ఉంచారు.ఈయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడగా కుమారుడు రవిబాబు ఇండస్ట్రీలోనే దర్శకుడిగా నటుడిగా కొనసాగుతున్నారు.

Chalapathy Rao: చలపతిరావు పేరుపై రెండు ఇల్లులు మాత్రమే ఉన్నాయి…

ఇక చలపతిరావు పేరుమీద హైదరాబాదులో పలు ప్రాంతాలలో కేవలం రెండు ఇల్లు మాత్రమే ఉన్నాయని వీటి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇది మినహా చలపతిరావు పేరుమీద ఏ విధమైనటువంటి ఆస్తులు లేవని ఇండస్ట్రీ సమాచారం. ఏది ఏమైనా అన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన చలపతిరావు ఇంత తక్కువ మొత్తంలో ఆస్తులు కూడా పెట్టారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Super Star Krishna: వేలంపాటలో కృష్ణ ఆస్తులు.. అప్పుడు మహేష్ బాబు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇలా కృష్ణ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు అలాగే చిత్ర బృందం అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.ఇలా కృష్ణ గారు మరణంతో ఆయన సినీ ప్రస్థానం గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎంతోమంది గుర్తుచేసుకొని బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్టుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈయన కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఆయన ఆస్తిపాస్తుల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే కృష్ణ గారి ఆస్తుల గురించి మాట్లాడుతూ ఆయన స్వతహాగా సంపాదించినది చాలా ఉంది అలాగే విజయనిర్మల వల్ల కూడా ఆయనకు పెద్ద మొత్తంలో ఆస్తులు కలిసి వచ్చాయని తెలిపారు.

ఇకపోతే కృష్ణ గారు కెరియర్ మొదట్లో పద్మాలయ స్టూడియో స్థాపించిన తర్వాత కొన్ని కారణాల వల్ల బ్యాంకు రుణం చేశారు అయితే ఆ బ్యాంకు రుణం చెల్లించకపోవడంతో పద్మాలయ స్టూడియోతో పాటు ఆయన ఇల్లు ఇతరత ఆస్తులను కూడా వేలం వేశారు. ఇలా వేలం పాటలో ఆస్తులు కోల్పోవాల్సిన సమయంలో రంగంలోకి మహేష్ బాబు దిగారని రామారావు తెలిపారు.

Super Star Krishna: వేలకోట్ల ఆస్తులు

ఈ విధంగా ఈయన ఆస్తులన్నీ వేలం వేసే సమయంలో మహేష్ బాబు గారు బ్యాంక్ అధికారులతో మాట్లాడి తనకు కొంత సమయం కావాలని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తాను డబ్బు మొత్తం చెల్లిస్తానంటూ ఆ భారాన్నంత తన భుజాన వేసుకున్నారని ఈయన తెలిపారు. అప్పట్లో కృష్ణ గారి ఆస్తులు 15కోట్ల రూపాయలకు వేలం వేశారు అయితే అప్పట్లో ఆయనకు అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేది కాదు అయితే ఇప్పుడు ఆ ఆస్తులు ఆయనకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుపాస్తులను తెచ్చి పెట్టిందని ఈ సందర్భంగా రామారావు తెలిపారు.

Actor Madhvan: వార్తలలో ఎలాంటి నిజం లేదు.. నేనేలాంటి ఆస్తులు అమ్ముకోలేదు… ఆ వార్తలకు చెక్ పెట్టిన మాధవన్!

Actor Madhvan: తెలుగు తమిళ భాషలలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మాధవన్ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో ది రాకెట్రి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రముఖ భారతీయ ఇస్రోశాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం.

ఇకపోతే ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఇక ఇప్పటికీ ఈ సినిమా పలుచోట్ల థియేటర్లలో రన్ అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమా ద్వారా మాధవన్ దర్శకుడిగా మారడమే కాకుండా ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా మాధవన్ భారీ నష్టాలను ఎదుర్కొన్నారని ఈ సినిమా వల్ల వచ్చిన నష్టాలను తీర్చడం కోసం ఏకంగా ఆయన ఆస్తులను కూడా అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి.

ఇలా ఈ సినిమా నష్టాల నుంచి బయటపడటానికి మాధవన్ తాను నివస్తున్న ఇంటిని కూడా అమ్మకున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై ఈయన స్పందించారు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ ఆ భగవంతుడి దయవల్ల తాను ఒక మంచి సినిమా చేశానని ఈ సినిమా వల్ల తాను ఎలాంటి నష్టాలను ఎదుర్కోలేదని ఈయన వెల్లడించారు.ఇకపోతే ఈ ఏడాది ది రాకెట్రీ సినిమా కోసం పనిచేసిన వారందరూ కూడా ప్రభుత్వానికి ఎక్కువగానే టాక్స్ చెల్లించి ఉంటారని ఈయన పేర్కొన్నారు.

Actor Madhvan: ఇల్లు అంటే ఎంతో ఇష్టం…

ఇకపోతే తనకు ఇల్లు అంటే ఎంతో ఇష్టం అలాంటిది తాను నివసిస్తున్న ఇల్లును కూడా అమ్మారని వస్తున్నటువంటి వార్తలలో ఏ విధమైనటువంటి వాస్తవం లేదని ఇప్పటికి తాను ఆ ఇంట్లోనే నివసిస్తున్నానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా నేను ఆస్తులు అమ్ముకున్నాను అని వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అవన్నీ ఆ వాస్తవాలేనని ఈయన కొట్టిపారేశారు.

యాంకర్ విష్ణుప్రియ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సోషల్ మీడియాలోని నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులను యాంకర్ విష్ణుప్రియ ఎలా కట్టిపడేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వెండితెరపై హీరోయిన్‌గానూ విష్ణుప్రియ నటించారు. విచ్చలవిడి అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇటీవల ఆమె ఇన్ స్టాలో అప్ లోడ్ చేసిన మాట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

యాంకర్‌ విష్ణు ప్రియ నెమ్మదిగా సినిమాలపై ఫోకస్‌ పెడుతుంది. టీవీ షోస్‌తో యాంకర్‌గా రచ్చ చేసిన ఈ హాట్‌ అందాల భామ ఇప్పుడు డిజిటల్‌ మీడియాలో హంగామా చేసేందుకు రెడీ అవుతుంది. గ్లామర్‌ షో విషయంలో విష్ణు ప్రియ ఏనాడు వెనకాడుగు వేయలేదు. సాధ్యమైనంత వరకు తన అందాలను ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

తెలుగు, త‌మిళం, కన్న‌డ వంటి భాష‌ల‌లో న‌టించిన విష్ణు ప్రియ తెలుగులో పోవే పోరా అనే షోతో యాంక‌ర్‌గా అడుగుపెట్టింది. విష్ణు ప్రియ‌ యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా మారింది. వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. తాజాగా ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ చిత్రంలో కూడా నటించింది.

1987 ఫిబ్రవరి 22 న హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మడు. ఆమె ఒక్క షోకి రూ.50 నుంచి రూ.70 వేల వరకు తీసుకుంటుందంటూ టాక్. అయితే ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే. వాళ్ల తండ్రి వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆమెకు మణికొండ దగ్గర కోటిన్నర విలువ చేసే ఫ్లాట్ తో మొత్తం ఆమె ఆస్తులు రూ. 5కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాల టాక్. అంతే కాకుండా ఆమెకు విలువైన కార్లు కూడా ఉన్నాయి.

షాకిస్తున్న సుడిగాలి సుధీర్ ఆస్తులు.. హైదరాబాద్ లోనే భారీగా..

బుల్లితెరపై కమెడియన్ గా, యాంకర్ గా, మెజీషియన్, నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెజీషియన్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ పై అడుగు పెట్టారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సుధీర్ ఏకంగా టీమ్ లీడర్ గా ఎదిగారు.అలాగే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ తర్వాత పలు కార్యక్రమాలలో చేస్తూ బిజీగా ఉన్నారు.

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మాత్రమే కాకుండా ఢీ కార్యక్రమం, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు.శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా యాంకర్ గా కొనసాగుతున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఏ మాత్రం ఖాళీగా లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు.

ఈ విధంగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సుధీర్ వెండితెరపై కూడా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న సుధీర్ ఆస్తిపాస్తులను కూడా బాగా వెనకేసుకున్నట్టు తెలుస్తుంది. సుధీర్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కావస్తుండడంతో ఆస్తులను కూడా బాగా సంపాదించారని తెలుస్తోంది.

నెలరోజులలో ఏమాత్రం ఖాళీ లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్న సుదీర్ సంవత్సరానికి సుమారు 40 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఆస్తుల విషయాలు బయటపెట్టడంతో సుడిగాలి సుదీర్ తనకు హైదరాబాద్లో రెండు ఇళ్లు ఉన్నాయనే విషయాన్ని తెలియజేశారు. ఇంత పెద్ద మహానగరంలో ఒక ఇల్లు ఉండడమే గగనం అయితే సుధీర్ ఏకంగా రెండు ఇళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక స్థిరాస్తులు కూడా సుదీర్ కు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే సుధీర్ ఆస్తి సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే సుదీర్ ఇంతటి స్థాయికి చేరుకొని ఆస్తులను కూడా పెట్టడంతో ఈ విషయం తెలిసిన వాళ్లు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.