Tag Archives: Sharmila

Sharmila: కాంగ్రెస్ గూటికి చేరిన వైయస్ షర్మిల.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ?

Sharmila: దివంగత రాజకీయ నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీ స్థాపించినటువంటి షర్మిల పెద్ద ఎత్తున తెలంగాణలో పాదయాత్ర చేస్తూ అధికార ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. అయితే తీరా ఎన్నికల సమయంలో ఈమె మౌనం వహించడమే కాకుండా ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకున్నారు.

ఇకపోతే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అంటూ గత కొద్దిరోజుల క్రితం ఈమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక నిన్న సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినటువంటి షర్మిల అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారు అయితే నేడు ఉదయం 10:55 నిమిషాలకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.

ఈ క్రమంలోనే ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత వైఎస్ షర్మిల దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు అనంతరం ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడంతో తన తండ్రి గారు చాలా సంతోషపడతారని ఈమె వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది…

రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ పదవి అప్పగించిన శక్తివంచన లేకుండా పనిచేస్తానని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ.. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. ఇలా ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పడంతో కొందరు వైయస్సార్ అభిమానులు ఈమె వ్యవహరి శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sharmila: అరగంట పాటు జగన్ తో భేటీ అయిన షర్మిల.. రాజకీయ పార్టీలలో మొదలైన చర్చలు?

Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరిగా వయసు షర్మిల అందరికీ ఎంతో సుపరిచితమే అన్న విజయానికి గత ఎన్నికలలో ఎంతో దోహదం చేసినటువంటి షర్మిల గత మూడు సంవత్సరాలుగా తన అన్నయ్యకు దూరంగా ఉంటూ తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీని ఈమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ మూడేళ్ల కాలంలో తన అన్నయ్య పేరు మాట్లాడటానికి కూడా షర్మిల ఇష్టపడలేదు అంతగా వీరిద్దరి మధ్య ఏం మనస్పర్ధలు వచ్చాయనే విషయాలు తెలియకపోయినా జగన్ కి వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేశారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇకపోతే తాజాగా షర్మిల తన అన్నయ్య వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారి అన్నయ్యను కలిశారు తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రికను అందించడం కోసం షర్మిల జగన్మోహన్ రెడ్డిని కలిశారు. షర్మిలతో పాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలాగే అట్లూరి ప్రియ తల్లిదండ్రులు ఉన్నారు.

అందరి ఆశీర్వాదం కావాలి..

జగన్మోహన్ రెడ్డితో షర్మిల దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు ఇలా అరగంట పాటు వీరు మాట్లాడుకోవడంతో రాష్ట్ర రాజకీయ పార్టీలలో పలు చర్చలు మొదలయ్యాయి అసలేం మాట్లాడుకున్నారు అనే విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి ఇక తాడేపల్లి నుంచి బయటకు వచ్చిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు అయితే మీడియా బలవంతం చేయడంతో కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను ఇవ్వడం కోసమే అన్నను కలిశానని తెలిపారు. అన్న సానుకూలంగా స్పందించారు పెళ్లి కదా నా బిడ్డకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కావాలి అంటూ ఈమె చాలా సానుకూలంగా స్పందించినప్పటికీ వీరి భేటీ పై ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Un Stoppable: బాలయ్య షోలో సందడి చేయనున్న షర్మిలా.. ఆహా ప్లాన్ అదిరిందిగా?

Un Stoppable: సినీ నటుడు,తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం మంచి విజయం కావడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం మొదటి సీజన్ కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించి బాలకృష్ణ తనదైన శైలిలో వారిని ప్రశ్నిస్తూ వారితో కలిసి సందడి చేశారు. రెండవ సీజన్ మాత్రం ఇందుకు భిన్నంగా రాజకీయ నాయకులను కూడా ఈ వేదిక పైకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ రావడంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య టాక్ షో కి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా ఈ కార్యక్రమానికి షర్మిల ముఖ్య అతిథిగా రాబోతున్నారని తెలియడంతో ఈ ఎపిసోడ్ పై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో ఎంతవరకు ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Un Stoppable: బాలయ్య తాక్ షో కి షర్మిల ఊకొడతారా..

ప్రస్తుతం షర్మిల తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటూ తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలని గత కొన్ని నెలలుగా షర్మిల ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు బాలయ్య టాక్ షో నుంచి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఒకవేళ ఈమె కనుక ఈ షోకి వస్తే బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు వేస్తారు జగన్ తో తనకు మనస్పర్థలు ఉన్నాయనే వార్తలకు ఈ కార్యక్రమం ద్వారా సమాధానం దొరుకుతుందా..అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఆహా ఏమి ప్లాన్ చేశారు అంటూ నిర్వాహకులపై కామెంట్లు చేస్తున్నారు.

Jr.NTR: నీ కన్నా షర్మిలానే బెటర్.. ఎన్టీఆర్ ట్వీట్ పై ఫైర్ అవుతున్న నందమూరి ఫ్యాన్స్?

Jr.NTR: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరును మార్చాలంటూ నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చారు.

ఈ విధంగా ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడంతో తెలుగుదేశం అభిమానులు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఇద్దరు గొప్ప నాయకులే ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయన స్థాయి తగ్గదు. తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న జ్ఞాపకాలను చెరిపి వేయలేవు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైయస్సార్ ఎన్టీఆర్ ఇద్దరు గొప్ప నాయకులే అంటూ స్వీట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ను వైయస్సార్ తో పోల్చడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాయి ఏంటి వైయస్సార్ స్థాయి ఏంటి?ఇద్దరినీ గొప్పవాళ్ళను పోల్చడంపై నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్నారు.

Jr.NTR: భారీ ట్రోలింగ్ కు గురైన ఎన్టీఆర్…

ఇలా తాత పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం విషయంపై ప్రశ్నించకుండా ఇద్దరు గొప్ప నాయకులే అంటూ ప్రశ్నించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే మరి కొంతమంది నీకన్నా వైయస్ షర్మిలానే బెటర్ ఆమె ఎన్టీఆర్ పేరును తొలగించడం పూర్తిగా తప్పు అంటూ ఎంతో ధైర్యంగా తన అన్నయ్యను నిలదీసింది.మొత్తానికి ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ కారణంగా పెద్ద ఎత్తున నేటిజెన్లు అభిమానుల ట్రోలింగ్ కి గురయ్యారు.