Tag Archives: singer sunitha

Singer sunitha: నా జీవితాన్ని మార్చిన క్షణం అదేనంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సింగర్ సునీత?

Singer sunitha: సింగర్ సునీత పరిచయం అవసరం లేని పేరు ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల ఈమె కుమారుడు ఆకాష్ సర్కారు నౌకరి అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని 2021 జనవరి 9వ తేదీ కొంతమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో రెండవ వివాహం చేసుకున్నారు అయితే ఈమె రెండో వివాహ సమయంలో తన పట్ల పలు విమర్శలు కూడా వచ్చాయి.

ఇక సునీత వాటన్నింటినీ లెక్క చేయకుండా రెండో వివాహం చేసుకొని ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈమె ఇటీవల మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా తన భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మూడో పెళ్లి రోజు..

నా జీవితంలో ఆ క్షణం ఎంతో అద్భుతమైనదని, నా జీవితంలో అవే ఆనంద క్షణాలు అంటూ తన రెండో పెళ్లి గురించి ఈమె సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.రెండో పెళ్లి తర్వాత ఈమె తన జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని పలు సందర్భాలలో తెలియజేసిన సంగతి తెలిసిందే.

Singer Sunitha: నా జీవితంలో ఇదే బెస్ట్ కాంప్లిమెంట్… సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్!

Singer Sunitha: సింగర్ సునీత టాలీవుడ్ ఇండస్ట్రీలో గాయనిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సునీత కుమారుడు ఆకాష్ త్వరలోనే సర్కారు నౌకరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సింగర్ సునీత వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ఎన్నో పాటలు పాడాను ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఎప్పుడు కూడా నేను ఎమోషనల్ కాలేదు కానీ ఇక్కడ మాట్లాడుతుంటే చాలా ఉద్వేగానికి గురి అవుతున్నానని తెలిపారు.

ఒకరోజు రాఘవేందర్ రావు గారు మా అబ్బాయి గురించి నాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.ఆకాష్ గురించి ఆయన మాట్లాడుతూ మీ అబ్బాయి మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం నడవడిక ఉన్నటువంటి అబ్బాయి అని తన కుమారుడి గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

Singer Sunitha: పిల్లల ఎదుగుదలలో కలిగే సంతోషం ఇదే…

ఇదే నా జీవితంలో ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటూ ఈమె ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులకు కలిగే సంతోషం ఇదేనేమో అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు గారి నిర్మాణ సాధ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంటుంది.

Singer Sunitha: రెండవ పెళ్లి చేసుకోవటానికి అసలు కారణం బయటపెట్టిన సింగర్ సునీత..?

Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ సింగర్స్ గా గుర్తింపు పొందిన వారిలో సునీత కూడా ఒకరు. కొన్ని వందలకు పైగా పాటలు పాడి తన మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న సునీత సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న సింగింగ్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది.

ఇలా కెరీర్ పరంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న సునీత వ్యక్తిగత విషయాల వల్ల కొన్ని సందర్భాలలో విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రెండవ వివాహం చేసుకోవడంతో సునీత మీద విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని సునీత రెండవ వివాహం చేసుకోవడంతో కొంతమంది ఆమెను విమర్శిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సునీత చేసిన పనిని సపోర్ట్ చేస్తున్నారు.

సునీత తన మొదటి భర్తకు దూరమైన చాలాకాలం తర్వాత ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సునీత తన పిల్లలు, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆమె గురించి వివిధ రకాలుగా విమర్శిస్తూ ఆమెని బాధపెడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తాను రెండవ వివాహం చేసుకోవడానికి గల కారణాల గురించి వెల్లడించింది.

Singer Sunitha భర్తతో విడిపోయి ఎన్నో కష్టాలు పడ్డాను…

ఈ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ ” నా జీవితంలో జరిగే సంఘటనల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన రూమర్స్ క్రియేట్ చెయ్యడం వల్ల మేము చాలా బాధపడుతున్నాము. నా మొదటి భర్తతో విడిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. ఆ సమయంలో ఒంటరితనం కనిపించలేదు. కానీ ఇప్పుడు నా జీవితం మొత్తం పోయినట్టుగా అనిపించింది, ఆ సమయంలో రామ్ నాకు పరిచయ అయ్యాడు, స్నేహితులం అయ్యాం. పిల్లల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాము ” అంటూ తాను రెండవ పెళ్లి చేసుకోవడానికి గల కారణం గురించి చెప్పుకొచ్చింది .

Singer Sunitha: సింగర్ సునీత రామ్ మధ్య వయసు తేడా ఎంతో తెలుసా… రామ్ వయసులో అంత పెద్దనా?

Singer Sunitha: సింగర్ సునీత పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమంలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత రెండవ వివాహం ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈమె గత రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్నారు.

ఇలా సునీత రెండవ వివాహం చేసుకోబోతోంది అని తెలియడంతో పెద్ద ఎత్తున ఈమె గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఒకప్పుడు ఆమెను విమర్శించిన వారే ఇప్పుడు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తన గురించి విమర్శలను పట్టించుకోకుండా తన జీవితంలో సంతోషంగా ఉండడం కోసం సునీత ముందడుగు వేశారు.

ఇలా సునీత మ్యాంగో మీడియా అధినేతను వివాహం చేసుకోబోతున్నారని విషయం తెలియడంతో అప్పట్లో ఈయన గురించి పెద్ద ఎత్తున అందరూ సర్చ్ చేసారు. అయితే ఈయన డిజిటల్ మీడియాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని ఈయన పేరిట వందల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా మ్యాంగో మీడియా కోసం సునీత ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఆ సమయంలోనే ఇతనితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారిందని తెలుస్తోంది.

Singer Sunitha: ఐదు సంవత్సరాలు పెద్దవారు…


ఇలా ఏర్పడిన పరిచయం స్నేహం చివరికి వీరిద్దరిని పెళ్లి బంధం వైపు అడుగులు వేసేలా చేసింది.ఇక వీరిద్దరి పెళ్లి సమయంలో వీరిద్దరి మధ్య వయస్సు తేడా ఎంత ఉంటుందని ఆరా తీయగా తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం ఏంటో తెలుస్తోంది. రామ్ వీరపనేని మే 26, 1974న జన్మించాడు. సునీత వయసు 42 సంవత్సరాలు. ఇద్దరి మధ్య కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వయసు తేడా ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Singer Sunitha: సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. ప్రాణహాని ఉందని పోలిసులకు ఫిర్యాదు..?

Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత గురించి తెలియని వారంటూ ఉండరు. తన మధురమైన గానంతో పాటలు పాడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న సునీత ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా సునీత భర్త వీరపనేని రామకృష్ణకు ఇటీవల ఫోన్ ద్వారా బెదిరింపులు ఎదురయ్యాయని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.

రామకృష్ణ తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత మొదటి భర్తకు విడాకులు ఇచ్చి చాలా కాలం పిల్లలతో కలిసి జీవించింది. అయితే ఇటీవల పిల్లల సహకారంతో రామ్ వీరపనేనిని రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. అయితే సునీత ఇలా ఈ వయసులో రెండవ వివాహం చేసుకోవడంతో ఇప్పటికీ ఆమె గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

మొదట్లో ఈ విమర్శల గురించి స్పందిస్తూ ఎమోషనల్ సునీత ఇప్పుడు లోకం తీరు తెలిసి ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా వీరపనేని రామకృష్ణ కి గుర్తు తెలియని వ్యక్తి తరచూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను నిర్మాతల మండలి సభ్యుడినని, ముఖ్యమైన విషయాలు చర్చించాలని తరచూ ఫోన్ చేసి విసగిస్తున్నారట.

2

Singer Sunitha: బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రామ్..


లక్ష్మణ్ ఎవరో తనకు తెలియకపోవటంతో రామకృష్ణ అతని ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. దీంతో లక్ష్మణ్ అనే వ్యక్తి ఇతర నెంబర్ నుండి ఫోన్ చేసి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో రామకృష్ణ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Singer Sunitha: ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత… నాకు సంబంధించినది కాదంటూ కామెంట్స్!

Singer Sunitha: సింగర్ సునీత పరిచయం అవసరం లేని పేరు. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో వందల పాటలను ఆలపించి ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్న సునీత కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదులుకోలు ఎదుర్కొన్నారు.

మొదట వివాహం చేసుకున్న ఈమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తరువాత తన భర్తతో విభేదాల కారణంగా విడిపోయారు. ఇలా తన పిల్లల బాగోగులు చూసుకుంటూ ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సునీత తాజాగా తన స్నేహితుడిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా రెండవ వివాహం తర్వాత ఈమె తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే సునీత పెళ్లిచేసుకున్న అనంతరం తరచూ ఈమె ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.సునీత ప్రెగ్నెంట్ అంటూ ఇదివరకు ఎన్నోసార్లు వార్తలు షికారులు చేశాయి. అయితే ఆ వార్తలపై స్పందిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి తన ప్రేగ్నెన్సీ రూమర్ల గురించి ఈమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

Singer Sunitha: వారి ఆలోచనలకే వదిలేస్తున్నా…

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ నేను ప్రెగ్నెంటా? ఈ విషయం నాకు కూడా తెలియదే అంటూ సమాధానం చెప్పారు. ఇలాంటి రూమర్లను పుట్టిస్తున్న వారి ఆలోచనలకే ఈ విషయాన్ని వదిలేస్తున్నాను అంటూ ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ అవన్నీ కేవలం వట్టి రూమర్లు మాత్రమే అంటూ చెప్పేశారు. దీంతో సునీత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Singer Sunitha: ఆయన మరణం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి… సునీత ఎమోషనల్ కామెంట్స్!

Singer Sunitha: సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇలా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి సునీత కెరియర్ ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు ఉన్న విషయం మనకు తెలిసిందే.

మొదటిసారి వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మొదటి భర్త తనని విడిచి వెళ్లడం ఒంటరిగా పిల్లలను పెంచి పెద్ద చేయడం ఈమెకు ఎంతో కష్టతరంగా మారింది. అయితే ఇలా ఈమె కష్టాలు అనుభవిస్తున్న సమయంలో తనకు చేదోడు వాదోడుగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తనకు ఎంతో అండగా నిలిచారని పలుమార్లు సునీత వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సునీత మరోసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుతూ ఆయనని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అని తెలిపారు. ఆయన మరణం నాకు తీరని లోటు.తను మరణించిన తరువాత నా కళ్ళ నుంచి నీళ్లు రావడం ఆగిపోయాయి. అంతకన్నా ఏ సంఘటనలు తనని కదిలించలేకపోయాయని తెలిపారు.

Singer Sunitha: ఆయన చూపించిన మార్గంలో నడవడమే నేను ఇచ్చే గౌరవం…

ఇలా కష్ట సమయాలలో నాకు ఎంతో అండగా నిలిచి ఆయన నాకు ఓ మార్గాన్ని చూపించారు. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకు నేను ఇచ్చే గౌరవం అంటూ ఈ సందర్భంగా సునీత ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సునీత బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Singer Sunitha: వామ్మో సింగర్ సునీత రెండో భర్త రామ్ ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Singer Sunitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె తన అద్భుతమైన గాత్రంతో కొన్ని వందల పాటలను ఆలపించడమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించారు.

19 సంవత్సరాల వయసులోనే సునీత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చి ఒంటరిగా పిల్లలతో జీవితంలో ప్రయాణం చేశారు.ఇలా ఒంటరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్న సునీత 2021 వ సంవత్సరంలో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్నారు.

ఇలా తనని వివాహం చేసుకున్న తర్వాత సునీత తన కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే తాజాగా రామ్ వీరపనేని ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ అసలు పేరు రామకృష్ణ వీరపునేని ఈయన ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకొని ఇక్కడ వ్యాపారాలలో స్థిరపడ్డారు. ఇక ఈయన మ్యాంగో మీడియాకి సీఈవోగా వ్యవహరిస్తూ యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తున్నారు.

Singer Sunitha: రెండు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి…

తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళం హిందీ ఇంగ్లీష్ సినిమాలను డబ్ చేస్తూ యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తూ భారీగా లాభాలను అందుకుంటున్నారు. అదేవిధంగా ఈయన పలు ప్రముఖ కంపెనీలలో వందల కోట్ల షేర్స్ కూడా పెట్టారని సమాచారం. ఇవే కాకుండా హైదరాబాదులో పలు ప్రాంతాలలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నాయని తెలుస్తుంది.తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కొన్ని కోట్లలో ఉండగా ఈయన సంపాదించినది కూడా కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు సమాచారం. రెండు తరాల వారు కూర్చుని తిన్న తరగని ఆస్తిని రామ్ సంపాదించినట్టు తెలుస్తుంది.

Singer Sunitha: స్టార్ హీరోకి అక్కగా వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న సింగర్ సునీత!

Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి అందరికీ సుపరిచితమే ఈమె తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సునీత తనలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఈమె నటించబోతుందని, ఈ సినిమా ద్వారా ఈమె వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర చాలా కీలకంగా ఉండడంతో త్రివిక్రమ్ సునీతను సంప్రదించారని, సునీతకు కూడా ఆ పాత్ర నచ్చడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సునీత వెండితెర ఎంట్రీ ఇవ్వబోతుందని తెలియడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Singer Sunitha: SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్….

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కృష్ణ ఇందిరా దేవి మరణించడంతో ఈ షూటింగ్ కొన్ని రోజులపాటు వాయిదా పడి తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించబోతున్నారు.

Gulabi Movie: 27 ఏళ్లు పూర్తి చేసుకున్న గులాబీ… సింగర్ సునీత కెరియర్ ను మార్చేసిన గులాబీ!

Gulabi Movie: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇలా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం గులాబీ.కృష్ణవంశీ రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఆయనలో ఉన్న టాలెంట్ గుర్తించిన వర్మ తన సొంత బ్యానర్ లోనే కృష్ణవంశీ ఫస్ట్ సినిమాని నిర్మిస్తానని మాట ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారమే వర్మ బ్యానర్ లో కృష్ణవంశీ దర్శకుడిగా తన డెబ్యూ మూవీ గులాబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జెడి చక్రవర్తి మహేశ్వరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ సస్పెన్షన్ చిత్రం గులాబీ అప్పట్లో సెన్సేషనల్ అయింది. 1995 నవంబర్ మూడవ తేదీ ఈ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన రికార్డులను సృష్టించింది.

ఈ సినిమా 2022 నవంబర్ మూడవ తేదీకి 27 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం విశేషం.ఇక ఈ సినిమా హిట్ అవడంతో ఒకవైపు దర్శకుడికి అలాగే నటీనటులకు ఇతర టెక్నీషియన్లకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్, సింగర్ సునీత. ఈ సినిమాలో సునీత పాడినటువంటి మొట్టమొదటి పాట ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది.

Gulabi Movie: సునీత జీవితాన్ని మార్చేసిన గులాబీ..

ఈ పాట ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి సునీత మొదటి పాటతోనే అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడంతో ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇలా సునీత జీవితాన్ని మార్చేసిన సినిమా గులాబీ అని చెప్పాలి. ఇప్పటికీ ఈ పాట ఎంతోమందికి ఫేవరెట్ సాంగ్ గా మిగిలిపోయింది. గులాబీ సినిమా ద్వారా ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లు అందరూ కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నారు.