Tag Archives: smart phone

సార్.. మా తమ్ముడి ఫోన్ పేలింది.. ఏం చేయమంటారు..?

భారతదేశంలో కొన్నాళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌ లు పేలుతున్నాయి. Vivo, OnePlus స్మార్ట్ 5 జీ ఫోన్లు పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పడు ఆ జాబితా Poco పేరు కూడా చేరింది. మహేష్ అనే వినియోగదారుడు పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ 5జీ పేలిందని.. దానికి సంబంధించి బ్యాక్ ప్యానెల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీనిపై అతడి సోదరుడు స్పందిస్తూ.. తన తమ్ముడు ఫోన్ Poco M3 బ్లాస్ట్ అయిందని అతను ట్విట్టర్ లో రాశాడు. ఫోన్‌లో పేలడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం స్పష్టంగా తెలపలేదు. దీనిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహేష్ ఈ ట్వీట్ చేశాడు.

అయితే ఈ ట్వీట్‌ చేసిన కొన్ని నిమిషాలకే అతడు తొలగించాడు. కానీ అప్పటికే అది ఎక్కువగా షేర్ చేయబడింది. దానికి సంబంధించి స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నవంబర్ 27 మధ్యాహ్నం 12:33 గంటలకు మహేష్ ఈ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ 91మొబైల్స్ ద్వారా షేర్ చేయబడింది. అయితే అప్పటికే పోకో ఫోన్‌ పేలింది అంటూ సౌరబ్‌ హతి అనే ట్విట్టర్‌ యూజర్‌ మహేష్‌ ట్వీట్‌ను షేర్‌ చేశారు.

సౌరబ్‌ హతి ట్వీట్‌పై పోకో ప్రతినిధులు స్పందించారు. భారతదేశంలో కస్టమర్ల భద్రత కంపెనీకి అత్యంత ముఖ్యమైన విషయం. ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుంటాం. కారణాన్ని తెలుసుకోవడానికి మా బృందం దీనిని పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపెడతామన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్మార్ట్ ఫోన్ చార్జింగ్ చేసే విషయంలో మీరు ఈ తప్పులు చేయకండి.. లేదంటే..

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది. అయితే చాలామంది చార్జింగ్ పెట్టే విధానంలో చాలా తప్పులు చేస్తున్నారు. దీంతో బ్యాటరీ లైఫ్ త్వరగా అయిపోతుంటుంది. తర్వాత చార్జింగ్ ఆగడం లేదంటూ లబోదిబోమంటుంటారు. అలా కాకుండా మొదటి నుంచే మనం దీనిపై జాగ్రత్తగా ఉంటే ఆ సమస్య నుంచి ఎంచక్కా బయటపడొచ్చు. స్మార్ట్ ఫోన్ ను ఇష్టారీతిగా ఛార్జింగ్ చేస్తే త్వరగా పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ చార్జింగ్ పూర్తిగా అయిపోక ముందే చాలామంది చార్జింగ్ పెడుతుంటారు. అలా చేయకూడదు. ఇది ఫోన్ మన్నికపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా 100 శాతం వరకు కూడా చార్జింగ్ అస్సలు చేయకూడదు. రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసేవారు కూడా ఉంటారు.

ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 80 నుంచి 90 శాతం వరకు చార్జింగ్ పెడితే చాలు అంటున్నారు నిపుణులు. రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతే.. ఆఫోన్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ పనులు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు.. 90 శాంత వరకు చర్జింగ్ పెడితే బ్యాటరీ లైఫ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడటం.. ఫోన్లోని పాటలను వినడం.. బ్రౌజ్ చేయడం లాంటివి చేస్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ నెట్ ఉపయోగించే క్రమంలో కూడా చార్జింగ్ బాగా అయిపోతూ ఉంటుంది.. దీనికి సెట్టింగ్ లోకి వెళ్లి ఉపయోగం లేని యాప్స్ ను ఇన్ యాక్టివ్ చేస్తే సరిపోతుంది. చార్జింగ్ మరి కొంత సేపు ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆఫర్ ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.. ఎలానో తెలుసుకోండి?

ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్లధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులకు ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇది వరకు ఈ ఆఫర్ మే 31 వరకు ఉండగా తాజాగా ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.

పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి 800 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయలు ఉండడంతో ఈ ఆఫర్ ద్వారా మనము ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందగలుగుతాము. అయితే ఈ ఆఫర్ పొందాలనుకునే వారు తప్పకుండా వారి ఫోన్ లో పేటీఎం యాప్ ఉండాలి.

ముందుగా మన స్మార్ట్ ఫోన్ లో పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసుకుని”బుక్ గ్యాస్ సిలిండర్” సెక్షన్ కు వెళ్లి తమ డీలర్ షిప్ ఎంచుకోవాలి. ఈ క్రమంలోనే భారత్ గ్యాస్, హెచ్ పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం గ్యాస్ సిలిండర్ కంపెనీ ఎంచుకున్న తర్వాత గ్యాస్ ప్రొవైడర్ వివరాలు, కన్జ్యూమర్ ఐడి, ఫోన్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేసి బుకింగ్ ప్రారంభం చేయాలి. ఈ విధంగా పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి గ్యాస్ మనకు డెలివరీ అయ్యేలోగా ఎనిమిది వందల రూపాయల క్యాష్ బ్యాక్ అమౌంట్ పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోండి.

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే శుభవార్త మీకోసమే!

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వినియోగదారులకు శుభవార్త ను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) మంగళవారం టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగానే 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించుకోవచ్చని టెలికం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు 5జీ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకుగాను డాట్ అనుమతులను కూడా జారీ చేసింది. ఈ టెలికం సంస్థలన్ని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, టెక్నాలజీ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకొని 5జీ ట్రయల్స్ నిర్వహిస్తాయి.

ఇందులో భాగంగా ఎయిర్టెల్,రిలయన్స్ జియో, వోడాఫోన్ వంటి కంపెనీలు నోకియా ఎరిక్‌సన్, శాంసంగ్, సీడాట్ వంటి సంస్థలతో జత కట్టి 5జీ ట్రయల్స్ నిర్వహిస్తాయి. ఇందుకు గాను ఈ టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల వరకు గడువు ఇచ్చింది.

ఈ ట్రయల్స్ కోసం రెండు నెలల కాలం పాటు ఉపకరణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ ట్రైలర్స్ లో భాగంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు,పాక్షిక పట్టణాలు వంటి ప్రదేశాలలో ఈ ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది. దీని ద్వారా ప్రతి ప్రాంతంలోనూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.5జీ సేవలు అందుబాటులోకి వస్తే డౌన్లోడ్ స్పీడ్ పది రెట్లు పెరుగుతుందని చెప్పవచ్చు.

దేశంలో అత్యంత చౌకైన 5జీ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికంగా ఉండడంతో కొత్త టెక్నాలజీతో ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వాటి ధరలు కూడా అధికంగా ఉన్నాయి. కానీ రియల్ మీ నార్జో 30 ప్రో 5 జీ ఫోన్లను కంపెనీ అత్యంత చౌకైన ధరలకు అందించనుంది.ఫ్లిప్ కార్ట్ కార్నివాల్ సేల్‌లో ఈ ఫోన్ల ధరలను తగ్గించారు. మనదేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. అయితే ప్రస్తుతం ఈ ఫోన్లో పై మరింత తగ్గింపు లభిస్తుంది. మరింత ధరలు తగ్గించడంతో ప్రస్తుతం ఈ ఫోన్ రూ.15,999కే అందుబాటులో ఉండనుంది. 

ఈ ఫోన్లో రెండు వేరియంట్ లు ఉన్నాయి.6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండగా ప్రస్తుతం ఈ సేల్స్ లో ఈ ఫోన్ ధర రూ.15,999లకే అందిస్తోంది. అదేవిధంగా మరొక వేరియంట్8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సేల్స్ లో 18,999 రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లలో
స్వార్డ్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్ కలర్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది.ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. ఇక కెమెరాల విషయానికొస్తే మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 48 మెగా పిక్సెల్ కాగా,8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఫ్రెండ్ కెమెరా కూడా 16 మెగా పిక్సల్ లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మందం 0. 91 సెం.మీ, బరువు 194 రాములు గా ఉంటుంది

స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా.. ఆ సమస్యలు గ్యారంటీ..?

దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. పల్లెల నుంచి పట్టాణాల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వెలుగులోకి వచ్చింది.

ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తే కంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ బ్రైట్ నెస్ మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా ఎంత అవసరమో అంతే ఉంచుకోవాలని బ్రైట్ నెస్ పెరిగినా తగ్గినా కళ్లకు ముప్పేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలామంది రాత్రి పడుకునే సమయంలో స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తారని ఆ సమయంలో మొబైల్ ఫోన్ ను వినియోగించడం మంచిది కాదని అలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

స్మార్త్ ఫోన్ నుంచి వచ్చే లైటింగ్ రెటీనాపై ప్రభావం చూపుతుందని.. తరచూ రాత్రి సమయంలో మొబైల్ ఫోన్లను వినియోగించే వాళ్లలో కళ్లలోని రెటీనా నెమ్మదిగా దెబ్బ తిని కంటిచూపు మందగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగించే వాళ్లు కళ్లలో మంట, దురద సమస్యతో బాధ పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

స్మార్ట్ ఫోన్ల వినియోగం శరీరంలోని లాక్రిమల్ గ్రంథిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అందువల్ల స్మార్ట్ ఫోన్లను అవసరం మేరకు మాత్రమే వినియోగించాలని రాత్రి సమయంలో అస్సలు వినియోగించవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల కంటి సంబంధిత సమస్యలు వస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?

ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించి వస్తువులను కొనుగోలు చేయలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ లో ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల కొడుకు ఆన్ లైన్ చదువుల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో ఒక తల్లి కొడుకుకు సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొనిచ్చింది.

అయితే ఆ మహిళ కొనుగోలు చేసిన ఫోన్ ఎవరో దొంగతనం చేసిన ఫోన్ కావడంతో మహిళ ఒక రోజంతా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ మహిళ తాను డబ్బు చెల్లించి సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొనిందని చెప్పిన మాటలు నిజమేనని తెలియడంతో పోలీసులు ఆ మహిళను వదిలేశారు. మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బోరివ్లీలో నివశించే స్వాతి అనే మహిళ కుమారుని చదువుల కోసం రూ. 6 వేలు పెట్టి మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసింది.

ఆ తరువాత ఫోన్ లో కొన్ని సమస్యలు రావడంతో 1,500 రూపాయలు ఖర్చు చేసి స్వాతి ఫోన్ ను రిపేర్ చేయించింది. అయితే పోలీసులు ఆ ఫోన్ దొంగలించిన ఫోన్ కావడంతో స్వాతిని అరెస్ట్ చేశారు. ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో మహిళను ఫోన్ గురించి విచారించగా ఆ మహిళ తప్పేం లేదని తేలింది. స్వాతి మూడు నెలల కష్టపడి దాచుకున్న డబ్బుతో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసింది.

చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే కుమారుడి చదువులు సైతం ఆగిపోయే పరిస్థితి నెలకొంది. స్వాతి తాను పని చేస్తున్న ఇంటి యజమానితో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొని మోసపోతానని తన బాధను మొత్తం చెప్పగా ఇంటి యజమాని పోలీసులకు ఆ విషయాలను షేర్ చేశాడు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఆమె కుమారుడి చదువు కోసం మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఫోన్లు కొనుగోలు చేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఏ తప్పు చేయకపోయినా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త.. లోన్ ఇస్తున్న ఎయిర్‌టెల్!

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే నేటికీ కొన్ని కారణాల వల్ల చాలామంది స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే అలాంటి వారికి దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ శుభవార్త చెప్పింది. జీరో కాస్ట్ లోన్ పేరుతో ఎయిర్ టెల్ 2జీ వినియోగదారులు స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి లోన్ ఇస్తోంది. ఐడీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎయిర్ టెల్ వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది.

ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ కొనాలకునేవారికి ఇచ్చే ఫోన్ ధర 6,800 రూపాయలు కాగా బ్యాంక్ డౌన్ పేమెంట్ 3,259 రూపాయలు లోన్ గా పొందవచ్చు. ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు 603 రూపాయలు ఈఎంఐ రూపంలో నెలనెలా చెల్లించాలి. ఈఎంఐ కాలపరిమితి పది నెలలు కాగా వినియోగదారుని మొబైల్ టారిఫ్ ప్లాన్ ను కూడా ఎయిర్ టెల్ ఇందులోనే కట్ చేసుకుంటుంది. మొబైల్ తీసుకున్న రోజు నుంచి పది నెలలు కస్టమర్లు రీఛార్జి చేయించుకోవాల్సిన అవసరం లేదు.

మొత్తంగా వినియోగదారుడు ఫోన్ కోసం 9,289 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్ కాస్ట్ తో పోలిస్తే తక్కువ ధరకే మొబైల్ ను అందిస్తున్నామని.. ఈ మొబైల్ వల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఎయిర్ టెల్ చెబుతోంది. కేవలం 2 నెలలు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. మరోవైపు ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్‌ను 200కు పైగా డివైజ్ లను అందిస్తోంది.

వినియోగదారులు సిగ్నల్ సమస్యలు ఏర్పడితే వైఫై ద్వారా వాయిస్ కాల్స్ ను మాట్లాడుకోవచ్చని ఎయిర్ టెల్ చెబుతోంది. నెట్వర్క్ సరిగ్గా లేని ప్రాంతాలలో సులభంగా వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.