Tag Archives: sn ntr

Sr.NTR: ఒక హైదరాబాదులోనే కోట్లు విలువ చేస్తే ఆస్తులను కలిగి ఉన్న ఎన్టీఆర్.. ఎన్ని కోట్లో తెలుసా?

Sr.NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలనాటి నటుడు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్రలలోనైనా ఎంతో అవలీలగా నటిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన మద్రాస్ లో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ భారీగా ఆస్తులను పోగు చేశారు.

Sr.NTR: ఒక హైదరాబాదులోనే కోట్లు విలువ చేస్తే ఆస్తులను కలిగి ఉన్న ఎన్టీఆర్.. ఎన్ని కోట్లో తెలుసా?

ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా ఈయన సంపాదించినది మొత్తం ఆస్తులను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈయన ఆస్తిపాస్తులు కొన్ని వందల కోట్లు విలువ చేస్తాయని చెప్పాలి. ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా రామకృష్ణ థియేటర్ ప్రారంభించారు. ఈ థియేటర్ ప్రారంభించిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను ఆయన కొనుగోలు చేసి ఏకంగా ఎన్టీఆర్ ఎస్టేట్ అనే పేరు పెట్టారు.

Sr.NTR: ఒక హైదరాబాదులోనే కోట్లు విలువ చేస్తే ఆస్తులను కలిగి ఉన్న ఎన్టీఆర్.. ఎన్ని కోట్లో తెలుసా?

అలాగే ఇందులో ఎన్టీఆర్ ఇల్లు, ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఎన్టీఆర్ రామకృష్ణ థియేటర్ ప్రారంభించిన తర్వాత ప్రతి జిల్లాలోని ఒక థియేటర్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమయానికి ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడంతో థియేటర్ నిర్మాణం కుదరలేదు.మాసబ్ ట్యాంక్ లో గుట్టపై నిర్మించిన ఐదు ఇండిపెండెంట్ బిల్డింగ్స్ కట్టించి తన ఐదుగురు కొడుకులకు ఇచ్చారు.

100 కోట్ల విలువచేసే ఆస్తులను కొన్న ఎన్టీఆర్..

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్న ఇంటిని తన పెద్ద కూతురు పేరుపై రాసిన ఈ ఇంటిని ఎన్టీఆర్ అనంతరం లక్ష్మీ పార్వతీ పేరుపై రాశారు. గండిపేట ఆశ్రమం, తెలుగు విజయం భూములను కొనుగోలు చేశాడు. నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో ఇలా ఎన్టీఆర్ ఎంతో విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు అయితే ఈయన సంపాదించినది మొత్తం 1982 లో తన పిల్లలకు పంపకాలు చేశారు.ఈ విధంగా ఎన్టీఆర్ హైదరాబాదులో కొనుగోలు చేస్తున్న ఆస్తిపాస్తులు కొన్ని వందల కోట్లలో ఉంటాయి.

Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!

Prudhvi Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈయనకు ఖడ్గం సినిమాలో ఈ డైలాగు ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి పలు సినిమాలలో నటించిన పృధ్విరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!

ఈ క్రమంలోనే 2019 ఎన్నికల సమయంలో పృథ్విరాజ్ వైసీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఈయన పడిన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ చైర్మన్ పదవి ఇచ్చారు.ఇలా చైర్మన్ గా కొనసాగుతున్న ఈయన మహిళల పట్ల లైంగిక ఆరోపణలు రావడంతో ఈ పదవి నుంచి తొలగించారు.

Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!

ఇక రాజకీయాలలో అధికారంలోకి వచ్చిన ఈయన ఏకంగా ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో పలువురు నటీనటుల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ విధంగా పృథ్వి రాజ్ పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి వంటి హీరోల పై కూడా ఆరోపణలు చేశారు.
పృథ్వీరాజు నోటిదూల కారణంగా ఈయన చైర్మన్ పదవిని కోల్పోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను కోల్పోయారు.

కర్ణుడు పాత్రలో నటించిన పృథ్వి రాజ్ తండ్రి…

ఇదే విషయాన్ని పృథ్వీరాజ్ పొరపాటుగా మాట్లాడానని సినీ పెద్దలకు క్షమాపణలు చెబుతూ తిరిగి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను వైసిపి అనే ఉగ్రవాద సంస్థలో ఉండి ఒక ఉగ్రవాదిగా మాట్లాడాను అంటూ ఏకంగా పార్టీపై ఆరోపణలు చేయడమే కాకుండా, తన కుటుంబ విషయాల గురించి కూడా తెలిపారు. తన తండ్రి సుబ్బారావు సీనియర్ ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణవతారం సినిమాలో కర్ణుడి పాత్రలో నటించారని, ఆయన సుమారు 17 సినిమాల వరకు నటించారని ఈ సందర్భంగా తెలిపారు.

NTR: లక్షీపార్వతి కంటే ముందు… ఎన్టీఆర్ ఏ హీరోయిన్ ని పెళ్ళి చేసుకుందాం అనుకున్నారో తెలుసా?

NTR: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..యావత్ దేశం మొత్తం మీద సీనియర్ నందమూరి తారకరామారావు అంటే తెలియని వారుండరు. సొంతంగా తెలుగు దేశం పార్టీ పెట్టి.. ఒక్క కళాకారుడు అనుకుంటే ఏదైనా సాధించలగలడు అని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయి నిరూపించాడు.

NTR: ఎన్టీఆర్ రెండో పెళ్లి లక్షీపార్వతితో కాకుండా.. ఆ హీరోయిన్ తో అనకున్నారట.. కానీ..!

ఇక అతడి మొదటి భార్య బసవతారకం క్యాన్సర్ కారణంగా కన్ను మూసిన విషయం తెలిసిందే. రెండో పెళ్లి అతడు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడని చాలామందికి తెలుసు. కానీ లక్ష్మీ పార్వతి కంటే ముందు అతడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడట.

NTR: ఎన్టీఆర్ రెండో పెళ్లి లక్షీపార్వతితో కాకుండా.. ఆ హీరోయిన్ తో అనకున్నారట.. కానీ..!

అప్పట్లో ఎన్టీఆర్ కు ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా.. హీరోయిన్లు అతడికి కాల్ షీట్లు ఇచ్చేవారు కాదట. ఏఎన్నాఆర్ హీరోయిన్ల నుంచి సంవత్సరం వరకు కాల్ షీట్లను బుక్ చేసుకునే వాడట. దీంతో అతడికి అవకాశం లేకుండా పోయేదట. అయితే ఈ మధ్యలో రామారావు కృష్ణకుమారి అనే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకొచ్చాడు. ఆమె ఎక్కువగా ఎన్టీఆర్ తోనే సినిమాలు తీసింది. ఎన్టీఆర్ తో మాత్రమే నటించేందకు ఎక్కువగా మొగ్గు చూపేదట. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోవడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన చిన్నాయనకు చెప్పాడు. ఈ పెళ్లి వేడుకకు రావాలంటూ అతడి చిన్నానయనకు కబురు పంపారు.

ఎన్టీఆర్ కు రెండో పెళ్లి ఏంటి అంటూ ప్రశ్నించాడట..

అయితే అతడు నేరుగా తన బైక్ వేసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు ఎన్టీఆర్ చిన్నాయన. తన వెంట ఉన్న తుపాకీతో బెదిరించాడట. రాముడిలా భావించే ఎన్టీఆర్ కు రెండో పెళ్లి ఏంటి అంటూ ప్రశ్నించాడట. దీంతో ఆమె అక్కడ నుంచి దూరంగా.. కనపడకుంటా బెంగళూరు వెళ్లిపోయిందట. ఇలా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన చిన్నానయన.. ఇప్పటికే 11 మంది పిల్లలు ఉన్న నీకు మళ్లీ పెళ్లి ఎందుకు అని సర్ది చెప్పాడట. ఇదంతా తెలుసుకున్న ఎన్టీఆర్ ఆమె ఎంత బాధపడిందో అని.. తనలో తాను మదనపడ్డాడట.

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కారుకు పెద్దపులి ఎదురైతే… ఎన్టీఆర్ స్పందన ఎలా ఉందో తెలుసా?

Sr.NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో అద్భుతంగా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన నటుడిగా అందరికీ సుపరిచితమే. సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన దేవత సినిమా అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుందని ఆ సంఘటన గురించి తాజాగా బయటపడింది.

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కారుకు పెద్దపులి ఎదురైతే… ఎన్టీఆర్ స్పందన ఎలా ఉందో తెలుసా?

ఈ సినిమాలోని  “కన్నుల్లో మిసమిసలు”అనే పాటను చిత్రీకరించడం కోసం చిత్రబృందం సాతనూరుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తారక రామారావు పద్మనాభం ఒక కారులో రాత్రి 9 గంటలకు మద్రాసు నుంచి బయలుదేరారు. తిరువణ్ణామలై మీదుగా సాతనూరు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తనకు నిద్ర వస్తుందని తిరువణ్ణామలై రాగానే తన నిద్ర లేపమని చెప్పి వెనుక సీట్ లో పడుకున్నారు.

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కారుకు పెద్దపులి ఎదురైతే… ఎన్టీఆర్ స్పందన ఎలా ఉందో తెలుసా?

ఈ విధంగా తిరువణ్ణామలై రాగానే పద్మనాభం ఎన్టీఆర్ ను నిద్ర లేపితే ఎన్టీఆర్ కారు దిగి కాసేపలా తిరిగిన తర్వాత వెళ్దాం పదండి బ్రదర్ అంటూ సాతనూరుకి తిరిగి వెళ్లారని తెలిపారు.ఇలా కారులో వెళ్తున్న సమయంలో పద్మనాభం మాట్లాడుతూ అన్నగారు మీరు నిద్రపోతున్న సమయంలో ఒక సంఘటన చోటుచేసుకుంది ఆవిషయం నీకు చెప్పాలి అంటూ తెలియజేశారు.

వెనక సింహం పడుకొని ఉంది..

ఈ మాట విన్న ఎన్టీఆర్ ఏం జరిగింది బ్రదర్ అని అడగగా మీరు నిద్రపోతున్న సమయంలో చెంగల్పట్టు వద్దకు వెళ్లగానే ఒక పెద్ద పులి కారుకు ఎదురుగా వచ్చిందని తెలిపారు. ఈ మాట విన్న ఎన్టీఆర్ అరెరే… నన్ను నిద్ర లేపాల్సింది బ్రదర్ పులి ఎదురు రావడం శుభశకునం అని అన్నారు.మీరు నిద్ర లేపవద్దు అని చెప్పడంతో లేప లేదని ఆ పులి ఎదురుగా వస్తుంటే డ్రైవర్ గజగజ వణికి పోయారని నేను కూడా పైకి గంభీరంగా కనిపిస్తుంది లోపల వణుకు పుట్టిందని పద్మనాభం తెలిపారు. ఆయన ఎదురుగా పులి వస్తే మాకేం భయం లేదు మా వెనక సింహం నిద్రపోతుంది అనే ధైర్యం ఉంది అంటూ పద్మ నాభం చెప్పడంతో వెంటనే ఎన్టీఆర్ వెరీ గుడ్ బ్రదర్ అంటూ భుజం మీద చేయి వేసి తట్టారని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

నటరత్న ఎన్టీఆర్ 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురం సినిమా గురించి ఆసక్తికర విషయాలు…!

చిత్ర నిర్మాణ సంస్థల్లో నటరత్న ఎన్టీఆర్ కు చెందిన NAT కి విశిష్ట స్థానం ఉంది. సామాజిక స్పృహ కలిగిన సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక, జానపద, భక్తిరస చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. ఉమ్మడి కుటుంబ చిత్రాలు దాదాపు ఈ సంస్థ మీదే వచ్చాయి.

ఇకపోతే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం తర్వాత సంస్థ పేరును రామకృష్ణ NAT గా మార్చారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ 200 వ చిత్రం కోడలు దిద్దిన కాపురం ను ఎన్టీఆర్ ఎస్టేట్స్ పేరు మీద నిర్మించారు. ఈ సినిమాలో కథ మొత్తం పెద్ద కోడలు చుట్టే తిరుగుతుంది. ఆ సమయంలోనూ ఎన్టీఆర్ ఇది తన 200వ చిత్రం కాబట్టి తనకు ఇంపార్టెన్స్ ఉండాలని ఏమాత్రం పట్టు పట్టలేదు. కథ ముఖ్యం గానీ ఇంకేమీ ముఖ్యం కాదని ఆయన అన్నారట. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ఎన్టీఆరే రాశారు.

ఇక ఈ సినిమా మొదటి కాపీ వచ్చాక దాన్ని సెన్సార్ కి పంపించారు. ఈ సినిమాలో సత్యనారాయణ పోషించిన దొంగ బాబా గెటప్ భగవాన్ సత్యసాయి బాబాను పోలి ఉండడం కొందరు సెన్సార్ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలని వారు పట్టు పట్టారు. దాని మీద వాదోపవాదాలు కూడా జరిగాయి. ఐనా కూడా లాభం లేకపోవడంతో బొంబాయిలో సెంట్రల్ సెన్సార్ ఆఫీస్ కి వెళ్ళారు. అక్కడ క్లియరెన్స్ లభించడంతో అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేశారు ఎన్టీఆర్. వినోదాత్మక కథతో తీసిన కోడలు దిద్దిన కాపురం సినిమా సూపర్ హిట్ అయింది. 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఎక్కువ రోజులు ఆడడమే కాకుండా ఉత్తమ చిత్రంగా బంగారు నందిని కూడా సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ తన కొడుకు కోసం మా నాన్నను తీసేశారు.. అందుకే ప్రొడక్షన్ హౌస్ పెట్టా!

ఇండస్ట్రీలో కేవలం కొందరికి మాత్రమే మనుగడ ఉండాలని చాలా మంది వారికి పోటీగా ఎవరైనా వస్తున్నారంటే నిర్మొహమాటంగా వారికి అవకాశాలు లేకుండా ఎన్నోవారికి పోటీగా ఎవరైనా వస్తున్నారంటే నిర్మొహమాటంగా వారికి అవకాశాలు లేకుండా ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు అన్న సంగతి మనకు వినబడుతూనే ఉంటుంది.

ఈ సందర్భంగా మాదాల రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలిపారు. నిజం చెప్పాలంటే నాన్న గారు మాదాల రంగారావుకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని మాదాల రవి చెప్పారు. దానవీరశూర కర్ణలో ఆయన్ని మొదట అర్జునుడుగా సెలెక్ట్ చేశారని, దాని కోసం ఏం చేయకుండా 6,7 నెలలు వారితోనే ట్రావెల్ అయ్యారని ఆయన చెప్పారు.

ఆ తర్వాత షూట్ ప్రారంభం కావడం జరిగిందని ఆయన తెలిపారు. మామూలుగా అయితే ఎన్టీ రామారావు తన గాండీవం ఎవరికీ ఇవ్వరు. కేవలం నాన్న గారిపై ఉన్న ఇష్టంతోనే వారికి ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఎన్టీ రామారావు తండ్రి గారికి అబ్బాయిని అర్జునుడుగా చూడాలని ఇష్టం. ఆయన ఒత్తిడి తట్టుకోలేక నాన్న గారిని మధ్యలోనే ఆ సినిమా నుంచి తీసివేయడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తర్వాత నాన్న గారు కూడా కొంచెం ఏదోలా ఫీల్ అయ్యారని ఆయన తెలిపారు. ఇలా జరిగిన ఒక సంవత్సరం వరకు కూడా ఎవరూ సినిమా ఇవ్వడానికి ముందుకు రాలేదని మాదాల రవి చెప్పారు. అప్పుడు సొంత బ్యానర్ మొదలు పెట్టడం జరిగిందని ఆయన వివరించారు.

అన్నగారి తర్వాత టిడిపి పగ్గాలు చంద్రబాబుకి ఎందుకిచ్చావ్.. మోహన్ బాబు ప్రశ్నకు బాలయ్య సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహా యాప్ ద్వారా ప్రసారమౌతున్న “అన్ స్టాపబుల్” అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు వచ్చారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ టాక్ షో కి సంబంధించిన ప్రీమియర్స్ ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ మోహన్ బాబును ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అయితే మోహన్ బాబు కూడా బాలకృష్ణను ఒక ప్రశ్న అడిగారు. అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన వారసుడిగా అతని మరణం తర్వాత పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్న విన్న బాలకృష్ణ తనదైన శైలిలో మోహన్ బాబుకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సమాధానం చెబుతూ..మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకు అతీతంగా అలాంటిది పెద్దాయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు మేము తీసుకుంటే దానికి అర్థం ఉండదని ఈ సందర్భంగా బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఇక చంద్రబాబుకి పార్టీ పగ్గాలు ఎందుకు ఇచ్చారనే విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట పడే వ్యక్తిత్వం కలవారు. గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుంచి అన్ని చూసి వచ్చిన మనిషి చంద్రబాబు అంటూ బాలకృష్ణ మోహన్ బాబు ప్రశ్నకు ఇలా సమాధానం తెలియజేశారు.