Tag Archives: Ycp

Mohan Babu: రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు.. ఆ నియోజకవర్గ నుంచి పోటీ!

Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోయారు. గతంలో దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఈయన అహర్నిశలు కృషి చేస్తూ పార్టీకి తన సేవలను అందించారు.

ఈయన సేవలను గుర్తించిన అధిష్టానం ఈయనని ఏకంగా రాజ్యసభ సభ్యునిగా గెలిపించారు. అన్నగారి మరణం అనంతరం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసుకోవడంతో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో ఈయనతో బంధుత్వం ఏర్పడటమే కాకుండా వైయస్సార్ కి మద్దతుగా నిలబడ్డారు.

ఇక ప్రస్తుతం జగన్ స్థాపించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపిన మోహన్ బాబు గత కొద్దిరోజులుగా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఈయన తిరిగి రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నారని, తిరిగి తెలుగుదేశం పార్టీకి తన మద్దతు తెలిపే సూచనలు ఉన్నాయంటూ పలువురు భావిస్తున్నారు. తిరుపతి సమీపంలో మోహన్ బాబు నిర్మించిన సాయిబాబా ఆలయ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోహన్ బాబు కలిశారు.

Mohan Babu: జగన్ పై అసంతృప్తి కారణమా…

ఇలా వీరిద్దరి భేటీ కన్నా ముందుగా మోహన్ బాబు టిడిపి నేతలతో కలిసి మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టిడిపి పార్టీ తరపున మోహన్ బాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై ఈయన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వైయస్ జగన్ వ్యవహరి శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఈయన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వానికి షాక్.. 13 మంది వైసీపీ సర్పంచ్ లు రాజీనామా..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేసుకుంటూ.. ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పలు సంక్షేమ పథకాలతో పాటు.. ప్రతీ గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం చూపుతూ పాలన సాగిస్తున్నారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం.. ఆ ఫలితాన్ని ఇటీవల జరిగిన 13 మున్సిపల్ ఎన్నికల్లో చూశారు.

ఒక్క మున్సిపాలిటీ తప్ప అన్నీ కైవసం చేసుకున్నారు. ఈ ఘనత అంత ప్రజలదే అని.. వాళ్లు తమకు 100 కు 97 మార్కులు ఇచ్చారని.. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. కడప జిల్లాలోని వైసీపీ సర్పంచ్ లు మూక్కుముడిగా రాజీనామా చేశారు. ఇది ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మరింది.

మంచి జోష్ లో ఉండి.. ముందుకు దూసుకపోతున్న వైసీపీకి ఇది పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. అసలెందుకు వాళ్లు ఈ పిని చేశాడు.. అసలేమైందంటే.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో 13 మంది వైసీపీ సర్పంచులు ఒకేసారి రాజీనామా చేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని.. చేతి నుంచి డబ్బులను పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని అన్నారు. ఇంకా చాలామంది రాజీనామాలకు సిద్ధ పడ్డారని.. ప్రభుత్వంపై రాజీలేని పోరాటానికి తాము సిద్ధం అంటూ తెలిపారు.

అప్పు చెయొద్దు అంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లా?_ రఘురామ రాజు

జగనన్న విద్యా పథకం కాకుండా టీచర్ల కొరత పై దృష్టి పెట్టాలన్నారు ఎంపీ రఘురామ రాజు.
ఏపీలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది అని గుర్తు చేశారు. పాఠశాల పున ప్రారంభం పై సీఎం జగన్ మరోసారి పునరాలోచించాలని తెలిపారు. పథకాలకు సీఎం సొంత పేరు పెట్టుకుంటే ప్రజలకు ఏహ్యభావం కలుగుతుందని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయంపై ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలని సూచించారు.

కాగా రాష్ట్రంలో మద్యపాననిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలన్నారు రఘురామ.
అప్పులిస్తున్న బ్యాంకర్లకు బుద్ధి లేదా అని మండి పడ్డారు. రాష్ట్రం అధోగతిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెయ్యొద్దని చెబితే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లా అని ప్రశ్నించారు రఘురామ.

వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది_ ఎమ్మెల్సీ అశోక్ బాబు

వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. మంత్రులు సచివాలయానికి రారు.. శాఖాధిపతుల అసలే రారని ఎద్దేవా చేశారు. శాఖాధిపతి లు విధిగా హాజరు కావాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సలహాదారులు పాలన కొనసాగిస్తున్నారని అశోక్ బాబు ఆరోపించారు.

కాగా ఉద్యోగులకు జీతం రాకున్నా ఉద్యోగ సంఘాలు ఇప్పటికీ మౌనం వీడక పోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లో ప్రజల అర్జీలకు సమాధానం చెప్పే వారేలేరన్నారు అశోక్ బాబు.

వైసీపీ ప్రభుత్వం పై సిపిఎం నారాయణ ఫైర్!

అమరరాజ ఫ్యాక్టరీని మూసేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు సిపిఎం నేత నారాయణ. రాష్ట్రంలోని కంపెనీలను వైసీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.

కాగా ప్రధాని మోదీని చూసి వైసీపీ ఎంపీల భయపడుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. వైసిపి శ్వేత పత్రం విడుదల చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

జగన్ ప్రభుత్వం పై నక్క ఆనంద్ బాబు ఫైర్

జగన్ ప్రభుత్వం రైతులకు నీళ్లు అందించడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన డెల్టా ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందన్నారు. గత టిడిపి హయాంలో జూలై రెండో వారంలోనే రైతాంగానికి నీరు విడుదల జరిగేదని స్పష్టం చేశారు.

కాగా పులిచింతల నుంచి 30 టీఎంసీల నీళ్లు సముద్ర పా చేసినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని మండిపడ్డారు. పొలాలకు నీరు అందించే విషయంలో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతుందని ఆనంద్ బాబు పేర్కొన్నారు.