Tag Archives: ys Jagan

Jeeva: యాత్ర 2 కోసం జీవా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Jeeva: డైరెక్టర్ మహీవి రాఘవ్ దర్శకత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందు యాత్ర సినిమా ద్వారా వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులను అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వంటి విషయాలను కూడా ఈ సీక్వెల్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇకపోతే ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో ముమ్ముట్టి నటించారు. అదేవిధంగా వైయస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించారు. ఇక ఈ సినిమాలో జీవా వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించడం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

ఇలా జగన్ పాత్రలో నటించినందుకు జీవా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఈ సినిమాలో ఈయన జగన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. కొన్ని చోట్ల ఈయనకు బదులు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాము అనే భావన కూడా ప్రేక్షకులలో కలుగుతుందని చెప్పాలి.

వైయస్ జగన్మోహన్ రెడ్డి..

ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించినటువంటి నటుడు ముమ్ముటికి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందించారు. ఈ సినిమాలో ఈయన పాత్ర చాలా తక్కువగా ఉంది అయినప్పటికీ నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్రకు వెళ్లడం సిబిఐ విచారణ అరెస్ట్ కావడం బయటకు వచ్చి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవడం తిరిగి పాదయాత్ర జగన్ ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలను చూపించారు.

YS Jagan Mohan Reddy: ఏప్రిల్ నెలలో జగన్ మాజీ సీఎం అవుతారు.. చంద్రబాబు కామెంట్స్ వైరల్!

YS Jagan Mohan Reddy: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్లిపోతారు కానీ అమరావతి మాత్రం ఇక్కడే ఉంటుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

అమరావతి రాజధానిపై విచారణను సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ కే వాయిదా వేసిందన్నారు. నిధులు, విధులకు సంబంధించి సర్పంచ్ లకు సర్వ అధికారాలు కల్పించేలా 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేసి తీరతాం. రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం పంచాయతీలు సర్పంచులకు కేటాయిస్తామని రానున్న ఐదు సంవత్సరాలలో 10% బడ్జెట్ కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఇకపోతే తాము అధికారంలోకి వస్తే కనుక సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీల వేతనం కూడా పెంచుతామని ఈయన వెల్లడించారు. ప్రజలు తమకు సేవ చేయాలని సర్పంచ్లను ఎన్నుకుంటే జగన్ మాత్రం వాలంటీర్లను ఎన్నుకున్నారని వాలంటీర్లు ప్రజలకు కాకుండా జగన్ కి సేవ చేస్తున్నారంటూ ఈయన మండిపడ్డారు.

సీఎం పదవిపై జోస్యం చెప్పిన బాబు..

ఇక జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు ఉంటే మనపై పడితే మనం ఏం చేస్తాము ఇన్ని రోజులు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతా తిరిగిన జగన్ చెల్లి షర్మిల ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వెళుతుంది. ఆయన తల్లి చెల్లి వ్యవహారాన్ని తాను చూసుకోకపోతే మాకేంటి సంబంధం అంటూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు. ఏది ఏమైనా ఏప్రిల్ నెలకు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అవుతారంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Urvashi Rautela: పవన్ కళ్యాణ్ జగన్ ఇద్దరిలో ఊర్వశి ఓటు ఎవరికో తెలుసా?

Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నటువంటి పేరు. ముంబై కి చెందినటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా అందరిని సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో ఈ సినిమాలో ఈమె మై డియర్ మార్కండేయ అనే స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు. ఇక ఈ సాంగులో నటించినటువంటి ఈమె ఈ సినిమా విడుదలవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా పవన్ ఆంటీ ఫ్యాన్స్ మాత్రం ఈమె పాత వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈమె గతంలో కూడా కొంతమంది హీరోలను సీఎం అంటూ సంబోధించడం గమనార్హం.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Urvashi Rautela: పవన్ కళ్యాణ్ కే నా ఓటు…


ఈ క్రమంలోనే చాలామంది పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు వేశారు ఒకవేళ మీరు కనుక ఓటు వేయాలనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డికి వేస్తారా అంటూ ఈమెకు ఒక ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తానని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తనకు నంది అవార్డు ఇవ్వలేదంటూ జగన్ ను విమర్శిస్తూ.. బాబు పై పొగడ్తలు చేసిన నటి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంది అవార్డులు సందడి కనిపించి చాలా కాలమైంది. ఈ విధంగా ఇండస్ట్రీలో వారి నటనను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటిస్తుంది. అయితే ఈ నంది అవార్డుల విషయంలో ప్రభుత్వం టాలెంట్ కి తగ్గట్టుగా కాకుండా, రెకమెండేషన్, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి పేర్లను నంది అవార్డుల జాబితాలో విడుదల చేస్తారనే విమర్శలు వినిపిస్తుంటాయి. అదేవిధంగా నంది అవార్డులను ఎరగా వేసి సినీ సెలబ్రిటీలను రాజకీయాల వైపు తిప్పుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తుంటాయి.

తాజాగా తనకి రావాల్సిన నంది అవార్డు ఇప్పటివరకు రాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సినీనటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కరాటే కళ్యాణి గోరంత దీపం సీరియల్ లో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిందని, తన నటనకు అప్పటి ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకు నంది అవార్డ్ తనకు దక్కలేదని ఆ సీరియల్ గెటప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలను చేసింది.

ఈ ఫోటోలను చూస్తుంటే 2013 సంవత్సరానికి వెళ్ళిపోయాను అప్పుడు ఎంతో సన్నగా అయ్యాను. ఈ సీరియల్ ద్వారా మంచి పేరుతో పాటు నంది అవార్డు కూడా కూడా వచ్చింది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుగారు ఉన్నారు ఆయన దిగిపోయే సమయానికి నంది అవార్డును అనౌన్స్ చేసినప్పటికీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు తనకు నంది అవార్డు ఇవ్వడం లేదంటూ జగన్ పై విమర్శల వర్షం కురిపించింది.

గోరంత దీపం సీరియల్ కోసం తాను ప్రత్యేకంగా తెలంగాణ భాషను నేర్చుకున్నట్లు తెలిపింది.తాను విలన్ గా ఎంతో అద్భుతంగా నటించిన ఈ పాత్రకు జగన్మోహన్ రెడ్డి నంది అవార్డు ఇవ్వకపోవడంతో అందరిని ఎంతో బాధకు గురి చేశాయని ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.ఈమె చేసిన పోస్టర్ పై స్పందించిన నెటిజన్లు 2013లో నంది అవార్డు చేస్తే 2017,2019 వరకు చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నారు. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎందుకొచ్చాడు బాబీ అంటూ… నువ్వు నీ పెయిడ్ పోస్టులు అంటూ నెటిజన్లు కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే కరాటే కళ్యాణి సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు ఈ విధంగా పలుమార్లు ఆమె జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించారు.

ఇకపై హుండిలో కానుకలుకు కూడా క్యూఆర్ కోడ్..! స్కాన్ చేసి పేమెంట్ చేయడమే..!

ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు నడుస్తుంది. ప్రబుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోకి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తుంది.. తాజగా ఆంధ్రప్రదేశ్ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం ను ప్రారంభించారు సిఎం జగన్. క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను ప్రారంభించడం జరిగింది. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలి. దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ పనిచేయనుంది. దేవాలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, ఆస్తుల నిర్వహణ, ఆదాయం, ఖర్చులు, డాష్‌బోర్డు, సిబ్బంది తదితర వివరాలు టెంపుల్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఉంటాయి. భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించేలా క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రానుంది.

దేవాదాయశాఖ పరిధిలో ఆలయాలు, పలు సేవలను ఈ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో భాగం చేసారు. ఇకపై భక్తులు క్యూఆర్ కోడ్ ద్వారా హుండికి కానుకలను సమర్పించే వెసులుబాటు కల్పించారు. అయితే తొలిసారిగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఈ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను మొదలుపెట్టారు.

వైయస్సార్ రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ కాలేదా.. ఏం చేయాలంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అమలు చేస్తున్న స్కీమ్ లలో వైయస్సార్ రైతుభరోసా స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తోంది. ఈ 13,500 రూపాయలలో కేంద్రం నుంచి 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమవుతాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీన పీఎం కిసాన్ స్కీమ్ నగదు జమ కాగా ఆ స్కీమ్ ద్వారా 2,000 రూపాయలు జమ కాని రైతుల ఖాతాలలో జగన్ సర్కార్ 29వ తేదీన 2,000 రూపాయల చొప్పున 1,766 కోట్ల రూపాయలు జమ చేసింది. అర్హులైన రైతుల ఖాతాలలో ఈ మొత్తం జమైంది. రైతు భరోసా నగదుతో పాటు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు 646 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తోంది.

అయితే ఇప్పటికే ప్రభుత్వం నగదు జమ చేయగా ఏదైనా కారణం వల్ల నగదు క్రెడిట్ కాకపోతే 155251 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కు కాల్ చేయడం ద్వారా నగదు ఎందుకు జమ కాలేదనే వివరాలను తెలుసుకోవచ్చు. వైఎస్సార్ రైతుభరోసా స్కీమ్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలను పొందవచ్చు. రైతులకు పెట్టుబడి సాయంలో భాగంగా జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఈ స్కీమ్ తో పాటు జగన్ సర్కార్ వైయస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఈ స్కీమ్ కు అర్హులై ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే గ్రామ, వార్డ్ వాలంటీర్లను సంప్రదించి సరైన ధృవపత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు.

జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన నాగబాబు.. షాక్ లో పవన్ ఫ్యాన్స్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసల వర్షం కురిపించారు. నాగబాబు ప్రశంసించడం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖల నుంచి జగన్ కు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సినీ రంగం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కరోనా వల్ల నష్టపోయిన సినీ పరిశ్రమకు భారీగా రాయితీలను ప్రకటించారు.

జగన్ రాయితీలను ప్రకటించడంపై నాగబాబు స్పందిస్తూ జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాగబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో శూన్యం ఏర్పడిందని జగన్ తన నిర్ణయం ద్వారా శూన్యాన్ని పూఢ్చేశారని వెల్లడించారు. జగన్ సర్కార్ చొరవ తీసుకోవడం వల్ల సినిమా రంగానికి జవసత్వాలు చేకూరుతాయని నాగబాబు అన్నారు.

సీఎం జగన్ రాయితీల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ స్వాగతిస్తోందని నాగబాబు అన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో సీఎం జగన్ ఆదుకున్నారని నాగబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో 3 నెలల ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే, జూన్‌ నెలల చార్జీలను రద్దు చేయడంతో జగన్ సర్కార్ పై అదనంగా 3 కోట్ల రూపాయల భారం పడనుంది.

అయితే నాగబాబు జగన్ కు మద్దతు పలుకుతూ ట్వీట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. నాగబాబు జగన్ కు అనుకూలంగా ట్వీట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కు రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని కామెంట్లు చేస్తారు. జగన్ కు అనుకూలంగా ట్వీట్ చేసి నాగబాబు పవన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారనే చెప్పాలి.

జగన్ పిల్లోడే కానీ నెంబర్ వన్ సీఎం.. బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు బాబు మోహన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సీఎం జగన్ నంబర్ 1 సీఎం అని అన్నారు. ఒకవైపు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తిన బాబు మోహన్ మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాత్రం విమర్శలు చేశారు. సీఎం జగన్ మొదటి స్థానంలో ఉంటే కేసీఆర్ చివరి స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. జగన్ ఏపీ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నాడంటూ బాబు మోహన్ కొనియాడారు.

గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి పెన్షన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ జరిగేలా చేశారని అన్నారు. కరోనా సమయంలో ప్రత్యేక వాహనాల సహాయంతో ప్రతి ఊరిలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకునేలా చేశారని.. రాజకీయ అనుభవం లేని జగన్ అద్భుతంగా పాలన సాగించాడని అన్నారు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కరోనా సమయంలో అస్సలు పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జగన్ ను మెచ్చుకున్నారని.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ అద్భుతంగా పని చేయడంతో ఆయనకు నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ ప్రధానిని మారుస్తానని చెబుతూ ఉంటారని.. రేపటి ఎన్నికల్లో ఎవరు ఎవరిని మారుస్తారో తెలుస్తుందని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లని చెప్పారని కేసీఆర్ కు మాత్రం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్లు మాత్రమే దేవుళ్లు అని అన్నారు. దళితులంటే కేసీఆర్ లెక్క ఉండదని.. పేదోళ్లంటే కేసీఆర్ కు అడ్రస్ ఉండదంటూ బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ చెప్పినా బురదలోకి దిగలేదంటున్న వైసీపీ ఎంపీ..?

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతల కంటే రఘురామ కృష్ణంరాజే జగన్ సర్కార్ పై ఎక్కువగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రఘురామ జగన్ చెప్పినా తాను బురదలోకి దిగలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారాడని అన్నారు.

2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జగన్ తో మూడు నెలల పాటు ట్రావెల్ చేశానని రఘురామ అన్నారు. ఆ సమయంలో నర్సాపురంలో వరదలు వచ్చాయని.. ఈ విషయం తెలిసి జగన్ అక్కడికి పర్యటించడానికి వచ్చాడని తెలిపారు. ఆ సమయంలో పంట పొలంలో జగన్ బురదలో దిగాడని తనను కూడా దిగమని జగన్ చెప్పినా తాను దిగలేదని అన్నారు. జగన్ బురదలో దిగి పంటను చేతులతో పట్టుకుని చూసి రైతులతో మాట్లాడాడని చెప్పారు.

జగన్ రైతులతో చాలా సమయం మాట్లాడి వారికి ధైర్యం చెప్పాడని అన్నారు. అయితే ఆ తరువాత జగన్ చేసీంది కరెక్ట్ అని తనకు అనిపించిందని.. అయితే జగన్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారారని చెప్పారు. జగన్ ప్రస్తుతం ప్రజల మధ్యకే రావడం లేదని… పాదయాత్ర సమయంలో పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ముద్దాడిన జగన్ ఇప్పుడు మారిపోయారని చెప్పారు.

జగన్ ఇప్పటికైనా గతాన్ని స్మరించుకుంటే బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్షంలో ఉన్న సమయంలో చేస్తున్న పనులకు తేడా గమనించాలని సూచించారు. రఘురామ వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది

జగన్ మరో సంచలన నిర్ణయం.. వాళ్లకు 5 లక్షల రూపాయలు..!

తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వర్షాలు గజగజా వణికిస్తున్నాయి. ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పలు ప్రాంతాల్లో వరదల వల్ల కొంతమంది మృతి చెందారు. తెలంగాణతో పోలిస్తే మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నా చనిపోయిన వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. దీంతో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయారని ఈ నెల 31వ తేదీలోపు పంటనష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని.. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ వేగంగా జరగాలని చెప్పారు.

నేడు కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన జగన్ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, భారీ వర్షాలు, వరదలు, నాడు నేడు, ఇతర అంశాల గురించి సీఎం జగన్ ప్రధానంగా చర్చించారు. ఇళ్లు కూలిన వారికి తక్షణమే సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని.. కలెక్టర్లు ఇళ్లు కూలిన వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు.

చనిపోయిన వాళ్ల కుటుంబాలకు పరిహారం అందే విధంగా కలెక్టర్లే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపే బడ్జెట్ ప్రతిపాదనలు కూడా పూర్తి కావాలని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్లను సీఎం అభినందించారు.