Talking SaiBaba statue : విశాఖపట్నం నగరంలో ఒక కాలనీలో అద్భుతం.. ఏకంగా గుడిలో దేవుడు భక్తులతో మాట్లాడుతున్నాడు. ఈ కలియుగంలో అలాంటివి జరుగుతాయా? నమ్మొచ్చా?? అనే అనుమానం కలుగవచ్చు అయితే నిజంగానే వైజాగ్ నగరం చిన గదిలి ప్రాంతంలోని నార్త్ షిరిడి ఆలయంలో సాయి బాబా విగ్రహం భక్తులతో మాట్లాడుతోంది. దీంతో ఈ విషయం తెలిసీ చుట్టూ పక్కల ఉన్న ఎంతో మంది సాయి భక్తులు ఆ విగ్రహాన్ని చూడటానికి ఎగబడుతున్నారు.
మాట్లాడే విగ్రహం తయారు చేసిన భక్తుడు…
దేవుడు మనతో మాట్లాడితే ఎలా ఉంటింది, ఒక్క ఓదార్పు మాట మన బాధను తగ్గిస్తుంది. ఆ ప్రయత్నమే ఒక భక్తుడు చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ పట్టభద్రుడు అయిన వై.రవిచంద్ మూడేళ్లు శ్రమించి మాట్లాడే రోబోటిక్ సాయి బాబా విగ్రహాన్ని తయారు చేశారు. మొదట కొన్నెల్ల క్రితం మైనపు సాయి బాబా విగ్రహాన్ని తయారుచేసిన రవిచంద్రన్ ఆ సాయి బాబా గుడికే ఇచ్చారు. అప్పుడు చాలామంది భక్తులు ఈ విగ్రహం మాట్లాడితే ఎంత బాగుంటుందో అంటూ అనడం చూసి మూడేళ్లు శ్రమించి సిలికాన్ రసాయ పదార్థంతో ముఖాన్ని, మిగిలిన భాగాలు కెనడా నుంచి సమకూర్చుకున్న ప్రత్యేక ఫైబర్ గ్లాస్ ను ఉపయోగించి సాయిబాబా విగ్రహం తయారు చేశారు.
దీంతో ఈ విగ్రహాన్ని చూసేవారికి అక్కడ స్వయంగా బాబానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. రోబో సాయిబాబా విగ్రహానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వాయిస్ సింక్రనైజేషన్ కల్పించడంతో బాబా విగ్రహం కళ్ళు కదపడం, మాట్లాడటం, తల కదిలించడం చేస్తుంది. అలా బాబా స్వయంగా భక్తులతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోబోటిక్ సాయి బాబా విగ్రహం భక్తులను ఆకర్షస్తోంది. ఎక్కడి నుండో ఆ విగ్రహాన్ని దర్శించుకోడానికి భక్తులువస్తున్నారు. విగ్రహం చెప్పే ప్రవచనలు సూక్తులు వింటున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…