Thamannah: జైలర్ నా వల్లే హిట్ అయింది.. నిర్మాతలను భారీగా డిమాండ్ చేస్తున్న తమన్నా?

Thamannah: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తమన్న ఒకరు. ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల తమన్నా రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ సినిమాలో ఒక పాటలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో తమన్నా నువ్వు కావాలయ్యా అనే పాటలో నటించారు.

ఇక ఈ సినిమాలో ఈమె చేసినటువంటి డాన్స్ కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాటకు రీల్స్ చేస్తూ భారీ స్థాయిలో వైరల్ చేశారు. ఇక ఈ పాట ఎంతో మంచి సక్సెస్ కావడంతోనే సినిమా కూడా మంచి సక్సెస్ అయింది అంటూ తమన్నా నిర్మాతల దగ్గర ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారట.

రెమ్యూనరేషన్ పెంచిన తమన్నా..
ఇలా నా వల్లే జైలర్ సినిమా హిట్ అయింది అంటూ ఈమె తన తదుపరి సినిమాలకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఇలా ఈ పాట హిట్ కావడంతో ఈమె తదుపరి సినిమాలకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని ఒక్కో సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారని తెలుస్తుంది. మరి తమన్నా రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈమె సౌత్ సినిమాలకు కాస్త దూరమై బాలీవుడ్ సినిమాలలోనే నటిస్తూ బిజీగా ఉన్నారు.