సినీ ప్రపంచమంటేనే అందని ఆకాశం లాంటిది. ఆ ఆకాశానికి ఆశల నిచ్చెనలేస్తూ అందుకోలేని తీరాలకోసం పరుగులు పెట్టే నవ కధానాయికల బలహీనతలను ఆసరాగా చేసుకుని కోరిక తీరిస్తేనే అవకాశమిస్తామంటూ వేధించే సినీరంగ ప్రముఖుల కోసం మీటూ ఉద్యమం మొదలైంది. కాస్త లేటైనా లేటెస్ట్ గా మొదలైన ఈ ఉద్యమంలో శ్రీరెడ్డి.. గాయత్రి గుప్తా..
శ్రీ దత్తా వంటి కొందరు కధానాయికలు మీడియా ముందుకొచ్చి తమ మనోభావాలను వెల్లడించారు. తాజాగా ఈ వివాదానికి తెరలేపుతూ మరో వర్ధమాన కధానాయిక మీడియా ముందు తన నోరు విప్పింది.. వివరాల్లోకి వెళ్తే..
తమిళనటి పూర్ణితయే ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కళ్యాణి పేరుతో ఈమె తమిళంలో సినిమాలు చేసింది. జయం సినిమా తమిళ రీమేక్‌లో సదా చెల్లి పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ పాత్ర పేరు కళ్యాణి కావడంతో ఇక అదే తన పేరుగా తర్వాత సినిమాలకు కాంటిన్యు చేసింది. ఇన్బా, కాత్తి కాప్పల్, ఎస్ఎమ్ఎస్, పెరుంతూ తదితర సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీ కి దూరమైపోయింది. తెలుగులో మళ్లీ మళ్లీ అనే సినిమా కూడా చేసింది. అయితే అవకాశాలు వస్తున్న సమయంలో ఇండస్ట్రీకి ఎందుకు దూరమయ్యావని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.. దీనికి సమాదానంగా ఆమె అవకాశాలు ఇస్తామని అంతా పిలుస్తున్నారు.. మంచి సినిమాలు కదా చేద్దాం అని వెళితే చివరికి వాళ్లు మా కోరిక తీరిస్తేనే నీకు సినిమాలో ఛాన్సిస్తామంటూ అసభ్యకరంగా మాట్లాడటం అనేది కామన్ అయిపోయింది ఆని చెబుతోంది కళ్యాణి. అందుకే తాను సినిమాలు చేయాలనే ఆలోచన వదులుకున్నానని చెప్పింది. గతంలో ఆమె తల్లిని కూడా ఇలాగే వేధించేవారని.. అందుకే ఆమె కూడా సినిమాలకు దూరమైపోయిందని చెప్పిందామె.
కమిట్‌మెంట్ కానీ లేకపోయుంటే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన తాను షాలిని, హన్సిక స్థాయికి ఎదిగి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది కళ్యాణి. కానీ కొందరు కమిట్‌మెంట్ పేరుతో తన కెరీర్ నాశనం చేసారని ఆవేదన చెందింది కళ్యాణి. తాజాగా వెలుగులోకి వచ్చిన కళ్యాణి హాట్ హాట్ కామెంట్స్ తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. చూద్దాం.. మరి ఈమె రియాక్షన్ కు మీటూ ఉద్యమ సభ్యుల యాక్షన్ ఎలా వుంటుందో..?!☺️
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…